Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రి సూర్యోదయ యోజన కింద కోటి గృహాలకు పైకప్పు సౌరశక్తి


   ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఇవాళ ‘ప్రధానమంత్రి సూర్యోదయ యోజన’ కింద కోటి కుటుంబాలకు పైకప్పు సౌరశక్తిని సరఫరా చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- ‘‘ఈ రోజు అయోధ్యలో పవిత్ర ప్రాణ ప్రతిష్ట ఉత్సవం నేపథ్యంలో దేశంలోని ప్రజలు తమ ఇళ్ల పైకప్పుపై తమదైన సౌరశక్తి ఉత్పాదక వ్యవస్థకు సొంతదారులు కావాలన్న నా సంకల్పం మరింత బలపడింది. అయోధ్య నుంచి తిరిగి వచ్చిన తర్వాత తొలి నిర్ణయం మేరకు కోటి ఇళ్లపై రూఫ్‌టాప్ సౌరశక్తి వ్యవస్థ ఏర్పాటు లక్ష్యంగా ‘ప్రధానమంత్రి సూర్యోదయ యోజన’ను ప్రభుత్వం ప్రారంభించనుంది. ఇది పేద, మధ్యతరగతి ప్రజల విద్యుత్ బిల్లు తగ్గించడమేగాక ఇంధన రంగంలో భారతదేశాన్ని స్వయం సమృద్ధం చేస్తుంది’’ అన్నారు.

ఈ మేరకు ‘ఎక్స్’ పోస్ట్ ద్వారా పంపిన సందేశంలో:

 ‘ప్రపంచంలోని భక్తులందరూ సూర్యవంశజుడైన భగవాన్ శ్రీరాముని నుంచి సదా దివ్యకాంతి పొందుతారు. ఈ నేపథ్యంలో నేడు అయోధ్యలో ప్రాణప్రతిష్ట పవిత్రోత్సవం సందర్భంగా దేశ ప్రజలు తమ ఇళ్లపైకప్పుపై సూర్యశక్తితో విద్యుత్ వ్యవస్థ సదుపాయం పొందాలన్న నా సంకల్పం మరింత బలపడింది. ఈ మేరకు అయోధ్య నుంచి తిరిగి రాగానే ముందుగా నేను తీసుకున్న నిర్ణయం ఇదే. ఈ మేరకు దేశవ్యాప్తంగా కోటి ఇళ్లపై సౌరశక్తి వ్యవస్థ ఏర్పాటు కోసం ‘ప్రధానమంత్రి సూర్యోదయ యోజన’ ప్రారంభం కానుంది. దీనివల్ల పేద-మధ్య తరగతి ప్రజలకు విద్యుత్ బిల్లుల భారం తగ్గడమేగాక దేశం ఇంధన రంగంలో స్వయం సమృద్ధం కాగలదు’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.