Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పిఎమ్ స్వనిధి లబ్ధిదారుల ను ఉద్దేశించి దిల్లీ లోప్రసంగించిన ప్రధాన మంత్రి

పిఎమ్ స్వనిధి లబ్ధిదారుల ను ఉద్దేశించి దిల్లీ లోప్రసంగించిన ప్రధాన మంత్రి


పిఎమ్ స్వనిధి పథకం యొక్క లబ్ధిదారుల తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దిల్లీ లోని జెఎల్ఎన్ స్టేడియమ్ లో ఈ రోజు న సమావేశమై, వారి ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ పథకం లో భాగం గా దిల్లీ కి చెందిన 5,000 మంది వీధి విక్రేత లు సహా మొత్తం ఒక లక్ష మంది వీధి వ్యాపారస్తుల (ఎస్‌వి స్) కు రుణాల ను ఆయన పంపిణీ చేశారు. అయిదుగురు లబ్ధిదారుల కు పిఎమ్ స్వనిధి రుణం తాలూకు చెక్కుల ను ఇచ్చారు. దిల్లీ మెట్రో యొక్క నాలుగో దశ లో భాగం గా ఉన్న రెండు అదనపు కారిడర్ లకు శంకుస్థాపన కూడా చేశారు.

 

సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, వందల కొద్దీ నగరాల కు చెందిన లక్షల మంది వీధి విక్రేత లు వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా ఈ కార్యక్రమం తో జతపడ్డారు అని తెలియ జేశారు. మహమ్మారి కాలం లో వీధి వీధి కీ తిరుగుతూ సరకుల ను విక్రయించే వారి యొక్క బలాన్ని ప్రధాన మంత్రి గుర్తు కు తీసుకు వస్తూ, రోజువారీ జీవనం లో వారికి ఎంత ప్రాముఖ్యం ఉన్నదీ నొక్కిపలికారు. దేశవ్యాప్తం గా ఒక లక్ష మంది వీధి వ్యాపారుల ఖాతాల లోకి డబ్బు ను నేరు గా బదలాయించడమైంది; దీనితో పాటే, దిల్లీ మెట్రో లో భాగం గా ఉన్న రెండు అదనపు కారిడర్ లు.. లాజ్‌పత్ నగర్-సాకేత్ జి బ్లాక్ మరియు ఇంద్రలోక్- ఇంద్రప్రస్థ లను ఈ రోజు న ఆయన ప్రారంభించారు.

 

దేశం లో లక్షల సంఖ్య లో వీధి వ్యాపారస్తులు వారి యొక్క కఠోర శ్రమ తో మరియు ఆత్మగౌరవం తో వారి కుటుంబాల అవసరాల ను తీర్చడాన్ని గురించి శ్రద్ధ తీసుకొంటూ వస్తున్నారు అని ప్రధాన మంత్రి అన్నారు. వారు ఉపయోగిస్తున్న తోపుడు బండ్లు మరియు అంగళ్ళు చిన్నవే కావచ్చును, కానీ వారు ఎంతో పెద్దవి అయినటువంటి కలల ను కంటున్నారు అని ప్రధాన మంత్రి అన్నారు. మునుపటి ప్రభుత్వాలు వీధి వ్యాపారస్తుల బాగోగుల ను గురించి ఎటువంటి ఆసక్తి ని వ్యక్తం చేయలేదు, ఈ కారణం గా వారు అవమానం తో పాటు, అనేక ఇక్కట్టు ల బారి న పడ్డారు అని ఆయన అన్నారు. నిధుల కోసం వారు అధిక వడ్డీ తో కూడిన రుణాల ను తీసుకొని, వాటిని నిర్దిష్ట కాలం లో చెల్లించ లేకపోవడం తో మరింత అగౌరవాని కి, మరింత అధిక వడ్డీ రేటుల భారాని కి లోనయ్యారు అని ఆయన అన్నారు. బ్యాంకు ల సదుపాయాని కి వారు నోచుకోలేదు, అంతేకాకుండా, రుణం తీసుకోవడం కోసం ఎటువంటి పూచీకత్తు లు కూడా వారి వద్ద లేవు అని ఆయన అన్నారు. అటువంటి సందర్భాల లో బ్యాంకు ల నుండి రుణాల ను తీసుకోగలగడం అసాధ్యం అయింది. ఎందుకంటే, వారి వద్ద బ్యాంకు ఖాతా గానీ, లేదా వారు చేస్తున్న వ్యాపారం తాలూకు పద్దులు గానీ ఉండేవి కాదు అని ఆయన వివరించారు. ‘‘ఇది వరకటి ప్రభుత్వాలు వీధి విక్రేత ల అవసరాల ను గురించి ఏ మాత్రం పట్టించుకోలేదు; అలాగని వారి సమస్యల ను చక్కదిద్దేందుకు ఎటువంటి ప్రయత్నాన్ని అయినా అవి చేయనే లేదు’’ అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

