ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వారణాసిలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కిసాన్ సమ్మాన్ నిధి కార్యక్రమం, గంగా హారతి, కాశీ విశ్వనాధ ఆలయంలో ప్రార్థనల తర్వాత ఆయన డాక్టర్ సంపూర్ణానంద్ క్రీడా మైదాన నిర్మాణానికి సంబంధించి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. వారణాసిలో నిర్మిస్తున్న స్టేడియం, క్రీడా సముదాయాలను సందర్శించి పనుల ప్రగతిని నేరుగా తెలుసుకున్నారు.
అనంతరం ఆయన ఎక్స్ లో ట్వీట్ పోస్ట్ చేశారు.
కాశీలో నిర్మిస్తున్న డాక్టర్ సంపూర్ణానంద్ క్రీడా మైదాన నిర్మాణ ప్రగతిని సమీక్షించాను. ఈ స్టేడియం, ఇక్కడ నిర్మిస్తున్న క్రీడా సముదాయం కాశీ యువతకు చాలా బాగా ఉపయోగపడతాయి అని ఆయన తన ట్వీట్లో పేర్కొన్నారు.
Reviewed the progress at the Dr. Sampurnanand Sports Stadium in Kashi. This stadium and sports complex will greatly help the youth of Kashi. pic.twitter.com/VJt82v6GfZ
— Narendra Modi (@narendramodi) June 18, 2024