Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పోలాండ్ అధ్య‌క్షునితో స‌మావేశ‌మైన ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ

పోలాండ్ అధ్య‌క్షునితో స‌మావేశ‌మైన ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ


 పోలాండ్ అధ్య‌క్షుడు శ్రీ ఆంద్రేవ్ సెబాస్టియ‌న్ డూడాతో వార్సాలోని బెల్వడియర్ ప్యాలెస్ లో ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ స‌మావేశ‌మ‌య్యారు. 

 

ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల‌కు సంబంధించిన వివిధ అంశాల‌పై నేత‌లిద్ద‌రూ చర్చించారు. భార‌త‌దేశం పోలాండ్ దేశాల మ‌ధ్య‌న ఉన్న సంబంధాలు వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్య‌స్థాయికి అభివృద్ధి చెంద‌డాన్ని వారిరివురూ స్వాగ‌తించారు. ఉక్రెయిన్‌, ప‌శ్చిమా ఆసియా సంఘ‌ర్ష‌ణ‌ల‌తోపాటు ప్రాంతీయ‌, ప్ర‌పంచ స‌మ‌స్య‌ల గురించి వారు చ‌ర్చ‌లు చేశారు. 

 

ఆప‌రేష‌న్ గంగా సందర్భంగా స‌రైన స‌మ‌యంలో ఉక్రెయిన్ దేశాన్నించి భార‌తీయుల‌ను త‌ర‌లించ‌డంలో పోలాండ్ అందించిన అమూల్య‌మైన స‌హాయాన్ని గుర్తు చేసిన‌ ప్ర‌ధాని ఆ దేశానికి మ‌న‌సారా కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. 

 

భార‌త‌దేశాన్ని సంద‌ర్శించాల‌ని కోరుతూ అధ్య‌క్షులు శ్రీ డూడాను ఆహ్వానించిన విష‌యాన్ని ప్ర‌ధాని పున‌రుద్ఘాటించారు.