నా ప్రియమైన దేశప్రజలారా! నమస్కారం. ‘మన్ కీ బాత్’ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. నా జీవితంలో మరపురాని క్షణాలేవని మీరు నన్ను అడిగితే చాలా సంఘటనలు గుర్తుకు వస్తాయి. కానీ చాలా ప్రత్యేకమైన మరపురాని ఒక క్షణం ఉంది– అది గత సంవత్సరం నవంబర్ 15 వ తేదీన జరిగింది. ఆరోజు నేను భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా జార్ఖండ్‌లోని ఆయన జన్మస్థలమైన ఉలిహాతు గ్రామానికి వెళ్ళాను. ఈ యాత్ర నాపై చాలా ప్రభావం చూపింది. ఈ పుణ్యభూమి మట్టిని తలతో తాకే భాగ్యం పొందిన దేశ తొలి ప్రధానమంత్రిని నేనే. ఆ క్షణంలో స్వాతంత్య్ర పోరాటంలో ఉన్న శక్తి తెలిసిరావడమే కాకుండా ఈ భూ శక్తితో అనుసంధానమయ్యే అవకాశం కూడా వచ్చింది. ఒక సంకల్పాన్ని నెరవేర్చేందుకు చేసే సాహసం దేశంలోని కోట్లాది ప్రజల భవిష్యత్తును ఎలా మార్చగలదో నేను గ్రహించాను.
మిత్రులారా! భారతదేశం ప్రతి యుగంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొంది. ప్రతి యుగంలో ఈ సవాళ్లను ఎదుర్కొనే అసాధారణ భారతీయులు జన్మించారు. నేటి ‘మన్ కీ బాత్‘లో ధైర్యం, దూరదృష్టి ఉన్న ఇద్దరు మహానాయకుల గురించి చర్చిస్తాను. వారి 150వ జయంతి ఉత్సవాలను జరుపుకోవాలని దేశం నిర్ణయించింది. అక్టోబర్ 31వ తేదీన సర్దార్ పటేల్ 150వ జయంతి సంవత్సరం ప్రారంభమవుతుంది. దీని తరువాత భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి సంవత్సరం నవంబర్ 15వ తేదీన మొదలవుతుంది. ఈ మహానుభావులు ఇద్దరూ వేర్వేరు సవాళ్లను ఎదుర్కొన్నారు. అయితే ఇద్దరి దృక్కోణం దేశ సమైక్యతే.
మిత్రులారా! గడిచిన సంవత్సరాల్లో దేశం మహానాయకుల జయంతిని కొత్త శక్తితో జరుపుకోవడం ద్వారా కొత్త తరానికి కొత్త స్ఫూర్తిని ఇచ్చింది. మనం మహాత్మా గాంధీ 150వ జయంతిని ఎంత ప్రత్యేకంగా జరుపుకున్నామో మీకు గుర్తుండే ఉంటుంది. న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ నుండి ఆఫ్రికాలోని చిన్న గ్రామాల వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు భారతదేశ సత్యం, అహింసల సందేశాన్ని అర్థం చేసుకున్నారు. తిరిగి తెలుసుకున్నారు. అలాగే జీవించారు. యువకుల నుండి వృద్ధుల వరకు, భారతీయుల నుండి విదేశీయుల వరకు ప్రతి ఒక్కరూ గాంధీజీ బోధనలను కొత్త సందర్భంలో అర్థం చేసుకున్నారు. కొత్త ప్రపంచ పరిస్థితుల్లో వాటిని తెలుసుకున్నారు. మనం స్వామి వివేకానంద 150వ జయంతిని జరుపుకున్నప్పుడు దేశ యువత భారతదేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక శక్తిని కొత్త పరిభాషలో అర్థం చేసుకుంది. మన గొప్ప వ్యక్తులు మరణించినంత మాత్రాన వారి ప్రభావం కోల్పోలేదని, వారి జీవితాలు మన వర్తమానాన్ని భవిష్యత్తుకు మార్గాన్ని చూపుతుందన్న భరోసా వీటివల్ల ఏర్పడుతుంది.
మిత్రులారా! ఈ మహనీయుల 150వ జయంతి ఉత్సవాలను జాతీయ స్థాయిలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మీ భాగస్వామ్యం మాత్రమే ఈ ప్రచారానికి జీవం పోస్తుంది. ఈ ఉత్సవాలకు జీవం అందిస్తుంది. ఈ ప్రచారంలో మీరందరూ భాగస్వాములు కావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఉక్కు మనిషి సర్దార్ పటేల్‌కి సంబంధించిన మీ ఆలోచనలను, కార్యక్రమాలను # సర్దార్150 తో పంచుకోండి. #బిర్సాముండా150తో బిర్సా ముండా స్ఫూర్తిని ప్రపంచానికి అందించండి. మనం కలసికట్టుగా ఈ ఉత్సవాలను భిన్నత్వంలో భారతదేశ ఏకత్వాన్ని చాటేవిధంగా, గొప్ప వారసత్వాన్ని వికాస ఉత్సవంగా జరుగపుకుందాం.
