Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సంత్ గురు రవిదాస్ యొక్క 647 వ జయంతి సందర్భం లో వారాణసీ లో ఏర్పాటైన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి

సంత్ గురు రవిదాస్ యొక్క 647 వ జయంతి సందర్భం లో వారాణసీ లో ఏర్పాటైన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి


సంత్ గురు రవిదాస్ యొక్క 647 వ జయంతి సందర్భం లో వారాణసీ లో ఈ రోజు న జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. బిహెచ్‌యు కు సమీపం లో ఉన్న సీర్ గోవర్థన్‌పుర్ లో నెలకొన్న సంత్ గురు రవిదాస్ జన్మస్థలి ఆలయం లో ప్రధాన మంత్రి సంత్ రవిదాస్ పార్కు ను ఆనుకొని ఏర్పాటైన సరిక్రొత్త సంత్ రవిదాస్ విగ్రహాన్ని ప్రధాన మంత్రి ప్రారంభించారు. సుమారు 32 కోట్ల రూపాయల విలువ కలిగిన అనేక అభివృద్ధి పనుల ను కూడా సంత్ రవిదాస్ జన్మస్థలి పరిసరాల లో ఆయన ప్రారంభించారు. అంతేకాకుండా, సంత్ రవిదాస్ మ్యూజియమ్ నిర్మాణాని కి మరియు రమారమి 62 కోట్లు ఖర్చు అయ్యే ఉద్యానవనం సుందరీకరణ కు సంబంధించిన పనుల కు కూడా ఆయన శంకుస్థాపన చేశారు.

 

సభ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, సంత్ రవిదాస్ జీ యొక్క 647 వ జయంతి సందర్భం లో ఆయన జన్మస్థలాని కి ప్రతి ఒక్కరి కి ఇదే ఆహ్వానం అన్నారు. ఈ కార్యక్రమం లో దేశం నలుమూలల నుండి భక్త గణం పాలుపంచుకొంటూ ఉండడాన్ని ప్రధాన మంత్రి గమనించి, పంజాబ్ నుండి కాశీ కి తరలివచ్చిన ప్రజల లో వ్యక్తమవుతున్న ఉత్సాహాన్ని ప్రశంసించారు. కాశీ చూడబోతే ఒక బుల్లి పంజాబ్ లాగా కనుపిస్తోంది అని ఆయన అన్నారు. సంత్ రవిదాస్ జీ యొక్క జన్మస్థలాని కి తిరిగివచ్చి, మరి ఆయన యొక్క సంకల్పాల ను, ఆదర్శాల ను ముందుకు తీసుకు పోతున్నందుకు గాను కృతజ్ఞత ను ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు.

 

కాశీ కి ప్రతినిధి గా ఉన్న తనకు సంత్ రవిదాస్ జీ యొక్క అనుచరుల కు సేవ చేసే అవకాశం లభించింది అంటూ ప్రధాన మంత్రి సంతోషాన్ని వ్యక్తం చేశారు. సంత్ రవిదాస్ జీ యొక్క జన్మస్థలి ఉన్నతీకరణ కు ఉద్దేశించిన పథకాల ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ఈ పథకాల లో దేవాలయ ప్రాంతం అభివృద్ధి పనులు, అప్రోచ్ రోడ్డు ల నిర్మాణం, ఆరాధనల కు సంబంధించిన ఏర్పాటు లు, ప్రసాదం మొదలైనవి భాగం గా ఉన్నాయి. సంత్ రవిదాస్ యొక్క క్రొత్త విగ్రహాన్ని గురించి కూడా ప్రధాన మంత్రి మాట్లాడారు. సంత్ రవిదాస్ మ్యూజియమ్ కు ఆయన శంకుస్థాపన చేశారు.