‘‘మీ యొక్క ఈ సేవకుడు పేదరికం నుండే బయటకు వచ్చాడు. నేను పేదరికం లో పెరిగాను. ఈ కారణం గా ఎవరూ పట్టించుకోని అటువంటి వారి ని గురించి శ్రద్ధ తీసుకోవడం ఒక్కటే కాకుండా మోదీ వారిని ఆరాధిస్తూ వచ్చాడు’’ అని ప్రధాన మంత్రి అన్నారు. రుణాని కి పూచీకత్తు గా చూపించడానికి అయినా ఏదీ లేని అటువంటి వారి కి మోదీ యొక్క హామీ తాలూకు నమ్మకాన్ని ఇవ్వడమైంది అని ఆయన చెప్పారు. వీధి వీధి కి తిరుగుతూ వస్తువుల ను విక్రయించే వారి యొక్క నిజాయతీ ని ఆయన పొగడారు. వీధి వ్యాపారస్తులకు వారి రికార్డు మరియు వారు జరిపినటువంటి డిజిటల్ లావాదేవీ ల ఆధారం గా పది వేలు, ఇరవై వేలు, ఇంకా ఏభై వేల రూపాయల రుణాల ను అందించడం జరుగుతోంది అని ఆయన అన్నారు. ఇంతవరకు అరవై రెండు లక్షల మంది లబ్ధిదారులు పదకొండు వేల కోట్ల రూపాయల విలువైన ఆర్థిక సహాయాన్ని అందుకొన్నారు అని ఆయన తెలిపారు. లబ్ధిదారుల లో సగం కంటే ఎక్కువ మంది మహిళలు ఉండడం సంతోషదాయకం అయిన విషయం అని ఆయన అన్నారు.

 

కోవిడ్ మహమ్మారి కాలం లో పిఎమ్ స్వనిధి యోజన ను ప్రారంభించిన సంగతి ని ప్రధాన మంత్రి గుర్తు కు తీసుకు వస్తూ, ఇటీవలి ఒక అధ్యయనం వెల్లడించిన నివేదిక ను గురించి తెలిపారు. ఆ అధ్యయనం వీధి వ్యాపారుల ఆదాయం అనేక రెట్లు వృద్ధి చెందింది అని పేర్కొనడమైంది, దీనితో పాటు కొనుగోళ్ళ తాలూకు డిజిటల్ రికార్డుల వల్ల వారికి బ్యాంకు నుండి ప్రయోజనాల ను అందుకోవడం లో సాయం లభిస్తోంది అని కూడా ప్రస్తావించింది అన్నారు. డిజిటల్ లావాదేవీల తో ప్రతి సంవత్సరం 1200 రూపాయల కేశ్ బేక్ ను సైతం అందుకోవచ్చును అని ఆయన వెల్లడించారు.

 

వీధుల లో తిరుగుతూ వస్తువుల ను విక్రయించే వారి యొక్క నిత్య జీవనం లో ఎదుర్కొనే ఇక్కట్టుల ను గురించి ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రస్తావిస్తూ, వారి లో చాలా మంది జీవనాధారాన్ని వెతుక్కొంటూ గ్రామాల నుండి నగరాల కు వలస పోతున్నారు అన్నారు. ‘‘పిఎమ్ స్వనిధి లబ్ధిదారుల ను బ్యాంకుల తో కలపడం ఒక్కటే కాకుండా వారికి ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు అందేటట్లు గా కూడానున చూస్తుంది’’ అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ సందర్భం లో ఆహార పదార్థాల ఉచిత సరఫరా, ఉచిత వైద్య చికిత్స మరియు ఉచిత గ్యాస్ కనెక్శన్ ల తాలూకు ఉదాహరణల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావించారు. దేశం లో ఎక్కడ నుండి అయినా ఆహార పదార్థాల ను ఉచితం గా అందుకోవడాన్ని అనుమతిస్తున్నవన్ నేశన్, వన్ రేషన్ కార్డ్పథకం తాలూకు పరివర్తన కారి దృష్టికోణాన్ని గురించి చెప్పారు.