నా ప్రియమైన దేశవాసులారా! ‘ఛోటా భీమ్’ టీవీలో కనిపించడం ప్రారంభించిన ఆ రోజులను మీరు తప్పక గుర్తుంచుకోవాలి. ‘ఛోటా భీమ్’ అంటే ఎంత ఉత్కంఠ ఉండేదో పిల్లలు ఎప్పటికీ మర్చిపోలేరు. ఈ రోజు ఢోలక్ పూర్ డోలు భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల పిల్లలను కూడా ఆకర్షిస్తుంది అంటే మీరు ఆశ్చర్యపోతారు. అలాగే మన ఇతర యానిమేషన్ సీరియళ్లు ‘కృష్ణ’, ‘హనుమాన్’, ‘మోటు–పత్లు’లకు కూడా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. భారతీయ యానిమేషన్ పాత్రలు, ఇక్కడి యానిమేషన్ సినిమాలు వాటి కంటెంట్, సృజనాత్మకత కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజల మక్కువను చూరగొంటున్నాయి. స్మార్ట్‌ఫోన్ నుండి సినిమా స్క్రీన్ వరకు, గేమింగ్ కన్సోల్ నుండి వర్చువల్ రియాలిటీ వరకు యానిమేషన్ ప్రతిచోటా ఉంటుందని మీరు తప్పక చూసి ఉంటారు. యానిమేషన్ ప్రపంచంలో భారత్ సరికొత్త విప్లవం దిశగా అడుగులు వేస్తోంది. భారతదేశ గేమింగ్ స్పేస్ కూడా వేగంగా విస్తరిస్తోంది. ఈ రోజుల్లో భారతీయ ఆటలు కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్నాయి. కొన్ని నెలల క్రితం నేను భారతదేశంలోని ప్రముఖ గేమర్లను కలిశాను. అప్పుడు భారతీయ గేమ్‌ల అద్భుతమైన సృజనాత్మకత, నాణ్యతను తెలుసుకునే, అర్థం చేసుకునే అవకాశం నాకు లభించింది. నిజానికి దేశంలో సృజనాత్మక శక్తి తరంగం నడుస్తోంది. యానిమేషన్ ప్రపంచంలో ‘మేడ్ ఇన్ ఇండియా’, ‘మేడ్ బై ఇండియన్స్’ ప్రబలంగా ఉన్నాయి. నేడు భారతీయ ప్రతిభ కూడా విదేశీ నిర్మాణాలలో కూడా ముఖ్యమైన భాగంగా మారుతున్నదని తెలుసుకుంటే మీరు సంతోషిస్తారు. ప్రస్తుత స్పైడర్ మ్యాన్ అయినా, ట్రాన్స్ఫార్మర్స్ అయినా ఈ రెండు సినిమాల్లో హరినారాయణ్ రాజీవ్ అందించిన సహకారానికి ప్రజల ప్రశంసలు లభించాయి. భారతదేశ యానిమేషన్ స్టూడియోలు డిస్నీ, వార్నర్ బ్రదర్స్ వంటి ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణ సంస్థలతో కలిసి పని చేస్తున్నాయి.
మిత్రులారా! నేడు మన యువత అసలైన భారతీయ కంటెంట్‌ను సిద్ధం చేస్తోంది. మన సంస్కృతికి ప్రతిబింబమైన ఇవి ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్నాయి. ఇతర పరిశ్రమలకు బలాన్ని ఇచ్చే స్థాయిలో యానిమేషన్ రంగం నేడు పరిశ్రమ రూపాన్ని సంతరించుకుంది. ఈ రోజుల్లో వీఆర్ టూరిజం చాలా ప్రసిద్ధి చెందుతోంది. మీరు వర్చువల్ యాత్ర ద్వారా అజంతా గుహలను చూడవచ్చు. కోణార్క్ మందిర ఆవరణలో షికారు చేయవచ్చు. లేదా వారణాసి ఘాట్లను ఆస్వాదించవచ్చు. ఈ వీఆర్ యానిమేషన్లన్నీ భారతీయులు సృష్టించినవే. వీఆర్ ద్వారా ఈ స్థలాలను చూసిన తర్వాత చాలా మంది ఈ పర్యాటక ప్రదేశాలను వాస్తవంగా సందర్శించాలని కోరుకుంటారు. అంటే పర్యాటక గమ్యస్థానాల వర్చువల్ టూర్ ప్రజల మనస్సుల్లో ఉత్సుకతను సృష్టించడానికి ఒక మాధ్యమంగా మారింది. నేడు ఈ రంగంలో యానిమేటర్లతో పాటు స్టోరీ టెల్లర్లు, రచయితలు, వాయిస్ ఓవర్ నిపుణులు, సంగీతకారులు, గేమ్ డెవలపర్లు, వర్చువల్ రియాలిటీ– ఆగ్మెంటెడ్ రియాలిటీ నిపుణులకు కూడా డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. కాబట్టి సృజనాత్మకతను పెంచుకోవాలని నేను భారతదేశ యువతకు చెప్తాను. ఎవరికి తెలుసు– ప్రపంచంలోని తర్వాతి సూపర్ హిట్ యానిమేషన్ మీ కంప్యూటర్ నుండే రావచ్చేమో! తర్వాతి వైరల్ గేమ్ మీ సృష్టే కావచ్చు! విద్యాపరమైన యానిమేషన్లలో మీ ఆవిష్కరణ గొప్ప విజయాన్ని సాధించగలదు. ‘వరల్డ్ యానిమేషన్ డే’ కూడా ఈ అక్టోబర్ 28 వ తేదీన అంటే రేపు జరుపుకుంటున్నాం. రండి…. భారతదేశాన్ని ప్రపంచ యానిమేషన్ పవర్ హౌస్‌గా మార్చాలని సంకల్పిద్దాం.