 

ఈ రోజు న గొప్ప ముని మరియు సంఘ సంస్కర్త గాడ్‌ గే బాబా జయంతి కూడా ఉంది అని ప్రధాన మంత్రి చెప్తూ, పేదలు మరియు ఆదరణ కు దూరమైన వర్గాల వారి అభ్యున్నతి దిశ లో గాడ్‌గే బాబా అందించిన తోడ్పాటు ను గురించి ప్రముఖం గా ప్రకటించారు. గాడ్‌ గే బాబా యొక్క కార్యాల ను బాబా సాహెబ్ ఆంబేడ్ కర్ ఎంతగానో అభిమానించే వారు. మరి గాడ్‌ గే బాబా కూడాను బాబా సాహెబ్ వల్ల ప్రభావితులు అయ్యారు అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియ జేశారు. గాడ్‌ గే బాబా జయంతి సందర్భం లో ఆయన కు కూడా ప్రధాన మంత్రి ప్రణామాన్ని ఆచరించారు.

 

సంత్ రవిదాస్ యొక్క బోధన లు తనకు సదా దారి ని చూపెట్టాయి అని ప్రధాన మంత్రి అన్నారు. సంత్ రవిదాస్ యొక్క ఆశయాల సాధన కోసం సేవ చేసేటటువంటి హోదా లో తాను ఉన్నందుకు ప్రధాన మంత్రి కృతజ్ఞత ను వ్యక్తం చేశారు. మధ్య ప్రదేశ్ లో ఇటీవల సంత్ రవిదాస్ స్మారకాని కి శంకుస్థాపన చేసిన సంగతి ని ప్రధాన మంత్రి ప్రస్తావించారు.

 

‘‘భారతదేశానికి అవసరం అయినప్పడు ఒక సాధువు, ముని లేదా ఏ మహానుభావుడో ఒక రక్షకుని రూపం లో అవతరించడం అనేది భారతదేశ చరిత్ర లోనే ఇమిడిపోయి ఉంది’’ అని ప్రధాన మంత్రి నొక్కి పలికారు. సంత్ రవిదాస్ జీ భక్తి ఉద్యమం లో ఒక భాగం అని ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రకటించారు. చీలికలు వాలికలు గా తయారైన భారతదేశాని కి భక్తి ఉద్యమం పునఃశక్తి ని ప్రసాదించింది అని ప్రధాన మంత్రి అన్నారు. రవిదాస్ జీ సమాజం లో స్వాతంత్య్రాని కి అర్థాన్ని చెప్పారు అని ప్రధాన మంత్రి పేర్కొంటూ, సమాజం లో ఉన్న విభజనల ను సైతం రవిదాస్ జీ తొలగించారు అన్నారు. ‘‘అంటరానితనాని కి, వర్గవాదాని కి మరియు వివక్ష కు వ్యతిరేకం గా సంత్ రవిదాస్ జీ ఎలుగెత్తారు’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘సంత్ రవిదాస్ ను ధర్మం మరియు అభిప్రాయం ల తాలూకు సిద్ధాంతాల తో బంధించలేం.’’ అని ఆయన అన్నారు. ‘‘సంత్ రవిదాస్ జీ అందరి వాడు; ప్రతి ఒక్కరు రవిదాస్ జీ కి అనుయాయులే’’ అని ప్రధాన మంత్రి అన్నారు. వైష్ణవ సముదాయం సైతం సంత్ రవిదాస్ జీ ని వారి యొక్క గురువు వలె భావిస్తుంది. వారి దృష్టి లో జగత్‌ గురు రామానంద్ యొక్క శిష్యుడే సంత్ రవిదాస్ జీ; అదే మాదిరిగా సిఖ్ఖు సముదాయం ఆయన ను అపారమైన ఆరాధన భావం తో చూస్తుంది అని ప్రధాన మంత్రి అన్నారు. గంగ నది పట్ల నమ్మకాన్ని కలిగి ఉన్న వ్యక్తులు మరియు వారాణసీ కి చెందిన వ్యక్తులు సంత్ రవిదాస్ జీ నుండి ప్రేరణ ను పొందుతారు అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. ప్రస్తుత ప్రభుత్వం సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్మంత్రాన్ని అనుసరిస్తూనే సంత్ రవిదాస్ యొక్క ప్రబోధాల ను మరియు ఆశయాల ను ముందుకు తీసుకుపోతూ ఉన్నందుకు ప్రధాన మంత్రి హర్షాన్ని వ్యక్తం చేశారు.

