Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పూర్వ ప్రధాని శ్రీ పి.వి. నరసింహా రావు కు భారత్రత్న పురస్కారాన్ని ఇవ్వడం జరుగుతుంది: ప్రధాన మంత్రి


పూర్వ ప్రధాని శ్రీ పి.వి. నరసింహా రావు కు ‘భారత్ రత్న’ గౌరవం దక్కనుందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న తెలియ జేశారు.

ప్రధాని గా శ్రీ పి.వి. నరసింహా రావు పదవీ కాలం లో ముఖ్యమైన నిర్ణయాలు వెలువడ్డాయి. అవి భారతదేశం యొక్క తలుపుల ను ప్రపంచ బజారుల కు తెరచాయి; ఇది ఆర్థికాభివృద్ధి లో ఒక నూతన శకాన్ని ప్రోత్సహించింది అని ఆయన అన్నారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో –

‘‘మన పూర్వ ప్రధాని శ్రీ పి.వి. నరసింహా రావు గారి ని భారత్ రత్నతో సమ్మానించడం జరుగుతుంది అనే విషయాన్ని తెలియ జేస్తున్నందుకు సంతోషిస్తున్నాను.

 

ఒక విశిష్ట పండితుని గాను మరియు రాజనీతిజ్ఞుడి గాను శ్రీ నరసింహా రావు గారు అనేకమైన పదవుల లో భారతదేశాని కి ఎనలేని సేవల ను అందించారు. అలాగే, ఆంధ్ర ప్రదేశ్ కు ముఖ్యమంత్రి గాను, కేంద్ర మంత్రి గాను, పార్లమెంటు లో సభ్యుని గా మరియు విధాన సభ లో సభ్యుని గాను అనేక సంవత్సరాల పాటు ఆయన చేసిన పనుల కు కూడాను ఆయన ను స్మరించుకోవడం జరుగుతోంది. భారతదేశం ఆర్థికం గా పురోగమించేటట్లు చూడడం లో, దేశం సమృద్ధి కావడం కోసం మరియు దేశం వృద్ధి చెందడం కోసం ఒక బలమైన పునాది ని వేయడం లో ఆయన దూరదర్శి నాయకత్వం తోడ్పడింది.

 

ప్రధాని పదవి లో శ్రీ పి.వి. నరసింహా రావు ఉన్నటువంటి కాలం లో ప్రముఖ నిర్ణయాలు జరిగాయి. పర్యవసానం గా భారతదేశాన్ని ప్రపంచ బజారుల కోసం తెరవడమైంది, తద్ద్వారా ఆర్థికాభివృద్ధి తాలూకు ఒక నవ శకాన్ని ప్రోత్సహించడం జరిగింది. దీనికి అదనం గా, భారతదేశం యొక్క విదేశీ విధానాని కి, భాషా రంగాని కి మరియు విద్య రంగాని కి ఆయన అందించిన తోడ్పాటులు ఒక నాయకుని గా ఆయన లోని బహుముఖీనమైన వారసత్వాన్ని స్పష్టం చేస్తున్నాయి; ఆయన భారతదేశాన్ని కీలకమైన పరివర్తనల మధ్య నుండి విజయవంతం గా ముందుకు నడపడం ఒక్కటే కాకుండా భారతదేశం యొక్క సాంస్కృతిక వారసత్వాన్ని మరియు భారతదేశం యొక్క బౌద్ధిక వారసత్వాన్ని కూడా సమృద్ధం చేశారు.’’ అని వివరించారు.

 

 

***

DS/RT