నా ప్రియమైన దేశప్రజలారా! స్వామి వివేకానంద ఒకప్పుడు విజయ మంత్రాన్ని అందించారు. ‘ఒక ఆలోచన తీసుకోండి. ఆ ఆలోచనను మీ జీవితంగా చేసుకోండి. దాని గురించి ఆలోచించండి. దాని గురించి కలలుగనండి. జీవించడం ప్రారంభించండి.’ అనే ఆ విజయ మంత్రం ఆధారంగా ఆత్మ నిర్భర్ భారత్ విజయం కూడా కొనసాగుతోంది. ఈ ప్రచారం మన సామూహిక చైతన్యంలో భాగమైంది. అడుగడుగునా నిరంతరం మనకు స్ఫూర్తిగా నిలిచింది. స్వావలంబన మన విధానం మాత్రమే కాదు– అది మన అభిరుచిగా మారింది. చాలా సంవత్సరాలు కాలేదు– భారతదేశంలో సంక్లిష్టమైన సాంకేతికత అభివృద్ధి చెందుతుందని పదేళ్ల కిందట ఎవరైనా చెప్తే చాలా మంది నమ్మేవారు కాదు. చాలా మంది అపహాస్యం చేసేవారు. కానీ ఈ రోజు దేశ విజయాలను చూసి వారే ఆశ్చర్యపోతున్నారు. స్వయం సమృద్ధి పొందిన తర్వాత భారతదేశం ప్రతి రంగంలో అద్భుతాలు చేస్తోంది. ఒక్కసారి ఊహించుకోండి– ఒకప్పుడు మొబైల్ ఫోన్ల దిగుమతిదారుగా ఉన్న భారతదేశం నేడు ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద తయారీదారుగా మారింది. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యధికంగా రక్షణ పరికరాల కొనుగోలుదారుగా ఉన్న భారతదేశం ఇప్పుడు 85 దేశాలకు కూడా ఎగుమతి చేస్తోంది. అంతరిక్ష సాంకేతికతలో ఈ రోజు భారతదేశం చంద్రుని దక్షిణ ధృవాన్ని చేరుకున్న మొదటి దేశంగా మారింది. నాకు చాలా నచ్చిన విషయం ఏమిటంటే ఈ స్వావలంబన ప్రచారం ఇకపై కేవలం ప్రభుత్వ ప్రచారం కాదు– ఇప్పుడు స్వయం ఆధారిత భారతదేశ ప్రచారం ప్రజల ప్రచార ఉద్యమంగా మారుతోంది. ప్రతి రంగంలో దేశం విజయాలు సాధిస్తోంది. ఉదాహరణకు ఈ నెలలో లద్దాక్ లోని హాన్లేలో ఆసియాలోనే అతిపెద్ద ఇమేజింగ్ టెలిస్కోప్ MACEను కూడా ప్రారంభించాం. ఇది 4300 మీటర్ల ఎత్తులో ఉంది. అందులో విశేషమేంటో తెలుసుకుందాం! ఇది భారతదేశ తయారీ– ‘మేడ్ ఇన్ ఇండియా’. మైనస్ 30 డిగ్రీల చల్లటి వాతావరణం ఉన్న ప్రదేశంలో– ఆక్సిజన్ కొరత కూడా ఉన్న ప్రదేశంలో– మన శాస్త్రవేత్తలతో పాటు స్థానిక పరిశ్రమలు ఆసియాలో మరే దేశం చేయని పనిని చేశాయి. హాన్లే టెలిస్కోప్ సుదూర ప్రపంచాన్ని చూస్తూ ఉండవచ్చు. అది మనకు మరొక విషయాన్ని కూడా చూపుతోంది – అది స్వయం సమృద్ధ భారతదేశ సామర్థ్యం.
మిత్రులారా! మీరు కూడా ఒక పని చేయాలని నేను కోరుకుంటున్నాను. భారతదేశం స్వయం సమృద్ధంగా మారడానికి దోహదపడే ప్రయత్నాలకు వీలైనన్ని ఎక్కువ ఉదాహరణలను పంచుకోండి. మీ పరిసరాల్లో మీరు చూసిన కొత్త ఆవిష్కరణ, మీ ప్రాంతంలో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న స్థానిక స్టార్ట్–అప్– ఇలాంటి విశేషాలను #AatmanirbharInnovationతో సోషల్ మీడియాలో రాయండి. స్వావలంబన భారతదేశ ఉత్సవాలు నిర్వహించండి. ఈ పండుగ సీజన్ లో మనమందరం స్వావలంబన భారతదేశ ప్రచారాన్ని మరింత బలోపేతం చేద్దాం. వోకల్ ఫర్ లోకల్ అనే మంత్రంతో మనం మన షాపింగ్ చేద్దాం. ఇది అసాధ్యం కేవలం సవాలుగా ఉన్న నవీన భారతదేశం. ఇక్కడ మేక్ ఇన్ ఇండియా ఇప్పుడు మేక్ ఫర్ ది వరల్డ్‌గా మారింది. ఇక్కడ ప్రతి పౌరుడు ఒక ఆవిష్కర్త. ఇక్కడ ప్రతి సవాలు ఒక అవకాశం. మనం భారతదేశాన్ని స్వయం సమృద్ధంగా మార్చడమే కాకుండా మన దేశాన్ని ప్రపంచవ్యాప్త ఆవిష్కరణల శక్తి కేంద్రంగా బలోపేతం చేయాలి.
నా ప్రియమైన దేశప్రజలారా! మీ కోసం ఒక ఆడియోను వినిపిస్తాను.
(ఆడియో)
ఫ్రాడ్ కాలర్ 1: హలో
బాధితుడు: సార్… నమస్కారం సార్.
ఫ్రాడ్ కాలర్ 1: నమస్తే
బాధితుడు: సార్… చెప్పండి సార్
ఫ్రాడ్ కాలర్ 1: మీరు నాకు పంపిన ఈ FIR నంబర్‌ను చూడండి.. ఈ నంబర్‌పై మాకు 17 ఫిర్యాదులు ఉన్నాయి. మీరు ఈ నంబర్ ను వాడుతున్నారా?
బాధితుడు: నేను దీన్ని వాడను సార్.
ఫ్రాడ్ కాలర్ 1: మీరు ఇప్పుడు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు?