 

సమానత్వం మరియు సంయోగ శక్తి ల పట్ల సంత్ రవిదాస్ జీ బోధించిన అంశాల ను గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, ఆదరణ కు నోచుకోని వర్గాల కు మరియు వెనుకబడిన సముదాయాల కు పెద్ద పీట వేసినప్పుడే సమానత్వం సాధ్యపడుతుంది అని పేర్కొన్నారు. అభివృద్ధి యాత్ర లో చేర్చుకోకుండా వదలివేసిన ప్రజల చెంత కు ప్రభుత్వ కార్యక్రమాల యొక్క ప్రయోజనాల ను తీసుకొని పోవాలి అనేదే ప్రభుత్వం యొక్క ప్రయాస గా ఉంది అని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచం లో కెల్లా అతి పెద్దది అయినటువంటి సంక్షేమ పథకం అనదగిన పథకం ఏది అంటే అది 80 కోట్ల మంది భారతీయుల కు ఆహార పదార్థాల ను ఉచితం గా ఇచ్చే పథకమే అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘ఇంత విస్తృతమైనటువంటి స్థాయి లో నడిచే ఈ తరహా పథకం ప్రపంచం లో మరే దేశం లోను లేదు’’ అని ప్రధాన మంత్రి అన్నారు. స్వచ్ఛ్ భారత్ అభియాన్ లో భాగం గా టాయిలెట్ ల నిర్మాణం ద్వారా ఎక్కువ గా లాభపడింది దళితులు, వెనుకబడిన వర్గాల వారు మరియు ఎస్‌సి/ఎస్‌టి/ఒబిసి, మహిళలే అని ప్రధాన మంత్రి అన్నారు. ఇదే విధం గా జల్ జీవన్ అభియాన్ అయిదు సంవత్సరాల కంటే తక్కువ కాలం లో 11 కోట్ల కు పైగా కుటుంబాల కు నల్లా నీటి ని అందించింది అని ఆయన అన్నారు. ఆయుష్మాన్ కార్డు ను అందుకోవడం కోట్ల కొద్దీ పేదల కు భద్రత భావన ను కలుగజేస్తున్నదని ప్రధాన మంత్రి అన్నారు. జన్ ధన్ ఖాతా ల ద్వారా ఆర్థిక సేవల పరిధి ని పెద్ద ఎత్తున విస్తరించడం జరిగింది అని కూడా ఆయన పేర్కొన్నారు. పత్యక్ష ప్రయోజన బదలీ ఎన్నో లాభాల ను కలుగజేసింది. ఆ లాభాల లో ఒకటి కిసాన్ సమ్మాన్ నిధి తాలూకు బదలాయింపు. దీని ద్వారా దళిత రైతులు ఎంతో మంది కి ప్రయోజనం చేకూరుతున్నది. ఫసల్ బీయా యోజన కూడా ఈ వర్గాల కు తోడ్పడుతున్నది. ఉపకార వేతనాల ను అందుకొంటున్న దళిత యువత యొక్క సంఖ్య 2014 నాటి నుండి రెట్టింపు అయింది అని, పిఎమ్ ఆవాస్ యోజన లో భాగం గా దళిత కుటుంబాల వారు కోట్ల కొద్దీ రూపాయల సొమ్ము ను ఆర్థిక సహాయం రూపం లో స్వీకరించారని ప్రధాన మంత్రి తెలిపారు.

 

దళితుల, నిరాదరణ కు గురైన వర్గాల మరియు పేదల యొక్క అభ్యున్నతి విషయం లో ప్రభుత్వం యొక్క ఉద్దేశ్యాలు స్పష్టం గా ఉన్నాయి; మరి ఇవాళ ప్రపంచం లో భారతదేశం సాధిస్తున్న పురోగతి కి వెనుక ఉన్నటువంటి కారణం ఇదే అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. సాధువులు చెప్పిన మాటలు ప్రతి యుగం లో మార్గదర్శి గా నిలుస్తుండడం తో పాటు మనకు హెచ్చరిక ను కూడా చేస్తూ వచ్చాయి అని ఆయన అన్నారు. రవిదాస్ జీ ఆడిన మాటల ను ప్రధాన మంత్రి ఉదాహరిస్తూ, ప్రజల లో చాలా మంది కులం, వర్గం ల తాలూకు భేదాల లో చిక్కుబడిపోయి ఉంటున్నారు. మరి ఈ కులవాదం తాలూకు వ్యాధి మానవ జాతి కి నష్టాన్ని కొని తెస్తోంది అని ప్రధాన మంత్రి వివరించారు. ఎవరైనా ఒక వ్యక్తి కులం పేరు తో మరొక వ్యక్తి ని ఉద్రేకపరిచారా అంటే గనుక అది కూడా మానవ జాతి కి చేటు ను కొనితెస్తుంది అని ఆయన అన్నారు.

