Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మహిళల 200 మీటర్ల పరుగు పోటీలో కాంస్య పతకాన్ని గెలిచిన


పారిస్ పారాలింపిక్స్ లో మహిళల 200 మీటర్ల టి12 పరుగు పోటీలో కాంస్య పతకాన్ని క్రీడాకారిణి సిమ్రన్ శర్మ గెలిచినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమెకు ఈ రోజు అభినందనలు తెలిపారు.

ప్రధానమంత్రి సామాజిక ప్రసార మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో ఇలా పోస్ట్ చేశారు:

“పారాలింపిక్స్ 2024 (#Paralympics2024) లో మహిళల 200 మీటర్ల టి12 పరుగు పోటీలో కాంస్య పతకాన్ని సిమ్రన్ శర్మ గెలిచిన సందర్భంగా ఆమెకు అభినందనలు. ఆమె గెలుపు అనేక మందికి స్ఫూర్తిని అందిస్తుంది. ఆమె నైపుణ్యం, విజయ సాధన గుర్తుంచుకోదగ్గవి.

జయ జయ భారత్ (#Cheer4Bharat)”