అత్యధునాతనమైనటువంటి బోయింగ్ ఇండియా ఇంజినీరింగ్ & టెక్నాలజీ సెంటర్ (బిఐఇటిసి) కేంపసు ను కర్నాటక లోని బెంగళూరు లో ఈ రోజు న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. 1,600 కోట్ల రూపాయల పెట్టుబడి తో నిర్మాణం పూర్తి అయిన ఈ 43 ఎకరాల విస్తీర్ణం లో ఏర్పాటైన కేంపస్ యుఎస్ఎ కు వెలుపల బోయింగ్ పెట్టిన అతి పెద్ద పెట్టుబడి అని చెప్పాలి. శరవేగం గా వృద్ధి చెందుతున్నటువంటి దేశ విమానయాన రంగం లో భారతదేశం లో వివిధ ప్రాంతాల యువతులు అధిక సంఖ్య లో ప్రవేశించడాని కి వీలుగా వారిని ప్రోత్సహించాలన్న లక్ష్యం తో రూపుదిద్దిన బోయింగ్ సుకన్య కార్యక్రమాన్ని కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భం లో ఎక్స్పీరియన్స్ సెంటర్ గుండా ప్రధాన మంత్రి కలియతిరుగుతూ, సుకన్య లబ్ధిదారుల తో భేటీ అయ్యారు.
భారతదేశం లో విమానయాన రంగం వృద్ధి పై ప్రధాన మంత్రి చూపుతున్న శ్రద్ధ ను మరియు బోయింగ్ సుకన్య కార్యక్రమాన్ని ఈ రోజు న ప్రారంభించడం లో ఆయన పోషించిన పాత్ర ను బోయింగ్ కంపెనీ సిఒఒ స్టెఫనీ పోప్ గారు హర్షించారు. నిరంతర సమర్థన ను అందిస్తున్నందుకు ఆమె కృతజ్ఞత ను వ్యక్తం చేసి, ఏరోస్పేస్ యొక్క భవిత ను తీర్చిదిద్దడం లో కలసికట్టు గా ముందంజ వేయాలని ఆశ పడుతున్నట్లు చెప్పారు. ఈ క్రొత్త కేంపస్ బోయింగ్ యొక్క ఇంజినీరింగ్ వారసత్వాని కి ఒక నిదర్శన గా ఉందని, మరి ఇది భారతదేశం లో ప్రతిభ, సామర్థ్యం ల లభ్యత పట్ల నమ్మకాన్ని నొక్కి చెబుతోందన్నారు. క్రొత్త కేంపస్ యొక్క కార్యకలాపాల ను గురించి ఆమె వివరించారు. ఏరోస్పేస్ ఇండస్ట్రీ లో అగ్రస్థానాని కి భారతదేశాన్ని చేర్చగల ఒక ఇకోసిస్టమ్ ను ఏర్పరచాలన్నదే బోయింగ్ యొక్క ప్రణాళిక అని ఆమె తెలిపారు. అంతిమంగా, బోయింగ్ యొక్క నూతన కేంపస్ ‘ఆత్మనిర్భర్ భారత్’ తాలూకు ప్రధాన మంత్రి కార్యక్రమం యొక్క అత్యంత అధునాతనమైనటువంటి ఉదాహరణల లో ఒక ఉదాహరణ గా మారుతుంది అని స్టెఫనీ గారు అన్నారు. సుకన్య కార్యక్రమం యొక్క ఆలోచన వచ్చినందుకు గాను ప్రధాన మంత్రి ని ఆమె ప్రశంసించారు. భారతదేశం లో మహిళల కు విమానయాన రంగం లో ఇతోధిక అవకాశాల ను కల్పించడం కోసం బోయింగ్ తీసుకొంటున్న ప్రయాసల ను ఆమె అభినందించారు. ‘‘ఈ కార్యక్రమం అడ్డంకుల ను చేధిస్తుంది, మరింత మంది మహిళలు ఏరో స్పేస్ లో ఉపాధి ని పొందేటట్లుగా ప్రేరణ ను అందిస్తుంది’’ అని ఆమె చెప్పారు. మిడిల్ స్కూల్స్ లో ఎస్‌టిఇఎమ్ లేబ్స్ ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక లు సిద్ధం అవుతున్నాయి అని కూడా ఆమె వెల్లడించారు. బోయింగ్ మరియు భారతదేశం ల మధ్య భాగస్వామ్యం విమానయాన రంగ భవిత కు రూపురేఖల ను తీర్చిదిద్దగలదు, మరి భారతదేశం లో అలాగే ప్రపంచ దేశాల లో ప్రజల కు ఒక సకారాత్మకమైన వ్యత్యాసాన్ని చవిచూపగలదన్న విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు.
జనసమూహాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, బెంగళూరు నగరం ఎటువంటి నగరం అంటే అది నూతన ఆవిష్కరణల సంబంధి ఆకాంక్ష్ల ను మరియు కార్యసాధనల ను ముడి వేసేటటువంటి నగరం; అంతేకాదు, భారతదేశం యొక్క సాంకేతిక సత్తా ను ప్రపంచ అవసరాల కు తులతూగేటట్లుగా చేసేది కూడా ను అన్నారు. ‘‘ఈ నమ్మకాన్ని బోయింగ్ యొక్క క్రొత్త టెక్నాలజీ కేంపస్ బలపరుస్తుంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. క్రొత్త గా ప్రారంభం అయినటువంటి కేంపస్ యుఎస్ఎ కు వెలుపల ఉన్న బోయింగ్ తాలూకు అతి పెద్ద నిలయం అని కూడా ఆయన తెలియ జేశారు. దీని యొక్క విస్తృతి భారతదేశాన్ని బలోపేతం చేయడం ఒక్కటే కాకుండా యావత్తు ప్రపంచం లో విమానయాన సంబంధి బజారు ను కూడా పటిష్ట పరుస్తుంది అని ఆయన స్పష్టం చేశారు.
ప్రపంచ సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధన & నూతన ఆవిష్కరణలు, డిజైన్, ఇంకా డిమాండ్ లకు ఉతాన్ని అందించాలన్న భారతదేశం యొక్క నిబద్ధత ను చాటి చెప్పేది గా ఈ కేంద్రం ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు. ఇది ‘మేక్ ఇన్ ఇండియా – మేక్ ఫార్ ద వరల్డ్’ సంకల్పాన్ని బలపరుస్తుంది అని ఆయన అన్నారు. ‘‘భారతదేశం లో ప్రతిభావంతుల పట్ల ప్రపంచాని కి ఉన్న నమ్మకాన్ని ఈ కేంపస్ దృఢతరం చేస్తున్నది’’ అని ఆయన అన్నారు. రాబోయే కాలాని కి తగిన విమానాన్ని ఒకనాటి కి భారతదేశం ఈ కేంద్రం లో తీర్చిదిద్దగలదన్న నమ్మకాన్ని ఆయన వెలిబుచ్చారు.
ఆసియా లో కెల్లా అతి పెద్దదైనటువంటి హెలికాప్టర్ తయారీ కర్మాగారాన్ని కిందటి సంవత్సరం లో కర్నాటక లో ప్రారంభించుకొన్న సంగతి ని ప్రధాన మంత్రి గుర్తు కు తీసుకు వస్తూ, కర్నాటక ఒక క్రొత్త ఏవియేశన్ హబ్ గా ఉన్నతి ని సాధించింది అని బోయింగ్ యొక్క నవీన కేంద్రం స్పష్టం గా తెలియ జేస్తోందన్నారు. విమానయాన పరిశ్రమ లో క్రొత్త నైపుణ్యాల ను ఒడిసిపట్టడం కోసం భారతదేశ యువతీ యువకుల కు ప్రస్తుతం అనేక అవకాశాలు అందుబాటు లోకి వచ్చాయంటూ ఆయన ఈ విషయం లో తన అభినందనల ను తెలియ జేశారు.
ప్రతి ఒక్క రంగం లో మహిళల ప్రాతినిధ్యాన్ని అధికం చేయడం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. అంతేకాకుండా, జి-20 కి భారతదేశం అధ్యక్షత వహించిన కాలం లో మహిళ లు కేంద్ర స్థానం లో ఉండేటటువంటి అభివృద్ధి సాధన కై భారతదేశం నడుం కట్టింది అని కూడా పునరుద్ఘాటించారు. ఏరోస్పేస్ సెక్టర్ లో మహిళల కోసం క్రొత్త అవకాశాల ను కల్పించడానికి ప్రభుత్వం కంకణం కట్టుకొంది అని ఆయన అన్నారు. ‘‘ఫైటర్ పైలట్ లు కావచ్చు, లేదా పౌరవిమానయానం కావచ్చు.. మహిళా పైలట్ ల సంఖ్య లో భారతదేశం ప్రపంచం లో నాయకత్వ స్థానం లో నిలుస్తోంది’’ అని ప్రధాన మంత్రి సగర్వం గా తెలియ జేశారు. భారతదేశం లో విమానాల ను నడుపుతున్న వారి లో 15 శాతం మంది మహిళలే ఉంటున్నారు, ఇది ప్రపంచ సగటు కంటే 3 రెట్లు ఎక్కువ గా ఉంది అని ప్రధాన మంత్రి సగర్వం గా చెప్పారు. బోయింగ్ సుకన్య కార్యక్రమాన్ని గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఈ కార్యక్రమం మారుమూల ప్రాంతాల పేద కుటుంబాల వారి కి పైలట్ కావాలన్న వారి యొక్క కలల ను నెరవేర్చుకోవడం లో సహాయకారి గా ఉంటూనే విమానయాన రంగం లో మహిళల ప్రాతినిధ్యాని కి ఊతాన్ని ఇస్తుంది అన్నారు. ఈ కార్యక్రమం లో భాగం గా పైలట్ గా వృత్తి జీవనాన్ని కొనసాగించడాని కి గాను ప్రభుత్వ పాఠశాలలలో కెరియర్ కోచింగ్ మరియు ఇతర వికాస కార్యక్రమాల ను అమలుపరచడం జరుగుతుంది అని ప్రధాన మంత్రి తెలియ జేశారు.