 

దళితుల సంక్షేమాన్ని వ్యతిరేకించే శక్తుల తో అప్రమత్తం గా ఉండండి అంటూ ప్రధాన మంత్రి జాగ్రత చెప్పారు. ఆ తరహా వ్యక్తులు కుల రాజకీయాల ముసుగు లో కుటుంబం మరియు వంశం లకు సంబంధించిన రాజకీయాల ను చేస్తూ ఉంటారు అని ఆయన అన్నారు. అటువంటి శక్తులు దళితుల ఉన్నతి ని అభినందించకుండా వంశవాద రాజకీయాలు అడ్డుకొంటుంటాయని ఆయన అన్నారు. ‘‘కులవాదం తాలూకు ప్రతికూల మనస్తత్వాన్ని మనం విడనాడితీరాలి, మరి రవిదాస్ జీ యొక్క సకారాత్మక ప్రబోధాల ను అనుసరించాలి’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

 

రవిదాస్ జీ పలికిన పలుకుల ను ప్రధాన మంత్రి ఉదాహరిస్తూ, ఎవరైనా ఒక వ్యక్తి 100 సంవత్సరాల పాటు బ్రతికి ఉన్నప్పటికీ, అటువంటి వ్యక్తి జీవన పర్యంతం శ్రమిస్తూనే ఉండాలి; ఎందుకంటే, కర్మ చేయడం అనేది ఒక ధర్మం గా ఉంది; మరి ఆ పనుల ను స్వార్థరహితం గా కూడా చేయవలసి ఉంది అన్నారు. సంత్ రవిదాస్ జీ యొక్క ఈ ప్రబోధం ప్రస్తుతం యావత్తు దేశాని కి ఉద్దేశించింది అని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశం ఒక వికసిత్ భారత్ నిర్మాణాని కి గాను ఒక బలమైన పునాది ని వేసినటువంటి ఆజాదీ కా అమృత్ కాల్ద్వారా పయనిస్తోంది అని ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రకటించారు. రాబోయే అయిదు సంవత్సరాల లో వికసిత్ భారత్ తాలూకు పునాది ని బలపరచడాన్ని గురించి ప్రధాన మంత్రి నొక్కి పలికారు. పేదల కు మరియు అణచివేత కు గురి అయిన వర్గాల వారి కి సేవ చేయడాని కి లక్షించిన ప్రచార ఉద్యమాల పరిధి ని విస్తరించడం అనేది భారతదేశం లో 140 కోట్ల మంది భాగస్వామ్యాన్ని ఏర్పరచుకొంటేనే సాధ్యపడుతుంది అని ఆయన స్పష్టం చేశారు. ‘‘మనం దేశం కోసం అవశ్యం ఆలోచించాలి. మనం చీలిక లు తెచ్చే ఆలోచన ల నుండి దూరం జరిగి, దేశ ఏకత్వాన్ని పటిష్ట పరచవలసి ఉంది’’ అని ప్రధాన మంత్రి చెప్తూ తన ప్రసంగాన్ని ముగించారు. సంత్ రవిదాస్ జీ యొక్క అనుగ్రహం తో పౌరుల యొక్క కలలు నిజం అవుతాయన్న విశ్వాసాన్ని ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు.

 

ఈ సందర్భం లో ఉత్తర్ ప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, సంత్ గురు రవిదాస్ జన్మస్థాన్ టెంపుల్ ట్రస్ట్ యొక్క చైర్ మన్ సంత్ నిరంజన్ దాస్ తదితరులు పాలుపంచుకొన్నారు.