బాధితుడు: సార్.. కర్ణాటక సార్.. నేను ఇప్పుడు ఇంట్లో ఉన్నాను సార్.
ఫ్రాడ్ కాలర్ 1: సరే. మన స్టేట్మెంట్ను రికార్డ్ చేద్దాం. మీరు భవిష్యత్తులో ఎటువంటి సమస్యలను ఎదుర్కోకుండా ఈ నంబర్ ను బ్లాక్ చేయవచ్చు.
బాధితుడు: సరే సార్…
ఫ్రాడ్ కాలర్ 1: నేను ఇప్పుడు మిమ్మల్ని మీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తో కనెక్ట్ చేస్తున్నాను. ఈ నంబర్ ను బ్లాక్ చేసేందుకు మీ స్టేట్మెంట్ను రికార్డ్ చేయండి.
బాధితుడు: సరే సార్…
ఫ్రాడ్ కాలర్ 1: అవును.. చెప్పండి… మీరు ఎవరు? మీ ఆధార్ కార్డును నాకు చూపించండి.. వెరిఫై చేయడానికి నాకు తెలియజేయండి.
బాధితుడు: సార్… నా దగ్గర ఇప్పుడు ఆధార్ కార్డు లేదు.. ప్లీజ్ సార్.
ఫ్రాడ్ కాలర్ 1: ఫోన్లో.. అది మీ ఫోన్లో ఉందా?
బాధితుడు: లేదు సార్
ఫ్రాడ్ కాలర్ 1: మీ ఫోన్లో ఆధార్ కార్డ్ ఫోటో లేదా?
బాధితుడు: లేదు సార్
ఫ్రాడ్ కాలర్ 1: మీకు నెంబర్ గుర్తుందా?
బాధితుడు: సార్.. లేదు సార్.. నంబర్ కూడా గుర్తు లేదు సార్.
ఫ్రాడ్ కాలర్ 1: మేం కేవలం వెరిఫై చేయాలి. వెరిఫై చేసేందుకు కావాలి.
బాధితుడు: లేదు సార్
ఫ్రాడ్ కాలర్ 1: భయపడొద్దు… భయపడొద్దు… మీరు ఏమీ చేయకపోతే భయపడొద్దు.
బాధితుడు: సరే సార్, సరే సార్
ఫ్రాడ్ కాలర్ 1: మీ దగ్గర ఆధార్ కార్డ్ ఉంటే, వెరిఫై చేయడానికి నాకు చూపించండి.
బాధితుడు: లేదు సార్, లేదు సార్. నేను ఊరికి వచ్చాను సార్. ఆధార్ కార్డు ఇంట్లో ఉంది సార్..
ఫ్రాడ్ కాలర్ 1: ఓకే..
రెండో గొంతు: మే ఐ కమ్ ఇన్ సార్
ఫ్రాడ్ కాలర్ 1: కమ్ ఇన్
ఫ్రాడ్ కాలర్ 2: జై హింద్
ఫ్రాడ్ కాలర్ 1: జై హింద్
ఫ్రాడ్ కాలర్ 1: ప్రోటోకాల్ ప్రకారం ఇతని వన్ సైడెడ్ వీడియో కాల్ రికార్డ్ చేయండి. ఓకే?
ఈ ఆడియో కేవలం సమాచారం కోసం మాత్రమే కాదు. ఇది వినోదం కలిగించే ఆడియో కాదు. ఈ ఆడియో తీవ్రమైన ఆందోళనతో వచ్చింది. మీరు ఇప్పుడే విన్న సంభాషణ డిజిటల్ అరెస్ట్ మోసంపై ఉంది. ఈ సంభాషణ బాధితుడికి, మోసగాడికి మధ్య జరిగింది. డిజిటల్ అరెస్ట్ మోసంలో కాలర్లు కొన్నిసార్లు పోలీసులుగా, కొన్నిసార్లు సీబీఐ అధికారులుగా, కొన్నిసార్లు నార్కోటిక్స్ అధికారులుగా, కొన్నిసార్లు రిజర్వ్ బ్యాంక్ అధికారులుగా వేర్వేరు హోదాలను పెట్టుకుని, మాట్లాడతారు. చాలా నమ్మకంతో చేస్తారు. చాలా మంది ‘మన్ కీ బాత్’ శ్రోతలు ఈ విషయాన్ని ఖచ్చితంగా చర్చించాలని నాతో అన్నారు. ఈ మోసం ముఠా ఎలా పని చేస్తుందో, ఈ ప్రమాదకరమైన ఆట ఏమిటో నేను మీకు చెప్తాను. మీరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇతరులకు అర్థం చేయించడం కూడా అంతే ముఖ్యం. మొదటి ఉపాయం – మీ వ్యక్తిగత సమాచారం అంతటినీ వారు సేకరిస్తారు. “మీరు గత నెలలో గోవా వెళ్లారు. కదా? మీ అమ్మాయి ఢిల్లీలో చదువుతుంది కదా?” ఇలా వారు మీ గురించి చాలా సమాచారాన్ని సేకరిస్తారు. మీరు ఆశ్చర్యపోయేలా సమాచారాన్ని సేకరిస్తారు. రెండవ ఉపాయం – భయానక వాతావరణాన్ని సృష్టించడం. యూనిఫాం, ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు, చట్టపరమైన విభాగాలు, అవి మిమ్మల్ని ఎంతగా భయపెడతాయంటే ఫోన్లో మాట్లాడేటప్పుడు మీరు ఆలోచించలేరు. ఆపై వారి మూడవ ఉపాయం