Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

తెలంగాణ లోని సంగారెడ్డి లో 6,800 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన అనేక అభివృద్ధిప్రాజెక్టుల కు శంకుస్థాపన జరపడంతో పాటు దేశ ప్రజల కు అంకితం చేసిన ప్రధాన మంత్రి

తెలంగాణ లోని సంగారెడ్డి లో 6,800 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన అనేక అభివృద్ధిప్రాజెక్టుల కు శంకుస్థాపన జరపడంతో పాటు దేశ ప్రజల కు అంకితం చేసిన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరంద్ర మోదీ 6,800 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన అనేక అభివృద్ధి ప్రాజెక్టుల కు తెలంగాణ లోని సంగారెడ్డి లో ఈ రోజు న శంకుస్థాపన చేయడం తో పాటు, వాటిని దేశ ప్రజల కు అంకితం చేశారు. ఈ ప్రాజెక్టులు రహదారులు, రైల్ వే, పెట్రోలియమ్, విమానయానం మరియు సహజ వాయువు ల వంటి ముఖ్య రంగాల లో విస్తరించి ఉన్నాయి

సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిరంతరాయం గా సహాయాన్ని అందిస్తూ వస్తోందని, రాష్ట్రం సందర్శన కు తాను విచ్చేసినటువంటి సందర్భం లో ఈ రోజు వరుస గా రెండో రోజు అని తెలియ జేశారు. నిన్నటి రోజు న ఆదిలాబాద్ లో శక్తి, శీతోష్ణస్థితి మరియు మౌలిక సదుపాయాల రంగాల కు చెందిన సుమారు 56,000 కోట్ల రూపాయల విలువ కలిగిన అనేక అభివృద్ధి ప్రాజెక్టుల కు శంకుస్థాపన చేయడం తో పాటు వాటిని దేశ ప్రజల కు అంకితం ఇచ్చిన సంగతి ని ఆయన గుర్తు చేశారు. ఈ రోజు న దాదాపు గా 7,000 కోట్ల రూపాయల కు పైచిలుకు విలువ కలిగిన అభివృద్ధి ప్రాజెక్టుల ను ఆవిష్కరించడం జరుగుతోంది అని, హైవే లు, రైల్ వే లు మరియు పెట్రోలియమ్ రంగాల లో ఈ ప్రాజెక్టుల కు శంకుస్థాపనల ను జరపడమైంది అని ఆయన ప్రస్తావించారు. ‘‘రాష్ట్రాల అభివృద్ధి ద్వారా దేశ అభివృద్ధి సాధన అనే మంత్రం పట్ల నాకు నమ్మకం ఉంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రభుత్వం పని చేస్తున్న విధానాన్ని ఆయన ప్రముఖం గా ప్రకటించారు. అదే స్ఫూర్తి తో తెలంగాణ కు సేవ చేయాలని కేంద్ర ప్రభుత్వం పాటుపడుతోందని ఆయన స్పష్టం చేస్తూ, ఈ రోజు న చేపట్టుకొంటున్నటువంటి అభివృద్ధి కార్యాల కు గాను పౌరుల కు అభినందనల ను తెలియ జేశారు.

సివిల్ ఏవియేశన్ రిసర్చ్ ఆర్గనైజేశన్ (సిఎఆర్ఒ) తాలూకు కేంద్రాన్ని హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయం లో ప్రారంభించడం జరిగింది అని ప్రధాన మంత్రి చెప్తూ, ఈ కేంద్రం తెలంగాణ కు విమానయాన రంగం లో ఒక పెద్ద బహుమతి అని అభివర్ణించారు. ఈ కేంద్రం ఈ తరహా కేంద్రాల లో మొట్ట మొదటిది గా ఉంది, మరి ఇది ఈ రంగం లో తెలంగాణ కు క్రొత్త గుర్తింపు ను ప్రసాదిస్తుంది. ఇది దేశం లో విమానయాన రంగాని కి సంబంధించిన స్టార్ట్-అప్స్ కు పరిశోధన మరియు అభివృద్ధి సౌకర్యాల తో కూడినటువంటి ఒక వేదిక ను ప్రసాదిస్తుంది అని ప్రధాన మంత్రి వివరించారు.

