Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఛత్రపతి శివాజీ మహారాజ్ ఔన్నత్యానికి, ధైర్యసాహసాలకు రాయ్‌గఢ్ ఒక ప్రతీక; ధైర్యం, నిర్భయత్వాలకు ప్రతిరూపం: ప్రధానమంత్రి


   శివాజీ మ‌హారాజ్ విశిష్ట వారసత్వం, వ్యూహాత్మక మేధ, నాయకత్వ పటిమకు రాయ్‌గఢ్ఒ క ప్రతీకగా నిలిచిందని ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ కొనియాడారు. అలాగే ఈ ఏడాది జాతీయ ఐక్యతా దినోత్సవంలో రాయ్‌గఢ్ కు ప్రతిష్ఠాత్మక స్థానమివ్వడం తనకెంతో సంతోషం కలిగించిందని తెలిపారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:

   ‘‘ఛత్రపతి శివాజీ మహారాజ్ ఔన్నత్యానికి, ధైర్యసాహసాలకు రాయగడ ఒక ప్రతీక. ధైర్యం, నిర్భీకతకు ఇదో పర్యాయపదం. ఈ సంవత్సరం జాతీయ ఐక్యతా దినోత్సవం రాయ్‌గఢ్ కు  ప్రతిష్ఠాత్మక స్థానమివ్వడం నాకెంతో సంతోషం కలిగించింది’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

 

***

MJPS/RT