ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కతర్ లోని దోహా లో ఈ రోజు న తన ఒకటో కార్యక్రమం లో భాగం గా, కతర్ ప్రధాని మరియు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ శేఖ్ మహమ్మద్ బిన్ అబ్దుల్రహమాన్ అల్ థానీ తో సమావేశమయ్యారు.
ఇరువురు నేత లు వ్యాపారం, పెట్టుబడి, శక్తి, ఆర్థిక వ్యవహారాలు మరియు సాంకేతిక విజ్ఞానం ల వంటి రంగాల లో ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించుకోవడం అనే అంశం లో వారి వారి అభిప్రాయాల ను ఒకరి కి మరొకరు తెలియ జేసుకొన్నారు. వారు పశ్చిమ ఆసియా లో ఇటీవలి ప్రాంతీయ ఘటన క్రమాల ను కూడా చర్చించారు. ఆ ప్రాంతం లోను మరియు ఆ ప్రాంతాని కి ఆవల శాంతి ని, ఇంకా స్థిరత్వాన్ని పరిరక్షించడం ముఖ్యం అని వారు నొక్కిచెప్పారు.
ఆ తరువాత, ప్రధాన మంత్రి తన గౌరవార్థం కతర్ ప్రధాని ఇచ్చిన ఒక విందు లో పాలుపంచుకొన్నారు.
***
Had a wonderful meeting with PM @MBA_AlThani_. Our discussions revolved around ways to boost India-Qatar friendship. pic.twitter.com/5PMlbr8nBQ
— Narendra Modi (@narendramodi) February 14, 2024