ప్రారంభమవుతుంది. మూడవ ఉపాయం – సమయం ఒత్తిడి. ‘మీరు ఇప్పుడు నిర్ణయించుకోవాలి. లేకపోతే మిమ్మల్ని అరెస్టు చేయవలసి ఉంటుంది‘ –ఇలా ఈ వ్యక్తులు బాధితులు భయపడేంతగా చాలా మానసిక ఒత్తిడిని కలిగిస్తారు. డిజిటల్ అరెస్ట్ బాధితుల్లో ప్రతి వర్గం, ప్రతి వయో బృందంలోనివారు ఉన్నారు. ప్రజలు కష్టపడి సంపాదించిన లక్షల రూపాయలను భయంతో నష్టపోయారు. మీకు ఎప్పుడైనా ఇలాంటి కాల్ వస్తే భయపడాల్సిన పనిలేదు. ఫోన్ కాల్ లేదా వీడియో కాల్ ద్వారా ఏ దర్యాప్తు సంస్థ కూడా ఇలాంటి విచారణలు చేయదని మీరు తెలుసుకోవాలి. డిజిటల్ భద్రత లోని మూడు దశలను నేను మీకు చెప్తాను. ఈ మూడు దశలు – ‘వేచి ఉండండి– ఆలోచించండి– చర్య తీసుకోండి’ కాల్ వస్తే ‘వేచి ఉండండి‘. భయాందోళనలకు గురికాకండి. ప్రశాంతంగా ఉండండి. తొందరపాటుతో ఎటువంటి పనులూ చేయకండి. మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ ఇవ్వకండి. వీలైతే స్క్రీన్ షాట్ తీసుకొని రికార్డింగ్ చేయండి. దీని తరువాత రెండవ దశ. మొదటి దశ వేచి చూడడం. రెండో దశ ఆలోచించడం. ఏ ప్రభుత్వ సంస్థ కూడా ఫోన్లో ఇలాంటి బెదిరింపులు చేయదు. వీడియో కాల్ల ద్వారా విచారణ చేయదు. ఇలా డబ్బులు డిమాండ్ చేయదు. మీకు భయం అనిపిస్తే ఏదో పొరపాటు జరిగిందని అర్థం చేసుకోండి. మొదటి దశ, రెండవ దశ తర్వాత ఇప్పుడు నేను మూడవ దశ గురించి చెప్తాను. మొదటి దశలో నేను చెప్పాను ‘వేచి చూడండి’ అని. రెండవ దశలో ‘ఆలోచించండి’. మూడవ దశలో – ‘చర్య తీసుకోండి’. జాతీయ సైబర్ హెల్ప్‌లైన్ 1930కి డయల్ చేయండి. cybercrime.gov.inలో రిపోర్ట్ చేయండి. మీ కుటుంబానికి, పోలీసులకు తెలియజేయండి. సాక్ష్యాలను భద్రపరచండి. ‘వేచి ఉండండి‘, ‘ఆలోచించండి‘, ఆపై ‘చర్య తీసుకోండి’. ఈ మూడు దశలు మీ డిజిటల్ భద్రతకు రక్షణగా మారతాయి.
మిత్రులారా! చట్టంలో డిజిటల్ అరెస్ట్ లాంటి వ్యవస్థ లేదని మరోసారి చెప్తున్నాను. ఇది కేవలం మోసం, వంచన, అబద్ధం. ఇది దుష్టుల ముఠా చేసే పని. ఇలా చేస్తున్న వారు సమాజానికి శత్రువులని మళ్ళీ చెప్తున్నాను. డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న మోసాన్ని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతో దర్యాప్తు సంస్థలన్నీ కలిసి పనిచేస్తున్నాయి. ఈ ఏజెన్సీల మధ్య సమన్వయం కోసం నేషనల్ సైబర్ కో–ఆర్డినేషన్ సెంటర్‌ను ఏర్పాటు జరిగింది. ఇలాంటి మోసాలకు పాల్పడిన వేలాది వీడియో కాలింగ్ ఐడీలను దర్యాప్తు సంస్థలు బ్లాక్ చేశాయి. లక్షలాది సిమ్ కార్డులు, మొబైల్ ఫోన్లు, బ్యాంకు ఖాతాలు కూడా బ్లాక్ అయ్యాయి. ఏజెన్సీలు తమ పనిని చేస్తున్నాయి. కానీ డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసాలను నివారించడానికి చాలా ముఖ్యమైంది – ప్రతి ఒక్కరికీ అవగాహన, ప్రతి పౌరునికీ అవగాహన. ఈ రకమైన సైబర్ మోసాలకు గురైన వ్యక్తులు దాని గురించి వీలైనంత ఎక్కువ మందికి తెలియజేయాలి. అవగాహన కోసం మీరు #SafeDigitalIndia ను ఉపయోగించవచ్చు. సైబర్ స్కామ్‌కు వ్యతిరేకంగా ప్రచారంలో విద్యార్థులను భాగస్వామ్యం చేయవలసిందిగా పాఠశాలలు, కళాశాలలను కూడా నేను కోరుతున్నాను. సమాజంలోని ప్రతి ఒక్కరి కృషితోనే మనం ఈ సవాలును ఎదుర్కోగలం.