వికసిత్ భారత్ సంకల్పాన్ని సాధించడం లో ఆధునిక మౌలిక సదుపాయాల కల్పన కు ఉన్న ప్రాముఖ్యాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ సంవత్సరం బడ్జెటు లో ఈ రంగాని కి 11 లక్షల కోట్ల రూపాయల ను కేటాయించడం జరిగిందని ఆయన చెప్పారు. ఈ కేటాయింపు తాలూకు గరిష్ట ప్రయోజనాల ను తెలంగాణ కు అందించే ప్రయాస లో భాగం గా ఎన్‌హెచ్-161 లో కంది నుండి రాంసాన్ పల్లి సెక్శను మరియు ఎన్‌హెచ్-167 లోని మిరియాలగూడ నుండి కోదాడ సెక్శను లు ఇటు తెలంగాణ మరియు అటు ఆంధ్ర ప్రదేశ్ మధ్య రవాణా సదుపాయాల ను మెరుగు పరుస్తాయి అని తెలియ జేశారు.

‘‘దక్షిణ భారతాని కి ప్రవేశ ద్వారం గా తెలంగాణ రాష్ట్రం పేరు ను తెచ్చుకొంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. రాష్ట్రం లో రైల్ కనెక్టివిటీ మరియు తత్సంబంధి సేవల ను మెరుగు పరచడం కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయాసల ను గురించి ఆయన ప్రముఖం గా ప్రస్తావించారు. రైలు మార్గాల విద్యుతీకరణ మరియు డబ్లింగు పనులు శరవేగం గా చోటు చేసుకొంటున్నాయి అని ఆయన అన్నారు. ఈ రోజు న ఆరు క్రొత్త స్టేశన్ భవనాల తో సహా, సనత్ నగర్ – మౌలా అలీ రూటు లో డబ్లింగు, ఇంకా విద్యుతీకరణ పనుల ను గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావించారు. మౌలా అలీ – సనత్ నగర్ ల మీదు గా ప్రయాణించేటటువంటి ఘట్‌కేసర్ – లింగంపల్లి ఎమ్ఎమ్‌టిఎస్ ట్రైన్ సర్వీసు కు ఈ రోజు న జెండా ను చూపి, ప్రారంభించుకోవడం జరిగింది అని ప్రధాన మంత్రి చెప్తూ, హైదరాబాద్ మరియు సికందరాబాద్ ప్రాంతాల లో అనేక ప్రదేశాల కు ఇక మీదట రైలు సేవలు అందుబాటు లోకి వస్తాయని, ఇది ప్రయాణికుల కు సౌకర్యవంతం గా ఉండబోతోంది అని తెలియ జేశారు.

ఇండియన్ ఆయిల్ కు చెందిన పారాదీప్ – హైదరాబాద్ ప్రాడక్ట్ పైప్ లైను ను ప్రధాన మంత్రి ఈ రోజు న ప్రారంభించారు. ఈ పైప్ లైను పెట్రోలియమ్ ఉత్పత్తుల ను చౌక గా మరియు పర్యావరణాని కి మైత్రీపూర్వకం గా ఉండే పద్ధతి లో చేరవేస్తుంది అని ప్రధాన మంత్రి అన్నారు. వికసిత తెలంగాణ మాధ్యం ద్వారా వికసిత భారత్ సంకల్పాన్ని నెరవేర్చుకోవడం లో ఈ పైప్ లైను ఊతం గా నిలుస్తుంది అని ప్రధాన మంత్రి అన్నారు.

ఈ కార్యక్రమం లో తెలంగాణ రాష్ట్ర గవర్నరు డాక్టర్ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్, కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ఇంకా ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

 

పూర్వ రంగం

ప్రధాన మంత్రి మూడు జాతీయ రాజమార్గ (ఎన్ హెచ్) ప్రాజెక్టుల కు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ప్రధాన మంత్రి ప్రారంభించిన నేశనల్ హైవే ప్రాజెక్టుల లో ఎన్ హెచ్ –161 లోని 40 కిలోమీటర్ల పొడవైన కంది – రాంసాన్ పల్లి సెక్శన్ వరకు నాలుగు దోవల తో కూడినటువంటి రహదారి ప్రాజెక్టు లు ఉన్నాయి. ఇండోర్ – హైదరాబాద్ ఎకనామిక్ కారిడార్ లో భాగమైన ఈ ప్రాజెక్టు తెలంగాణ, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ ల మధ్య ప్రయాణికుల కు యాత్ర సదుపాయాన్ని , సరుకుల రవాణా ను సులభతరం చేస్తుంది. ఈ సెక్శను వల్ల హైదరాబాద్-నాందేడ్ మధ్య ప్రయాణ సమయం గణనీయం గా సుమారు మూడు గంటలు తగ్గిపోనుంది. అలాగే 47 కిలోమీటర్ల పొడవైన మిర్యాలగూడ –,కోదాడ సెక్శను వరకు ఎన్ హెచ్ –167 ను రెండు లేన్ లు కలిగివుండేదిగా ఉన్నతీకరించిన ప్రాజెక్టు ను కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు. మెరుగుపడ్డ కనెక్టివిటీ ఈ ప్రాంతం లో పర్యాటకాన్ని ప్రోత్సహించడం తో పాటు ఈ ప్రాంతం లో ఆర్థిక కార్యకలాపాల వృద్ధికి, పరిశ్రమల విస్తరణ కు దోహద పడగలదు.