 

నాలుగు కోట్ల పక్కా ఇళ్ళ లో ఒక కోటి పక్కా ఇళ్ళ ను పట్టణ ప్రాంతాల లోని పేద ప్రజల కు కేటాయించడం జరిగింది అని ప్రధాన మంత్రి అన్నారు. గుడిసె ల స్థానం లో పక్కా ఇళ్ళ ను సమకూర్చడం కోసం పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి ని ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, దిల్లీ లో ఇప్పటికే 3,000 ఇళ్ళ నిర్మాణం పూర్తి అయింది, 3,500 గృహాల నిర్మాణం పూర్తి కానుంది అని ఆయన వివరించారు. అనధికారిక కాలనీల ను త్వరిత గతి న క్రమబద్ధీకరణ చేయడం జరుగుతున్నది, మరి 75,000 రూపాయల కేటాయింపు ద్వారా పిఎమ్ సూర్యఘర్ ముఫ్త్ బిజలీ యోజన ను ప్రారంభించడమైంది అని ఆయన తెలిపారు.

 

“దిల్లీ లో పేద ప్రజల మరియు మధ్య తరగతి వర్గం యొక్క జీవనాన్ని సులభ తరం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం రాత్రనక పగలనక కృషి చేస్తోంది’’ అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. మధ్య తరగతి వర్గం తో పాటు పట్టణ ప్రాంతాల లోని పేద ప్రజల కోసం పక్కా ఇళ్ళ ను నిర్మించే ఉదాహరణ ను ఆయన ప్రస్తావించి, ఈ ఇళ్ళ నిర్మాణాని కి 50,000 కోట్ల రూపాయల సబ్సిడీ ని అందించడం జరిగిందన్నారు. డజనుల కొద్దీ నగరాల లో మెట్రో సేవల తాలూకు పనులు శరవేగం గా జరుగుతున్నాయి. కాలుష్యం మరియు రాక పోకల లో రద్దీ సంబంధి సమస్యల ను ఎదుర్కోవడం కోసం ఎలక్ట్రిక్ బస్సుల ను నడపడం జరుగుతోంది అని ఆయన ప్రస్తావించారు. ‘‘గడచిన 10 సంవత్సరాల లో దిల్లీ మెట్రో నెట్ వర్క్ ను రెండు రెట్లు విస్తరించడమైంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. దిల్లీ లో మెట్రో యొక్క విస్తృతమైనటువంటి నెట్ వర్క్ ప్రపంచం లో అతి కొద్ది నెట్ వర్క్ ల సరసన చోటు ను సంపాదించుకొంది అని ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రకటించారు. దిల్లీ ఎన్‌సిఆర్ ప్రాంతాని కి నమో భారత్ రేపిడ్ రేల్ కనెక్టివిటీ సమకూరిన అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ‘‘దిల్లీ నగరం లో కాలుష్యాన్ని తగ్గించడం కోసం ఒక వేయి కి పైగా ఎలక్ట్రిక్ బస్సుల ను కేంద్ర ప్రభుత్వం నడుపుతోంది’’ అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. దిల్లీ చుట్టు ప్రక్కల ప్రాంతాల లో కాలుష్యాన్ని మరియు వాహనాల రాకపోకల సంబంధి రద్దీ ని తగ్గించడం కోసం అనేక ఎక్స్ ప్రెస్ వే లను నిర్మించడం జరిగింది అని ఆయన అన్నారు. ఈ సందర్భం లో ఈ వారం ఆరంభం లో జరిగిన ద్వారక ఎక్స్ ప్రెస్ వే ప్రారంభ కార్యక్రమాన్ని గురించి ఆయన ప్రస్తావించారు.

 

యువత లో క్రీడల తాలూకు అభినివేశాన్ని పెంపొందించడం కోసం చేపట్టిన కార్యక్రమాన్ని గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, సామాన్య కుటుంబాల కు చెందిన యువతీ యువకుల కు ఇంతకు ముందు దొరకనటువంటి అవకాశాలు లభిస్తున్న ఖేలో ఇండియా ను గురించి ప్రస్తావించారు. ఖేలో ఇండియా తో అనేక సదుపాయాలు విస్తృతం అవుతుండడం తో పాటు ఎథ్ లీట్ ల కు నాణ్యభరితమైన శిక్షణ పట్ల శ్రద్ధ వహిస్తూ సహాయాన్ని అందించడం జరుగుతోంది.