నా ప్రియమైన దేశప్రజలారా! మన పాఠశాల పిల్లల్లో చాలా మంది కాలిగ్రఫీపై చాలా ఆసక్తిని కలిగి ఉంటారు. దీని ద్వారా మన చేతిరాత శుభ్రంగా, అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. నేడు జమ్మూ–కాశ్మీర్లో స్థానిక సంస్కృతిని ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు దీన్ని ఉపయోగిస్తున్నారు. అక్కడి అనంతనాగ్‌కు చెందిన ఫిర్దౌసా బషీర్ గారికి కాలిగ్రఫీలో నైపుణ్యం ఉంది. దీని ద్వారా స్థానిక సంస్కృతికి సంబంధించిన అనేక అంశాలను ముందుకు తీసుకువస్తున్నారు. ఫిర్దౌసా గారి కాలిగ్రఫీ స్థానిక ప్రజలను, ముఖ్యంగా యువతను ఆకర్షిస్తోంది. ఉదంపూర్‌కు చెందిన గోరీనాథ్ గారు కూడా ఇలాంటి ప్రయత్నమే చేస్తున్నారు. ఒక శతాబ్దానికి పైగా పురాతనమైన సారంగి ద్వారా డోగ్రా సంస్కృతి, వారసత్వ వివిధ రూపాలను సంరక్షించడంలో ఆయన నిమగ్నమై ఉన్నారు. సారంగి రాగాలతో పాటు తమ సంస్కృతికి సంబంధించిన పురాతన కథలు, చారిత్రక సంఘటనలను ఆసక్తికరంగా చెప్తారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో కూడా సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి ముందుకు వచ్చిన ఇలాంటి అసాధారణ వ్యక్తులు చాలా మందిని మీరు కలుస్తారు. డి.వైకుంఠం దాదాపు 50 సంవత్సరాలుగా చేర్యాల్ జానపద కళను ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో నిమగ్నమై ఉన్నారు. తెలంగాణకు సంబంధించిన ఈ కళను ముందుకు తీసుకెళ్ళడంలో ఆయన కృషి అద్భుతం. చేర్యాల్ పెయింటింగ్స్ సిద్ధం చేసే విధానం చాలా ప్రత్యేకమైంది. ఇది స్క్రోల్ రూపంలో కథలను ముందుకు తెస్తుంది. ఇందులో మన చరిత్ర, పురాణాల పూర్తి సంగ్రహావలోకనం లభిస్తుంది. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌కు చెందిన బుట్లూరామ్ మాత్రాజీ అబూజ్ మాడియా తెగకు చెందిన జానపద కళలను సంరక్షించే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఆయన గత నాలుగు దశాబ్దాలుగా ఈ పనిలో ఉన్నారు. ‘బేటీ బచావో–బేటీ పడావో‘, ‘స్వచ్చ భారత్‘ వంటి ప్రచారాలతో ప్రజలను అనుసంధానించడంలో కూడా ఆయన కళ చాలా ప్రభావవంతంగా ఉంది.
మిత్రులారా! కాశ్మీర్‌లోని లోయల నుండి ఛత్తీస్‌గఢ్ అడవుల వరకు మన కళలు, సంస్కృతి ఎలా కొత్త రూపంలో విస్తరిస్తున్నాయో ఇప్పుడే మాట్లాడుకున్నాం. అయితే ఈ విషయం ఇక్కడితో ముగియదు. మన ఈ కళల పరిమళం అంతటా వ్యాపిస్తోంది. ప్రపంచంలోని వివిధ దేశాల ప్రజలు భారతీయ కళలు, సంస్కృతిని చూసి మంత్రముగ్ధులవుతున్నారు. ఉధంపూర్‌లో ప్రతిధ్వనించే సారంగి గురించి చెబుతున్నప్పుడు వేల మైళ్ల దూరంలో ఉన్న రష్యాలోని యాకూత్స్క్ నగరంలో భారతీయ కళల మధురమైన రాగం ప్రతిధ్వనించడం నాకు గుర్తుకు వచ్చింది. ఊహించుకోండి… చలికాలం ఒకటిన్నర రోజులు, మైనస్ 65 డిగ్రీల ఉష్ణోగ్రత, చుట్టూ తెల్లటి మంచు దుప్పటి, అక్కడి థియేటర్లో కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలాన్ని ప్రేక్షకులు మంత్రముగ్ధులై చూస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత శీతల నగరమైన యాకూత్స్క్ లో భారతీయ సాహిత్యం వెచ్చదనాన్ని మీరు ఊహించగలరా? ఇది ఊహ కాదు కానీ నిజం. మనందరినీ గర్వం, ఆనందంతో నింపే సత్యం.
మిత్రులారా! కొన్ని వారాల క్రితం నేను లావోస్ కు వెళ్ళాను. అది నవరాత్రి సమయం. అక్కడ నేను ఒక అద్భుతాన్ని చూశాను. స్థానిక కళాకారులు “ఫలక్ ఫలం” అనే ‘లావోస్ రామాయణం‘ ప్రదర్శించారు. రామాయణం పట్ల మనకున్న అంకితభావమే వారి కళ్లలో శక్తిగా, వారి స్వరంలో సమర్పణా భావంగా కనబడింది. అదేవిధంగా కువైట్‌లో అబ్దుల్లా అల్–బారూన్ గారు రామాయణ మహాభారతాలను అరబిక్ భాషలోకి అనువదించారు. ఈ రచన కేవలం అనువాదం మాత్రమే కాదు– రెండు గొప్ప సంస్కృతుల మధ్య వారధి. ఆయన ప్రయత్నాలు అరబ్ ప్రపంచంలో భారతీయ సాహిత్యంపై కొత్త అవగాహనను పెంచుతున్నాయి. మరొక స్ఫూర్తిదాయక ఉదాహరణ పెరూకు చెందిన ఎర్లిందా గార్సియా అక్కడి యువతకు భరతనాట్యం నేర్పుతున్నారు. మరియా వాల్దెజ్ ఒడిస్సీ నృత్యంలో శిక్షణ ఇస్తున్నారు. ఈ కళల ప్రభావంతో ‘భారతీయ శాస్త్రీయ నృత్యం‘ దక్షిణ అమెరికాలోని అనేక దేశాల్లో ప్రాచుర్యం పొందుతోంది.
