చలనచిత్ర రంగంలో ప్రముఖ నటుడు తిరు ఢిల్లీ గణేశ్ ఈ రోజు మరణించిన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. తిరు ఢిల్లీ గణేశ్ లో గొప్ప నటనా పాటవం మూర్తీభవించిందని, ఆయన తాను పోషించిన ప్రతి పాత్రకు జతపరిచిన ప్రజ్ఞకు, భిన్న తరాల ప్రేక్షకుల మనస్సులను చూరగొన్న సామర్థ్యానికి గాను ప్రేక్షకలోకం ఆయనను ఆప్యాయంగా స్మరించుకొంటుందని శ్రీ మోదీ అన్నారు.
శ్రీ నరేంద్ర మోదీ ‘ఎక్స్’ లో పోస్ట్ చేసిన ఒక సందేశంలో ఈ కింది విధంగా పేర్కొన్నారు:
చలనచిత్ర రంగంలో ప్రముఖ కళాకారుడు తిరు ఢిల్లీ గణేశ్ గారు మన మధ్య ఇక లేరని తెలిసి ఎంతో బాధ పడ్డాను. ఆయనలో గొప్ప నటనా పాటవం మూర్తీభవించింది. తాను పోషించిన ప్రతి పాత్రలోను కనబరిచిన ప్రజ్ఞకు, భిన్న తరాల ప్రేక్షకుల మనస్సులను చూరగొన్న అభినయ ప్రతిభకు గాను ఆయనను ప్రేక్షకలోకం ఆప్యాయంగా స్మరించుకొంటుంది. రంగస్థలమన్నా కూడా ఆయనకు ఎనలేని మక్కువ ఉండేది. ఆయన కుటుంబసభ్యులకు, అభిమానులకు నేను సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఓమ్ శాంతి.’’
***
Deeply saddened by the passing of the illustrious film personality, Thiru Delhi Ganesh Ji. He was blessed with impeccable acting skills. He will be fondly remembered for the depth he brought to each role and for his ability to connect with viewers across generations. He was also…
— Narendra Modi (@narendramodi) November 10, 2024