 

‘‘పేద ప్రజ మరియు మధ్య తరగతి ప్రజల యొక్క జీవనాన్ని మెరుగు పరచడం కోసం మోదీ నిరంతరం శ్రమిస్తున్నారు. ప్రజల సంక్షేమం తోనే దేశం యొక్క సంక్షేమంఅనేదే మోదీ ఆలోచన గా ఉంది, అవినీతి ని మరియు తృప్తి పరచేటటువంటి విధానాన్ని సమూలం గా నిర్మూలించి భారతదేశాన్ని ప్రపంచం లో మూడో అతి పెద్దదైనటువంటి ఆర్థిక వ్యవస్థ గా తీర్చిదిద్దవలసి ఉంది.’’ అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

‘‘సామాన్య పౌరుల యొక్క స్వప్నాలు మరియు మోదీ యొక్క సంకల్పం.. వీటి రెండింటి భాగస్వామ్యమే ఉజ్వల భవిష్యత్తు కు హామీ గా ఉంది.’’ అని చెప్పి ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.

ఈ సందర్భం లో దిల్లీ లెఫ్టినెంట్ గవర్నరు శ్రీ వినయ్ కుమార్ సక్సేనా, గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి శ్రీ హర్‌దీప్ సింహ్ పురి మరియు ఆర్థిక శాఖ సహాయ మంత్రి శ్రీ భాగవత్ కిశన్ రావ్ కరాడ్ లు పాలుపంచుకొన్నారు.

 

 

పూర్వ రంగం

ఆదరణ కు నోచుకోకుండా ఉండిపోయినటువంటి వర్గాల వారికి ఆర్థిక సహాయాన్ని అందించాలన్న ప్రధాన మంత్రి యొక్క దృష్టికోణం తో ప్రేరణ ను పొంది, మహమ్మారి వల్ల తలెత్తిన ప్రపంచ ఆర్థిక సంకటం నడుమ 2020వ సంవత్సరం జూన్ ఒకటో తేదీ నాడు పిఎమ్ స్వనిధి ని ప్రారంభించడం జరిగింది. ఇది వీధి వ్యాపారుల వంటి నిరాదరణ కు గురైన సముదాయాలకు వారి స్థితి లో పరివర్తన ను తీసుకు వచ్చినట్లు రుజువు అయింది. ఇంతవరకు దేశం అంతటా 62 లక్షల కంటే ఎక్కువ వ్యాపారస్తుల కు 10,978 కోట్ల రూపాయల కు మించినటువంటి 82 లక్షల కంటే అధిక రుణాల ను పంపిణీ చేయడం జరిగింది. ఒక్క దిల్లీ లోనే 232 కోట్ల రూపాయల విలువైన సుమారు 2 లక్షల రుణాల ను అందించడమైంది. ఈ పథకం దీర్ఘ కాలం గా వంచన బారిన పడ్డ వారి కి ఆర్థిక సేవల లభ్యత తో పాటు సమగ్ర సంక్షేమాని కి ప్రతీక గా మారింది.

 

కార్యక్రమం లో, ప్రధాన మంత్రి దిల్లీ మెట్రో యొక్క రెండు అదనపు కారిడర్ లు అయినటువంటి ‘లాజ్ పత్ నగర్–సాకేత్ జీ బ్లాక్’ మరియు ‘ఇంద్రలోక్ఇంద్ర ప్రస్థ’ లకు శంకుస్థాపన జరిపారు. ఈ రెండు కారిడర్ ల మొత్తం పొడవు 20 కిలోమీటర్ కంటె ఎక్కువ గా ఉంటుంది. ఈ కారిడర్ లు కనెక్టివిటీ ని మెరుగుపరచడం తో పాటు గా వాహనాల రాకపోకల తాలూకు రద్దీ ని తగ్గించడం లో సహాయ పడతాయి.

 

లాజ్ పత్ నగర్ నుండి సాకేత్ జి బ్లాకు కారిడర్ లోని స్టేశనుల లో లాజ్ పత్ నగర్, ఎండ్ర్ యూజ్ గంజ్, గ్రేటర్ కైలాశ్-1,చిరాగ్ దిల్లీ, పుష్పా భవన్, సాకేత్ డిస్ట్రిక్ట్ సెంటర్, పుష్ప్ విహార్, సాకేత్ జి బ్లాకు లు కలసి ఉంటాయి. ఇంద్రలోక్ ఇంద్రప్రస్థ కారిడర్ లోని స్టేశనుల లో ఇంద్రలోక్, దయా బస్తీ, సరాయ్ రోహిల్లా, అజ్ మల్ ఖాన్ పార్క్, నబీ కరీమ్, న్యూ ఢిల్లీ, ఎల్ఎన్ జెపి ఆసుపత్రి, దిల్లీ గేట్, దిల్లీ సచివాలయ్, ఇంద్రప్రస్థ్ లు కలసి ఉంటాయి.

*****

DS/TS