శ్రీ బాలాసాహెబ్ థాకరే జీ వర్ధంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. శ్రీ థాకరే జీ ఒక దార్శనికుడు, మహారాష్ట్ర అభివృద్ధి ని సాధించాలి అనే ఆశయ సాధనకు, మరాఠీ ప్రజానీకానికి సాధికారితను కల్పించడానికి ఆయన కృషి చేశారు అని శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
సామాజిక ప్రసార మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ప్రధాని పొందుపరిచిన ఒక సందేశంలో, ఈ కింది విధంగా పేర్కొన్నారు:
‘‘మహనీయుడు బాలాసాహెబ్ థాకరే జీ కి ఆయన వర్ధంతి సందర్భంగా నేను గౌరవపూర్వకంగా అంజలి ఘటిస్తున్నాను. ఆయన మహారాష్ట్ర అభివృద్ధి సాధనకు, మరాఠీ ప్రజలకు సాధికారిత కల్పనకు కృషి చేశారు. భారతీయ సంస్కృతిని, విలువలను వర్ధిల్లజేస్తూ ఉండాలని థాకరే జీ దృఢంగా విశ్వసించారు. ధాకరే జీ వినిపించిన ధీర గంభీర స్వరం, తనకున్న ధ్యేయాల పట్ల ఆయన కనబర్చిన మొక్కవోని అంకిత భావం తరాల తరబడి ప్రేరణను అందిస్తూనే ఉంటాయి.’’
I pay homage to the great Balasaheb Thackeray Ji on his Punya Tithi. He was a visionary who championed the cause of Maharashtra’s development and the empowerment of Marathi people. He was a firm believer in enhancing the pride of Indian culture and ethos. His bold voice and…
— Narendra Modi (@narendramodi) November 17, 2024
महान बाळासाहेब ठाकरे जी यांच्या पुण्यतिथीनिमित्त मी त्यांना आदरांजली अर्पण करतो. महाराष्ट्राचा विकास आणि मराठी लोकांच्या सक्षमता यासाठी आग्रही असे ते एक द्रष्टे व्यक्तिमत्व होते. भारतीय संस्कृती आणि मूल्यांचे संवर्धन करून त्याविषयीचा अभिमान वृद्धिंगत करण्यावर त्यांचा दृढ…
— Narendra Modi (@narendramodi) November 17, 2024