Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కొల్హాపూర్ రాజకుటుంబం గొప్పతనం గురించి శ్రీ జ్ఞానేశ్వర్ ములే చాలా చక్కగా రాశారు: ప్రధాన మంత్రి


కొల్హాపూర్ రాజకుటుంబందూరదృష్టి గల మహారాజులుమహారాణి తారాబాయి గొప్పతనాన్ని శ్రీ జ్ఞానేశ్వర్ ములాయ్ చాలా చక్కగా రాశారని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. వారి మహోన్నతమైన కరుణ రాబోయే తరాలకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తుందని శ్రీ మోదీ అన్నారు.

శ్రీ జ్ఞానేశ్వర్ ములే ఎంఈఏలో మాజీ కార్యదర్శి, కొల్హాపూర్‌కు చెందినవారు. పశ్చిమ మహారాష్ట్రలోని కొల్హాపూర్ నగరానికి పోలాండ్‌తో ఉన్న అపురూపమైన అనుబంధం గురించి టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఆయన ఒక వ్యాసం రాశారు.

శ్రీ జ్ఞానేశ్వర్ ములే రాసిన కథనానికి ప్రతిస్పందిస్తూ, ప్రధాన మంత్రి ఒక ఎక్స్ పోస్టులో ఇలా అన్నారు: “కొల్హాపూర్ రాజకుటుంబం, దూరదృష్టి గల మహారాజులు, మహారాణి తారాబాయి గొప్పతనంపై శ్రీ జ్ఞానేశ్వర్ ములే చాలా చక్కని కథనం రాశారు. వారి మహోన్నతమైన కరుణ రాబోయే తరాలకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తుంది.”