Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

డాక్టర్ శ్రీ ఎమ్.ఎస్ స్వామినాథన్ కు భారత్ రత్న నుప్రదానం చేయడం జరుగుతుంది: ప్రధాన మంత్రి


హరిత క్రాంతి లో కీలక భూమిక ను పోషించారని ప్రసిద్ధి చెందిన డాక్టర్ శ్రీ ఎమ్.ఎస్ స్వామినాథన్ కు అత్యున్నత పౌర పురస్కారం ‘భారత్ రత్న’ ను కట్టబెట్టడం జరుగుతుంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎక్స్ మాధ్యం లో ఈ రోజు న తెలియ జేశారు.

 

 

డాక్టర్ శ్రీ ఎమ్.ఎస్ స్వామినాథన్ యొక్క దూరదర్శి నాయకత్వం భారతదేశం లో వ్యవసాయం యొక్క రూపురేఖల ను మార్చడం ఒక్కటే కాకుండా దేశ ఆరోగ్య భద్రత కు మరియు సమృద్ధి కి కూడాను పూచీ పడింది అని ప్రధాన మంత్రి అన్నారు.

 

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో –

‘‘మన దేశం లో వ్యవసాయాని కి మరియు రైతుల సంక్షేమాని కి డాక్టర్ శ్రీ ఎమ్.ఎస్ స్వామినాథన్ గారు అందించినటువంటి మహత్తరమైన తోడ్పాటు కు గుర్తింపు గా ‘భారత్ రత్న’ ను భారత ప్రభుత్వం ఆయన కు కట్టబెడుతోంది అనే విషయం ఎంతో ఆనందాన్ని ఇచ్చే విషయం. ఆయన సవాళ్ళ తో నిండిన కాలం లో వ్యవసాయం లో భారతదేశం స్వయం సమృద్ధి ని సాధించడం లో ఆయన మహత్వపూర్ణమైనటువంటి పాత్ర ను పోషించారు, అంతేకాక భారతదేశం లో వ్యవసాయాన్ని ఆధునీకరించే దిశ లో ఉత్కృష్ట ప్రయాసలు చేశారు. మేం ఒక నూతన ఆవిష్కర్త గా మరియు సంరక్షకుని గా ఆయన యొక్క అమూల్యమైన కార్యాల ను గుర్తిస్తాం మరి అనేక మంది విద్యార్థుల ను జ్ఞానార్జన కై, ఇంకా పరిశోధనకై ప్రోత్సహించినటువంటి విషయాన్ని కూడాను మేం గుర్తించాం. డాక్టర్ శ్రీ ఎమ్.ఎస్ స్వామినాథన్ యొక్క దూరదర్శి నాయకత్వం భారతీయ వ్యవసాయం రూపురేఖల ను మార్చివేయడం తో పాటు గా దేశ ఆహార భద్రత కు మరియు సమృద్ధి కి కూడాను పూచీ పడింది. ఆయన ఎటువంటి వ్యక్తి గా ఉండేవారు అంటే ఆయన తో నాకు చాలా సన్నిహిత పరిచయం ఉంది; నేను ఎల్లప్పుడూ ఆయన యొక్క దృష్టికోణాన్ని మరియు ఆలోచనల ను గౌరవించాను.’’ అని పేర్కొన్నారు.

 

 

 

***

DS/RT