మిత్రులారా! విదేశీ గడ్డపై భారతదేశానికి చెందిన ఈ ఉదాహరణలు భారతీయ సంస్కృతి శక్తి ఎంత అద్భుతమైందో చూపిస్తాయి. ఈ శక్తి నిరంతరం ప్రపంచాన్ని తనవైపు ఆకర్షిస్తూనే ఉంటుంది.
“ఎక్కడెక్కడ కళ ఉంటుందో అక్కడక్కడ భారతదేశం ఉంటుంది.”
“సంస్కృతి ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడక్కడ భారతదేశం ఉంటుంది“
నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు భారతదేశం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. భారతదేశ ప్రజలను గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. కాబట్టి మీ అందరికి ఒక విన్నపం… మీ చుట్టూ ఉన్న ఇలాంటి సాంస్కృతిక అంశాలను #CulturalBridges తో పంచుకోండి. అలాంటి ఉదాహరణలను మనం ‘మన్ కీ బాత్’లో మరింత చర్చిస్తాం.
నా ప్రియమైన దేశప్రజలారా! దేశంలోని చాలా ప్రాంతాల్లో చలికాలం మొదలైంది. అయితే ఫిట్నెస్ పై అభిరుచి, ఫిట్ ఇండియా స్ఫూర్తి విషయంలో ఏ వాతావరణానికీ తేడా లేదు. ఫిట్‌గా ఉండే అలవాటు ఉన్నవారు చలి, వేడి, వర్షం గురించి పట్టించుకోరు. భారతదేశంలోని ప్రజలు ఇప్పుడు ఫిట్నెస్ గురించి మరింత అవగాహన పెంచుకుంటున్నందుకు నేను సంతోషిస్తున్నాను. మీ చుట్టుపక్కల ఉన్న పార్కుల్లో ప్రజల సంఖ్య పెరుగుతుండటం కూడా మీరు గమనిస్తూ ఉండాలి. పార్కులో షికారు చేసే వృద్ధులు, యువకులు, యోగా చేసే కుటుంబ సభ్యులను చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నాకు గుర్తుంది– నేను యోగా దినోత్సవం రోజున శ్రీనగర్‌లో ఉన్నప్పుడు వర్షం ఉన్నప్పటికీ చాలా మంది ‘యోగా‘ కోసం ఒక్కచోటికి చేరారు. కొద్దిరోజుల క్రితం శ్రీనగర్‌లో జరిగిన మారథాన్‌లో కూడా ఫిట్‌గా ఉండేందుకు ఇదే ఉత్సాహం కనిపించింది. ఈ ఫిట్ ఇండియా భావన ఇప్పుడు ప్రజా ఉద్యమంగా మారుతోంది.
మిత్రులారా! మన పాఠశాలలు ఇప్పుడు పిల్లల ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ చూపడం చూసి నేను కూడా సంతోషిస్తున్నాను. ఫిట్ ఇండియా స్కూల్ అవర్స్ కూడా ఒక ప్రత్యేక కార్యక్రమం. వివిధ ఫిట్నెస్ కార్యకలాపాల కోసం పాఠశాలలు తమ మొదటి పీరియడ్‌ని ఉపయోగిస్తున్నాయి. చాలా పాఠశాలల్లో కొన్ని రోజులు పిల్లలతో యోగా చేయిస్తారు. కొన్ని రోజులు ఏరోబిక్స్ సెషన్లు ఉంటాయి. కొన్ని రోజులు క్రీడా నైపుణ్యాలను పెంచే పని చేస్తారు. కొన్ని రోజులు ఖో–ఖో, కబడ్డీ వంటి సాంప్రదాయిక ఆటలను ఆడుతున్నారు. దాని ప్రభావం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. హాజరు మెరుగుపడుతుంది. పిల్లల ఏకాగ్రత పెరుగుతుంది. పిల్లలు కూడా సరదాగా ఉంటారు.
మిత్రులారా! నేను ఈ వెల్నెస్ శక్తిని ప్రతిచోటా చూస్తున్నాను. చాలా మంది ‘మన్ కీ బాత్’ శ్రోతలు తమ అనుభవాలను కూడా నాకు పంపారు. కొంతమంది చాలా ఆసక్తికరమైన ప్రయోగాలు చేస్తున్నారు. వీటిలో ఒక ఉదాహరణ ఫ్యామిలీ ఫిట్నెస్ అవర్. అంటే కుటుంబ ఫిట్నెస్ యాక్టివిటీ కోసం ప్రతి వారాంతంలో కుటుంబాలు ఒక గంట కేటాయిస్తున్నాయి. మరో ఉదాహరణ స్వదేశీ ఆటల పునరుద్ధరణ. అంటే కొన్ని కుటుంబాలు తమ పిల్లలకు సాంప్రదాయిక ఆటలను నేర్పిస్తున్నాయి. మీరు మీ ఫిట్నెస్ రొటీన్ అనుభవాన్ని తప్పనిసరిగా #fitIndia పేరుతో సామాజిక మాధ్యమంలో పంచుకోండి. నేను దేశ ప్రజలకు ముఖ్యమైన సమాచారాన్ని కూడా అందించాలనుకుంటున్నాను. ఈసారి దీపావళి పండుగ సర్దార్ పటేల్ జయంతి అయిన అక్టోబర్ 31 న వస్తోంది. మనం ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న “జాతీయ ఐక్యతా దినోత్సవం” రోజున ‘రన్ ఫర్ యూనిటీ‘ని నిర్వహిస్తాం. ఈసారి దీపావళి కారణంగా అక్టోబర్ 29వ తేదీన అంటే మంగళవారంనాడు ‘రన్ ఫర్ యూనిటీ’ జరుగుతుంది. ఇందులో అత్యధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. జాతీయ ఐక్యత మంత్రంతో పాటు ఫిట్నెస్ మంత్రాన్ని ప్రతిచోటా వ్యాప్తి చేయండి.
