ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల్లో భారత్ ప్రగతిపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అమితానందం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా భారత ఎగుమతులలో ఎలక్ట్రానిక్స్ మూడో స్థానానికి దూసుకెళ్లాయని,
ఇదంతా యువశక్తి ఘనతేనని ఈ సందర్భంగా శ్రీ మోదీ కొనియాడారు. భవిష్యత్తులోనూ ఈ ఊపును కొనసాగించేందుకు భారత్ కృతనిశ్చయంతో ఉందని ప్రధానమంత్రి అన్నారు.
ప్రపంచ దేశాలకు భారత ఎగుమతులలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు ఇప్పుడు మూడో స్థానానికి చేరాయని కేంద్ర ఎలక్ట్రానిక్స్-సమాచార సాంకేతికశాఖ మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఒక సందేశంలో పేర్కొన్నారు. మన దేశం నుంచి ‘ఏపిల్’ ఐఫోన్ ఎగుమతుల వృద్ధి ఈ ఘనత సాధనకు చోదకశక్తి గా నిలిచిందంటూ ప్రముఖ పత్రిక ‘బిజినెస్ స్టాండర్ట్’ ప్రచురించిన కథనాన్ని ఆయన ఉటంకించారు. ఈ మేరకు 2024-25 (ఆర్థిక సంవత్సరం 25)లో ఏప్రిల్-జూన్ (తొలి త్రైమాసికం) ముగిసేసరికి రత్నాభరణాలతో పోలిస్తే ఎలక్ట్రానిక్స్ ఎగుమతులే ఎక్కువని పేర్కొన్నారు. తద్వారా భారత్ నుంచి ఎగుమతయ్యే పది అగ్రశ్రేణి ఉత్పత్తులలో ఎలక్ట్రానిక్స్ మూడో స్థానంలో నిలిచిందని ఆ పత్రిక వివరించినట్లు పేర్కొంటూ ఆ కథనాన్ని ప్రజలతో పంచుకున్నారు.
మంత్రి పోస్టుకు స్పందనగా ప్రధానమంత్రి ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో: ‘‘ఇది నిజంగా అమిత సంతోషాన్నిచ్చే సమాచారం. ఎలక్ట్రానిక్స్ రంగంలో భారత్ సామర్థ్యానికి మన ఆవిష్కరణాత్మక యువశక్తి వెన్నుదన్నుగా నిలుస్తోంది. దేశంలో సంస్కరణలకు, @makeinindiaకు ప్రోత్సాహంపై మా ప్రాధాన్యానికి ఇదొక నిదర్శనం.
భవిష్యత్తులోనూ ఈ జోరును కొనసాగించడంపై భారత్ దృఢనిశ్చయంతో ఉంది’’ అని పేర్కొన్నారు.
Today we mark 5 years since the Parliament of India decided to abrogate Articles 370 and 35(A), a watershed moment in our nation's history. It was the start of a new era of progress and prosperity in Jammu and Kashmir, and Ladakh. It meant that the Constitution of India was…
— Narendra Modi (@narendramodi) August 5, 2024