ఎన్ హెచ్ –65 లోని 29 కి.మీ. పొడవైన పుణె-హైదరాబాద్ సెక్శను ను ఆరు దోవలు కలిగివుండేది గా మార్చే పనుల కు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు తెలంగాణ లో పటాన్ చెరు కు దగ్గర లో ఉన్న పాశమైలారం పారిశ్రామిక ప్రాంతం వంటి ప్రధాన పారిశ్రామిక కేంద్రాల కు మెరుగైన కనెక్టివిటీ ని అందిస్తుంది.

 

ప్రధాన మంత్రి సనత్ నగర్ – మౌలా అలీ రైలు మార్గం యొక్క డబ్లింగు మరియు విద్యుతీకరణ ను, ఇంకా ఆరు నూతన స్టేశన్ భవనాల ను కూడా ప్రారంభించారు. మల్టి మాడల్ ట్రాన్స్ పోర్ట్ సర్వీస్ (ఎమ్ఎమ్ టిఎస్) రెండో దశ ప్రాజెక్టు లో భాగంగా మొత్తం 22 రూట్ కిలోమీటర్ల మేర సాగే ఈ ప్రాజెక్టు ను ఆటోమేటిక్ సిగ్నలింగ్ సదుపాయం తో ఏర్పాటు చేయడమైంది. ఇందులో భాగం గా, ఫిరోజ్ గూడ, సుచిత్ర సెంటర్, భూదేవి నగర్, అమ్ముగూడ, నేరేడ్ మెట్ మరియు మౌలా అలీ హౌసింగ్ బోర్డు స్టేశన్ లకు ఆరు కొత్త స్టేషన్ భవనాల ను ఏర్పాటు చేయడమైంది. డబ్లింగ్, విద్యుదీకరణ పనులు ఈ విభాగం లో తొలిసారి గా ప్యాసింజర్ రైళ్ల ప్రవేశాని కి మార్గాన్ని సుగమం చేసివేశాయి. ఇది ఇతర అధిక సంతృప్త విభాగాలపై భారాన్ని తగ్గించడం ద్వారా, ఈ ప్రాంతంలో రైళ్లు వాటికి కేటాయించిన కాలానికి గమ్యస్థానాల ను చేరుకోవడం లోను, రైళ్ల మొత్తం మీద వేగాన్ని మెరుగుపరచడం లోను తోడ్పడ గలదు.

  • మంత్రి సనత్ నగర్ – మౌలా అలీ ల మీదు గా ప్రయాణించే ఘట్ కేసర్ – లింగపల్లి ఎమ్ఎమ్ టిఎస్ రైలు సర్వీసు ను ఆకుపచ్చటి జెండా ను చూపెట్టి ప్రారంభించారు. ఈ రైలు హైదరాబాద్ – సికందరాబాద్ జంట నగరాల ప్రాంతాల లో ప్రజాదరణ కు పాత్రం అయినటువంటి సబర్బన్ రైలు సర్వీసు కు పొడిగింపు గా ఉన్నది. ఇది క్రొత్త ప్రదేశాల కు తొలిసారి గా సంధానాన్ని ఏర్పరుస్తున్నది. ఇది నగరం లోని తూర్పు ప్రాంతం లో చెర్లపల్లి మరియు మౌలా అలీ వంటి ఇంతవరకు ఎమ్ఎమ్ టిఎస్ సదుపాయం లేని ప్రదేశాల ను జంటనగరాల లోని పశ్చిమ భాగం తో కలుపుతుంది. జంట నగరాల ప్రాంతం లో తూర్పు మరియు పశ్చిమ భాగాల ను కలుపుతూ సాగిపోయే ఈ రవాణా మాధ్యం సురక్షితమైన, వేగవంతమైన మరియు తక్కువ ఖర్చు లో అందుబాటులో ఉండేటటువంటి రవాణా మాధ్యం రూపం లో ప్రయాణికుల కు ఎంతో లాభసాటి గా ఉండగలదు.

