Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

షూటర్ మనీశ్ నర్వాల్ కు పారాలింపిక్స్ లో రజత పతకం: ప్రధానమంత్రి హర్షం


పారిస్ పారాలింపిక్స్ లో పి1 – పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్ హెచ్1 పోటీ లో మనీశ్ నర్వాల్ రజత పతకాన్ని గెలిచిన సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యమం లో ఒక సందేశంలో ఈ కింది విధంగా పేర్కొన్నారు:

‘‘మనీశ్ నర్వాల్ వైభవోపేత కార్యాన్ని సాధించారు..  పి1 – పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్ హెచ్1 పోటీ లో రజత పతకాన్ని గెలిచారు. ఆయనలోని ఖచ్చితత్వం, ఏకాగ్రత, అంకిత భావం మరో సారి ప్రసిద్ధిని తెచ్చిపెట్టాయి.

చీర్ ఫర్ భారత్ (#Cheer4Bharat)’’