2024-25 ఆర్థిక సంవత్సరం నుంచి 2028-29 ఆర్థిక సంవత్సరం వరకు ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన -4 (పీఎంజీఎస్ వై-4) అమలు కోసం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గ్రామీణాభివృద్ధి శాఖ చేసిన ప్రతిపాదనపై ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది.
అనుసంధితం చేయవలసి ఉండీ ఇంతవరకూ చేయని 25,000 ఆవాసాలను కలిపేలా 62,500 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించనున్నారు. దాంతోపాటు కొత్త అనుసంధాన రహదారులపై కొత్త వంతెనల నిర్మాణం/ఆధునికీకరణను కూడా చేపడతారు. ఈ పథకానికి మొత్తం రూ.70,125 కోట్లు ఖర్చవుతుంది.
పథకం వివరాలు:
కేబినెట్ ఆమోదించిన వివరాలిలా ఉన్నాయి.
i. 2024-25 నుంచి 2028-29 ఆర్థిక సంవత్సరానికి ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన-4ను ప్రారంభించారు. ఈ పథకం మొత్తం వ్యయం రూ.70,125 కోట్లు (కేంద్ర వాటా రూ.49,087.50 కోట్లు, రాష్ట్ర వాటా రూ.21,037.50 కోట్లు).
ii. 2011 జనాభా లెక్కల ప్రకారం మైదాన ప్రాంతాల్లో 500కు పైగా; ఈశాన్య, పర్వత ప్రాంత రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంలు, ప్రత్యేక హోదా ప్రాంతాల్లో (షెడ్యూల్-5లోని గిరిజన ప్రాంతాలు, అభిలషణీయ జిల్లాలు/బ్లాకులు, ఎడారి ప్రాంతాలు) 250కి పైగా; వామపక్ష అతివాద ప్రభావిత ప్రాంతాల్లో 100కు పైగా జనాభా కలిగిన మొత్తం 25,000 ప్రాంతాలు ఈ పథకం పరిధిలోకి వస్తాయి.
iii. ఈ పథకం ద్వారా అనుసంధితం కాని ఆవాసాలకు 62,500 కి.మీ. మేర అన్ని రకాల రహదారి (ఆల్ వెదర్ రోడ్) సదుపాయాలను కల్పిస్తారు. అన్ని రకాల రహదారుల అనుసంధానంతోపాటు అవసరమైన వంతెనల నిర్మాణం కూడా చేపడతారు.
ప్రయోజనాలు:
***