Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

2024 వ సంవత్సరం లో అంతర్జాతీయ యోగ దినం నాడు జమ్ము & కశ్మీర్ లోని శ్రీనగర్ లో డల్ సరస్సు సమీపం లో యోగ సాధకులను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి

2024 వ సంవత్సరం లో అంతర్జాతీయ యోగ దినం నాడు జమ్ము & కశ్మీర్ లోని శ్రీనగర్ లో డల్ సరస్సు సమీపం లో యోగ సాధకులను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి


ఈ రోజు న అంతర్జాతీయ యోగ దినం సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీనగర్ లోని డల్ సరస్సు వద్ద గుమికూడిన పౌరుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, యోగ అంటే జమ్ము & కశ్మీర్ ప్రజల లో పెల్లుబుకిన ఉత్సాహం మరియు నిబద్ధత లతో నిండిన ఈ సన్నివేశం ప్రజల మది లో ఎల్లకాలం నిలచిపోతుంది అన్నారు. వాన కురుస్తూ ఉష్ణోగ్రత పడిపోయినప్పటికీ అంతర్జాతీయ యోగ దినం సంబంధి కార్యక్రమం లో జాప్యం చోటు చేసుకొన్న కారణం గా కార్యక్రమాన్ని రెండు మూడు భాగాలు గా విభజించినప్పటికీ ప్రజల లో ఉత్సాహం ఎంత మాత్రం నీరుగారలేదు అని ప్రధాన మంత్రి అన్నారు. యోగ వ్యక్తి యొక్క జీవనం లోను మరియు సమాజం లోను ఒక స్వాభావిక ప్రవృత్తి గా మారుతూ ప్రాముఖ్యాన్ని సంతరించుకొంటోంది అని శ్రీ నరేంద్ర మోదీ నొక్కిపలికారు. యోగ నిత్య జీవనం తో పెనవేసుకొని ఒక సీదా సాదా రూపాన్ని పొందిందా అంటే అప్పుడు యోగ తో ప్రయోజనాల ను పొందవచ్చును అని ఆయన అన్నారు.

యోగ లో ఒక భాగం అయినటువంటి ధ్యానాన్ని సాధన చేయడం లో ఆధ్యాత్మిక పరమైన హెచ్చు మోతాదుల వల్ల సామాన్య ప్రజలు కొంత బెదిరిపోయే అవకాశాలు ఉన్నప్పటికీ ఏకాగ్రత ను కనబరచడం వల్ల, పరిసరాల పట్ల శ్రద్ధ ను వహించడం వల్ల దాని యొక్క శక్తి ని ఇట్టే గ్రహించ వచ్చును అని ప్రధాన మంత్రి అన్నారు. క్రమం తప్పక యోగ ను ఆచరిస్తూ ఉండడం మరియు యోగ సంబంధమైన మెలకువల పై పట్టు ను సాధించడం ద్వారా వ్యక్తి ఏకాగ్రత ను, శ్రద్ధ ను అలవరచుకోవచ్చును అని ఆయన అన్నారు. యోగ ను ఆచరించినందు వల్ల బుద్ధి కుదురుకొని అలసట అనేదే ఎరుగకుండా మనస్సు ఇతర అనేక విషయాల పైకి మళ్ళుతూ ఉండడాన్ని తగ్గించుకోవడం సాధ్యపడుతుంది అని ఆయన అన్నారు. క్రమ క్రమం గా మనిషి ఆధ్యాత్మిక యాత్ర పథం లో పురోగమించడం తో పాటు గా ధ్యానం అనేది వ్యక్తి యొక్క స్వీయ ఎదుగుదల కు మరియు శిక్షణ కు ఒక పనిముట్టు గా ఉపయోగపడుతుంది అని ఆయన అన్నారు.

‘‘యోగ మనిషి విషయం లో ఏ విధం గా ముఖ్యమైంద, ఆచరించదగ్గది మరియు శక్తివంతమైందో సమాజాని కి కూడా ను అంతే ముఖ్యమైంది, ఆచరణీయమైంది మరియు శక్తివంతమైందిగా ఉంది’’ అని ప్రధాన మంత్రి నొక్కిపలికారు. యోగ యొక్క లాభాల ను సమాజం అందుకొంది అంటే గనుక ఆ లాభాలు యావత్తు మానవ జాతి కి దక్కుతాయి అని ఆయన అన్నారు. ఈజిప్టు లో ప్రముఖ పర్యటక కేంద్రాల వద్ద యోగ అభ్యాసాన్ని గురించి న ఛాయాచిత్రాల ను గాని లేదా వీడియో ను గాని చిత్రీకరించేందుకు పోటీ ని నిర్వహించినట్లు గా సూచించిన ఓ వీడియో ను తాను చూసిన సంగతి ని ప్రధాన మంత్రి చెబుతూ, ఆ పోటీ లో పాలుపంచుకొన్న వారి ప్రయాసల ను ప్రశంసించారు. ‘‘అదే మాదిరి గా, జమ్ము & కశ్మీర్ లో యోగ మరియు పర్యటన లు ఉపాధి పరం గా ఒక ప్రధానమైన మార్గం గా మారవచ్చును’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

ప్రధాన మంత్రి తన ప్రసంగం చివర లో, జమ్ము & కశ్మీర్ లోని శ్రీనగర్ లో కఠిన శీతోష్ణస్థితి పరమైన సవాళ్ళ కు తట్టుకొని మరి పెద్ద సంఖ్యల లో తరలి వచ్చి మరీ ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగ దినాని కి సంఘీభావం తెలిపి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజల నిబద్ధత ను కొనియాడారు.

 

*****

DS/TS