Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు టిమోర్‌-లెస్టే అత్యున్నత పౌర పురస్కారం ‘గ్రాండ్‌-కాలర్‌ ఆఫ్‌ ది ఆర్డర్‌’ ప్రదానం దేశానికి గర్వకారణం: ప్రధానమంత్రి మోదీ


   రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముకు టిమోర్-లెస్టే దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘గ్రాండ్-కాలర్ ఆఫ్ ది ఆర్డర్’ ప్రదానం మన దేశానికి గర్వకారణమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రతిష్ఠాత్మక గౌరవం భారతదేశం, తిమోర్-లెస్ట్ మధ్య లోతైన సంబంధాలు, పరస్పర గౌరవాన్ని ప్రధానంగా తెలియజేస్తోంది.

   తిమోర్-లెస్టే ప్రభుత్వం తమ అత్యున్నత పౌర పురస్కారం ‘గ్రాండ్-కాలర్ ఆఫ్ ది ఆర్డర్’తో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపతి ముర్ము సత్కారం పొందటంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒక ట్వీట్ ద్వారా అమితానందం ప్రకటించారు. భారత్-టిమోర్ లెస్టే దేశాల మధ్య పరస్పర గౌరవాదరాలతో కూడిన చిరకాల స్నేహబంధాన్ని ఈ ప్రతిష్ఠాత్మక సత్కారం స్పష్టం చేస్తున్నదని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు…

‘‘భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము టిమోర్-లెస్టే దేశ ‘గ్రాండ్ కాలర్ ఆఫ్ ది ఆర్డర్’ సత్కారం పొందడం మనందరికీ గర్వకారణం. రెండుదేశాల మధ్యగల సుదీర్ఘ స్నేహసంబంధాలు, పరస్పర గౌరవాన్ని ఈ పురస్కారం ప్రస్ఫుటం చేస్తోంది. ఇది అనేక సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఆమె కృషికి, సేవలకు లభించిన గుర్తింపు’’ అని ప్రధాని తన ట్వీట్ ద్వారా అభినందన సందేశమిచ్చారు.

 

 

***

MJPS/SS