నా ప్రియమైన దేశవాసులారా! ‘మన్ కీ బాత్‘లో ఈ సారి ఇంతే! మీరు మీ అభిప్రాయాలను పంపుతూ ఉండండి. ఇది పండుగల కాలం. ధన్ తేరస్, దీపావళి, ఛత్ పూజ, గురునానక్ జయంతి – అన్ని పండుగల సందర్భంగా ‘మన్ కీ బాత్’ శ్రోతలకు శుభాకాంక్షలు. మీరందరూ పండుగలను పూర్తి ఉత్సాహంతో జరుపుకోవాలి. వోకల్ ఫర్ లోకల్ మంత్రాన్ని గుర్తుంచుకోండి. పండుగల సమయంలో స్థానిక దుకాణదారుల నుండి కొనుగోలు చేసిన వస్తువులు మీ ఇంటికి వచ్చేలా చూసుకోండి. రాబోయే పండుగల సందర్భంగా మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు. ధన్యవాదాలు.
*****
Tune in for a special #MannKiBaat episode as we discuss various topics. https://t.co/4BspxgaLfw
— Narendra Modi (@narendramodi) October 27, 2024
#MannKiBaat has begun. Tune in! https://t.co/CdwVlSePLO
— PMO India (@PMOIndia) October 27, 2024
Throughout every era, India has encountered challenges, and in every era, extraordinary Indians have risen to overcome the challenges. #MannKiBaat pic.twitter.com/c1B58ut36X
— PMO India (@PMOIndia) October 27, 2024
The gaming space of India is also expanding rapidly. These days, Indian games are also gaining popularity all over the world. #MannKiBaat pic.twitter.com/Xl9i4AQwHG
— PMO India (@PMOIndia) October 27, 2024
Let us take the resolve of making India a global animation power house. #MannKiBaat pic.twitter.com/t8QsYWkSFr
— PMO India (@PMOIndia) October 27, 2024
Aatmanirbhar Bharat Abhiyan is becoming a people's campaign. #MannKiBaat pic.twitter.com/Yh8DJtsDFC
— PMO India (@PMOIndia) October 27, 2024
Beware of Digital Arrest frauds!
— PMO India (@PMOIndia) October 27, 2024
No investigative agency will ever contact you by phone or video call for enquiries.
Follow these 3 steps to stay safe: Stop, Think, Take Action.#MannKiBaat #SafeDigitalIndia pic.twitter.com/KTuw7rlRDK
Inspiring efforts from Jammu and Kashmir to popularise the local culture. #MannKiBaat pic.twitter.com/yXts3uCED5
— PMO India (@PMOIndia) October 27, 2024
Remarkable efforts in Telangana and Chhattisgarh to celebrate the vibrant cultural legacy and unique traditions. #MannKiBaat pic.twitter.com/LmELbUkB6s
— PMO India (@PMOIndia) October 27, 2024
Today people across the world want to know India. #MannKiBaat pic.twitter.com/r6MFd6CDxX
— PMO India (@PMOIndia) October 27, 2024
The spirit of Fit India is now becoming a mass movement. #MannKiBaat pic.twitter.com/MLoICYZHwo
— PMO India (@PMOIndia) October 27, 2024
हमने देश की दो महान विभूतियों भगवान बिरसा मुंडा और सरदार पटेल की 150वीं जन्म-जयंती को राष्ट्रीय स्तर पर मनाने का निर्णय लिया है। मेरा आग्रह है कि आप सभी इस अभियान का हिस्सा बनें और उनके जीवन संदेश और प्रेरणाओं को #BirsaMunda150 एवं #Sardar150 के साथ जरूर शेयर करें। #MannKiBaat pic.twitter.com/b7mDB5UJNz
— Narendra Modi (@narendramodi) October 27, 2024
आज आत्मनिर्भरता भारत की Policy के साथ-साथ Passion भी बन गई है। मेरा आप सभी से आग्रह है कि आत्मनिर्भर होते भारत के ज्यादा से ज्यादा प्रेरक उदाहरणों को #AatmanirbharInnovation के साथ Social Media पर जरूर साझा करें। #MannKiBaat pic.twitter.com/zRKaNaimbf
— Narendra Modi (@narendramodi) October 27, 2024
देशवासियों को Digital Arrest के नाम पर हो रहे Scam से बहुत सावधान रहने की जरूरत है। मैं आपको Digital सुरक्षा के ये तीन चरण बता रहा हूं, जिन्हें आप जरूर याद रखें…. #MannKiBaat pic.twitter.com/mnjzD7bOLo
— Narendra Modi (@narendramodi) October 27, 2024
जम्मू-कश्मीर हो या तेलंगाना या फिर छत्तीसगढ़, आज देश के अलग-अलग हिस्सों में हमारी सांस्कृतिक विरासत के संरक्षण के लिए कई लोग असाधारण कार्य कर रहे हैं। उनका यह प्रयास हर देशवासी के लिए एक मिसाल है। #MannKiBaat pic.twitter.com/kwtsVRS1Or
— Narendra Modi (@narendramodi) October 27, 2024
लौह पुरुष सरदार पटेल की जयंती पर होने वाले ‘Run for Unity’ का आयोजन इस वर्ष दो दिन पहले 29 अक्टूबर को हो रहा है। मेरा आग्रह है कि आप इसमें हिस्सा लेकर एकता और फिटनेस के मंत्र को ज्यादा से ज्यादा फैलाएं। #MannKiBaat pic.twitter.com/SOvlgBKoZH
— Narendra Modi (@narendramodi) October 27, 2024