Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అండమాన్ నికోబార్ దీవుల గొప్ప చరిత్ర, వీరోచిత ప్రజల గౌరవార్థమే ‘శ్రీ విజయ పురం’ అనే పేరు: ప్రధాన మంత్రి


అండమాన్ నికోబార్ దీవుల వీరోచిత ప్రజలకు “శ్రీ విజయ పురం” అనే పేరు నివాళి అని, వలస పాలన వారసత్వాన్ని విరమించుకునేందుకు చిహ్నంగా ఉంటుందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా హోం మంత్రి పోస్టుకు మోదీ ఈ విధంగా స్పందించారు.

“ అండమాన్ నికోబార్ దీవుల గొప్ప చరిత్ర, వీరోచిత ప్రజలకు శ్రీ విజయ పురం అనే పేరు గౌరవంగా ఉంటుంది. వలసవాద మనస్తత్వం నుంచి బయటపడి మన వారసత్వాన్ని వేడుక చేసుకోవాలన్న మా నిబద్ధతను కూడా ఇది ప్రతిబింబిస్తుంది ”

 

 

***

MJPS/SR