Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఉత్తర్ ప్రదేశ్ లోని సంభల్ లో శ్రీ కల్కి ధామ్ ఆలయానికి శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి

ఉత్తర్ ప్రదేశ్ లోని సంభల్ లో శ్రీ కల్కి ధామ్ ఆలయానికి శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ఉత్తర్ ప్రదేశ్ లోని సంభల్ జిల్లా లో శ్రీ కల్కి ధామ్ దేవాలయాని కి శంకుస్థాపన చేశారు. శ్రీ కల్కి ధామ్ దేవాలయం యొక్క నమూనా ను కూడా ప్రధాన మంత్రి ఆవిష్కరించారు. శ్రీ కల్కి ధామ్ ను ఆచార్య శ్రీ ప్రమోద్ కృష్ణామ్ చైర్‌మన్ గా ఉన్నటువంటి శ్రీ కల్కి ధామ్ నిర్మాణ్ ట్రస్టు నిర్మిస్తున్నది. ఈ కార్యక్రమం లో అనేక మంది సాధువులు, ధార్మిక నాయకులు మరియు ఇతర ప్రముఖులు పాలుపంచుకొంటున్నారు.

 

సభ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ప్రభువు శ్రీ రాముని మరియు శ్రీ కృష్ణుని నిలయం అయినటువంటి ఈ ప్రాంతం భక్తి, భావోద్వేగం మరియు ఆధ్యాత్మికత్వం లతో మరొక్క సారి నిండిపోయింది. మరొక ప్రముఖ తీర్థయాత్ర స్థలాని కి శంకుస్థాపన కార్యక్రమం ఈ రోజు జరుగుతుండడమే దీనికి కారణం. సంభల్ లో శ్రీ కల్కిధామ్ దేవాలయాని కి శంకుస్థాపన చేసే అవకాశం లభించినందుకు శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞత ను వ్యక్తం చేశారు. ఇది భారతదేశం లో ఆధ్యాత్మికత్వం తాలూకు ఒక క్రొత్త కేంద్రం గా ఉనికి లోకి వస్తుందన్న విశ్వాసాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. ఈ సందర్భం లో ప్రపంచవ్యాప్తం గా పౌరులు అందరికీ మరియు తీర్థయాత్రికుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

 

 

పద్దెనిమిది సంవత్సరాల పాటు నిరీక్షణ అనంతరం ఈ ధామం ప్రారంభం అవుతున్న విషయాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, నేను పూర్తి చేయవలసిన సత్కార్యాలు అనేకం ఉన్నట్లు గా అనిపిస్తోంది అన్నారు. ప్రజల యొక్క మరియు మునుల యొక్క ఆశీర్వాదాల తో అసంపూర్తి గా ఉన్న కార్యాల ను పూర్తి చేయడాన్ని తాను కొనసాగిస్తూ ఉంటానని ఆయన అన్నారు.

 

 

ఈ రోజు న ఛత్రపతి శ్రీ శివాజీ మహారాజ్ యొక్క జయంతి. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి గుర్తు చేస్తూ, నేడు జరుగుతున్నటువంటి సాంస్కృతిక పునరుద్ధరణ, గౌరవం మరియు మన గుర్తింపు పట్ల నమ్మకాల కు సంబంధించిన ఖ్యాతి శ్రీ శివాజీ మహారాజ్ కు దక్కుతుంది అన్నారు. ఛత్రపతి శ్రీ శివాజీ మహారాజ్ కు ప్రధాన మంత్రి శ్రద్ధాంజలి ని ఘటించారు.

 

 

