Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

విద్య రంగం లో గుణాత్మకమైన మార్పును తీసుకు వచ్చే విషయం లో తన నిబద్ధత ను పునరుద్ఘాటించిన ప్రధాన మంత్రి


విద్య రంగం లో గుణాత్మకమైన మార్పుల ను తీసుకు రావాలన్న తన వచనబద్ధత ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. క్యుఎస్ వరల్డ్ యూనివర్సిటీ శ్రేణీకరణం లో భారతీయ విశ్వవిద్యాలయాల ప్రదర్శన మెరుగు పడినందుకు ప్రధాన మంత్రి తన సంతోషాన్ని కూడా వ్యక్తం చేశారు.

 

క్యుఎస్ వరల్డ్ యూనివర్సిటీ శ్రేణీకరణం లో భారతదేశాని కి చెందిన విశ్వవిద్యాలయాల ప్రదర్శన లో నిరంతరం నమోదు అవుతున్న మెరుగుదల ను గురించి క్యుఎస్ క్వాక్‌ క్వెరెలీ సైమండ్స్ లిమిటెడ్ యొక్క సిఇఒ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ నున్జియో క్వాక్ వెరెలీ ప్రశ్న కు ప్రధాన మంత్రి సమాధానమిస్తూ, ఎక్స్ మాధ్యం లో ఈ క్రింది విధం గా పేర్కొన్నారు:

 

‘‘గడచిన దశాబ్ద కాలం లో, మేము విద్య రంగం లో గుణాత్మకమైన మార్పుల పైన శ్రద్ధ వహించాము. ఇది క్యుఎస్ వరల్డ్ యూనివర్సిటీ శ్రేణీకరణం లో ప్రతిబింబించింది. విద్యార్థుల కు, ఫేకల్టీ కి మరియు సంస్థల కు వారి యొక్క కఠోర శ్రమ కు మరియు సమర్పణ భావాని కి ఇవే అభినందన లు. ఈ పదవీ కాలం లో, మేము పరిశోధనల కు మరియు నూతన ఆవిష్కరణల కు మరింత సమర్థన ను అందించాలి అని తలుస్తున్నాము.’’

***

DS/ST