ఇంకా, ఇండియన్ ఆయిల్ కు చెందిన పారాదీప్-హైదరాబాద్ ప్రాడక్ట్ పైప్ లైను ను కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు. 4.5 ఎమ్ఎమ్ టిపిఎ సామర్థ్యం కలిగిన 1212 కిలోమీటర్ ల ఈ ప్రాడక్ట్ పైపులైను ఒడిశా (329 కి.మీ. మేర), ఆంధ్ర ప్రదేశ్ (723 కి.మీ. మేర), తెలంగాణ (160 కి.మీ.మేర) రాష్ట్రాల గుండా సాగుతుంది. పారాదీప్ రిఫైనరీ నుండి ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, అచ్యుతాపురం, విజయవాడ, తెలంగాణ లోని హైదరాబాద్ కు సమీపం లో ఉన్న మల్కాపూర్ లోని డెలివరీ స్టేశన్ లకు పెట్రోలియం ఉత్పత్తులను సురక్షితంగాను, తక్కువ ఖర్చు లోను చేరవేయడానికి ఈ పైప్ లైను దోహద పడుతుంది.

హైదరాబాద్ లో సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ( సి ఎ ఆర్ ఒ ) కేంద్రాన్ని ప్రధాన మంత్రి ప్రారంభించారు. ఈ కేంద్రాన్ని పౌర విమానయాన రంగం లో పరిశోధన మరియు అభివృద్ధి (ఆర్ అండ్ డీ) సంబంధి కార్యకలాపాలను ఉన్నతీకరించడానికి, వృద్ధి చెందింపచేయడానికి హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయం లో ఎయర్ పోర్ట్స్ ఆథారిటి ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసింది. ఇది స్వదేశీ మరియు నూతన ఆవిష్కరణ సంబంధి పరిష్కారాలను అందించడం కోసం సంస్థ లో అంతర్గతమైనటువంటి మరియు సహకార పూర్వకమైనటువంటి పరిశోధన కార్యకలాపాల ద్వారా విమానయాన సముదాయాని కి ప్రపంచ స్థాయి లో పరిశోధనలు ప్రధానం గా ఉండేటటువంటి ఒక వేదిక ను అందించడానికి ఉద్దేశించినటువంటిది అని చెప్పాలి. 350 కోట్ల రూపాయల కు పైగా నిధుల తో నిర్మించిన ఈ అత్యాధునిక సదుపాయం 5-స్టార్-జిఆర్ఐహెచ్ఎ రేటింగు మరియు ఎనర్జీ కన్జర్వేశన్ బిల్డింగ్ కోడ్ (ఇసిబిసి) నిబంధనలకు తుల తూగుతున్నది. భవిష్యత్తు లో పరిశోధన , అభివృద్ధి కార్యక్రమాల కు మద్దతు ను ఇవ్వడానికి సిఎఆర్ ఒ ఒక సమగ్ర ప్రయోగశాల సామర్థ్యాల సమూహాన్ని ఉపయోగించుకొంటుంది. ఆపరేశనల్ అనైలిసిస్, పర్ఫార్మెన్స్ మెజర్మెంట్ ల కోసం డేటా అనలిటిక్స్ సామర్థ్యాలను కూడా ఇది ఉపయోగించుకొంటుంది. గగనతలం, విమానాశ్రయ సంబంధి భద్రత, సామర్థ్యం , సామర్థ్యాల మెరుగుదల తో ముడిపడ్డ కార్యక్రమాలు, గగనతలం లో ఎదురయ్యే ప్రధాన సవాళ్ల ను పరిష్కరించడం, విమానాశ్రయాల కు మౌలిక సదుపాయాల పరం గా ఎదురుకాగల సవాళ్ల ను బేరీజు వేయడం, భవిష్యత్తు కాలం లో గగనతలం , విమానాశ్రయాల అవసరాల ను దృష్టిలో పెట్టుకొని గుర్తించిన రంగాల లో సాంకేతికతల ను మరియు ఉత్పత్తుల ను అభివృద్ధిపరచడం మొదలైనవి సిఎఆర్ ఒ యొక్క ప్రాథమిక ఆర్ ఎండ్ డి కార్యకలాపాల లో భాగం గా ఉన్నాయి.

*****

DS/TS