దేవాలయం యొక్క వాస్తు కళ ను గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఈ దేవాలయం లో పది గర్భగుడులు ఉంటాయి, వాటిలో భగవానుని దశ అవతారాల మూర్తులు కొలువుదీరుతాయి అన్నారు. ఈ పది అవతారాల ద్వారా ధర్మ గ్రంథాల లో మానవ రూపం సహా భగవానుని యొక్క అన్ని రూపాల ను ఆవిష్కరించడం జరిగింది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వివరించారు. ‘‘జీవనం లో ఎవరైనా ఒక వ్యక్తి భగవానుని యొక్క చేతన ను తన అనుభవం లోకి తెచ్చుకోగలుగుతారు. ’’ మనం భగవానుని సింహం , వరాహం మరియు కూర్మం ల రూపాల లో అనుభవం లోకి తెచ్చుకొన్నాం’’ అని అని ప్రధాన మంత్రి అన్నారు. భగవానుని ఈ స్వరూపాల లో కొలువుదీర్చడం ప్రజల కు భగవాన్ పట్ల మాన్యత తాలూకు సమగ్రమైన మూర్తుల ను అవగాహన లోకి తీసుకు వస్తుంది అని ఆయన అన్నారు. శ్రీ కల్కి ధామ్ దేవాలయాని కి శంకుస్థాపన ను చేసే అవకాశాన్ని తనకు ఇచ్చినందుకు గాను భగవంతుని కి ధన్యవాదాల ను ప్రధాన మంత్రి తెలియ జేశారు. ప్రధాన మంత్రి ఈ కార్యక్రమం లో హాజరు అయిన మునులు అనేక మంది కి వారు అందించినటువంటి మార్గదర్శకత్వాని కి గాను ప్రణామాన్ని ఆచరించడం తో పాటుగా శ్రీ ఆచార్య ప్రమోద్ కృష్ణామ్ కు కూడా ధన్యవాదాల ను వ్యక్తం చేశారు.

 

ఈ రోజు న జరుపుకొంటున్నటువంటి కార్యక్రమం భారతదేశం యొక్క సాంస్కృతిక పునర్జాగరణ తాలూకు మరొక అద్వితీయమైనటువంటి క్షణం గా ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు. అయోధ్య ధామ్ లో శ్రీ రామ మందిరం యొక్క అభిషేకం గురించి మరియు అబూ ధాబి లో ఆలయాన్ని ఇటీవల ప్రారంభించడాన్ని గురించి ప్రధాన మంత్రి గుర్తు కు తీసుకు వస్తూ, ‘‘ఊహ కు ఎప్పుడైనా అందనిది ఇక వాస్తవం గా మారిపోయింది’’ అన్నారు.

 

 

వెంట వెంటనే ఆ తరహా కార్యక్రమాలు చోటు చేసుకొంటూ ఉండడం యొక్క మహత్త్వాన్ని గురించి ప్రధాన మంత్రి నొక్కిపలికారు. ఆధ్యాత్మిక ఉత్థనాన్ని గురించి ఆయన మాట్లాడుతూ, కాశీ లో విశ్వనాథ్ ధామ్, కాశీ యొక్క రూపు రేఖలు మార్పునకు లోను కావడం, మహాకాళ్ మహాలోక్, సోమ్‌‌ నాథ్, ఇంకా కేదార్‌ నాథ్ ధామ్ లను గురించి ప్రస్తావించారు. ‘‘ మనం వికాస్ భీ విరాసత్ భీ(వారసత్వం తో పాటుగా అభివృద్ధి కూడాను) అనే మంత్రం తో ముందుకు సాగిపోతున్నాం’’ అని ఆయన అన్నారు. అత్యున్నతమైన సాంకేతిక పరిజ్ఞానం తో కూడినటువంటి పట్టణ ప్రాంతాల మౌలిక సదుపాయాలు సిద్ధం అవుతుండడాన్ని ఒక వైపు న, ఆధ్యాత్మిక కేంద్రాల ను మరొక వైపున, దేవాలయాల జాడ ను ఒక ప్రక్కన, క్రొత్త వైద్య చికిత్స కళశాల ల స్థాపన ను మరొక వైపు న, విదేశాల నుండి కళాకృతులు భారతదేశాని కి తరలి వస్తుండడాన్ని ఒక వైపున మరియు విదేశీ పెట్టుబడుల రాక ను మరొక వైపు మనం గమనించ వచ్చును అని ఆయన అన్నారు. ఈ ఘటన క్రమాలు కాలమనే చక్రం యొక్క భ్రమణాన్ని సూచిస్తున్నాయి అని ఆయన అన్నారు. ఎర్ర కోట మీది నుండి ఆయన యహీ సమయ్ హై, సహీ సమయ్ హై’ (‘ ఇదే సమయం – ఇదే సరి అయినటువంటి సమయం’) అంటూ ఇచ్చిన పిలుపు ను గుర్తు కు తీసుకు వస్తూ, కాలం తో కలసి నడవవలసినటువంటి అవసరం ఎంతయినా ఉంది అని స్పష్టం చేశారు.