చంద్రయాన్ యొక్క చరిత్రాత్మక సాఫల్యం భారతదేశం లో యువతీ యువకుల లో విజ్ఞాన శాస్త్రపరమైన మొగ్గు ను అంకురింప చేసింది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఎస్‌టిఇఎమ్ ఎడ్యుకేశన్ హబ్ భారతదేశాని కి ఉన్న స్థానాన్ని ప్రధాన మంత్రి స్పష్టం చేస్తూ, అమ్మాయిలు పెద్ద ఎత్తున ఎస్‌టిఇఎమ్ సబ్జెక్టుల ను ఎంచుకొంటున్నారన్నారు. ప్రపంచం లో మూడో అతి పెద్ద విమానయాన సంబంధి దేశీయ బజారు గా భారతదేశం మారిందన్నారు. పదేళ్ళ కాలం లో దేశీయ ప్రయాణికుల సంఖ్య రెట్టింపు అయిందని వివరించారు. ఉడాన్ వంటి పథకాలు ఈ పరిణామం లో ఒక పెద్ద పాత్ర ను పోషించాయి అని ఆయన అన్నారు. డిమాండు పెరుగుతున్న కొద్దీ ఈ సంఖ్య ఇంకా వృద్ధి చెందుతుందన్నారు. దీనితో భారతదేశం లో విమానయాన సంస్థ లు మరిన్ని విమానాల కోసం క్రొత్త గా ఆర్డర్ లు పెడుతున్నాయని, తత్ఫలితం గా ప్రపంచ విమానయాన రంగాని కి క్రొత్త ఊపిరి అందుతోందన్నారు. ‘‘భారతదేశం తన పౌరుల అవసరాల కు ఎక్కడలేని ప్రాధాన్యాన్ని ఇస్తున్నందువల్లనూ, వారి యొక్క ఆకాంక్షల ను దృష్టి లో పెట్టుకొంటున్నందువల్లనూ ఇది చోటు చేసుకొంది’’ అని ఆయన అన్నారు.
పనితీరులో భారతదేశ సామర్థ్యాన్ని నిరోధించే పేలవమైన కనెక్టివిటీ మునుపటి వైకల్యాన్ని అధిగమించడానికి కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెట్టుబడిపై ప్రభుత్వం దృష్టి పెట్టడం గురించి ప్రధానమంత్రి మోడీ మాట్లాడారు. భారతదేశం అత్యంత బాగా కనెక్ట్ అయిన మార్కెట్లలో ఒకటిగా మారుతోందని ఆయన అన్నారు. 2014లో దాదాపు 70 ఎయిర్‌పోర్టులు ఉండగా, ఈరోజు భారత్‌లో దాదాపు 150 ఆపరేషనల్ ఎయిర్‌పోర్టులు ఉన్నాయని చెప్పారు. విమానాశ్రయాల సామర్థ్యాన్ని గణనీయంగా పెంచామన్నారు. ఆర్థిక వ్యవస్థ మొత్తం వృద్ధికి, ఉపాధి కల్పనకు దారితీసే, పెరిగిన ఎయిర్ కార్గో సామర్థ్యాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.
భారతదేశం పెరిగిన విమానాశ్రయ సామర్థ్యం కారణంగా ఎయిర్ కార్గో రంగం వేగవంతమైన వృద్ధిని ప్రధాన మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. భారతదేశంలోని మారుమూల ప్రాంతాల నుంచి అంతర్జాతీయ మార్కెట్లకు ఉత్పత్తుల రవాణాను సులభతరం చేసిందని ఆయన అన్నారు. “వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన రంగం భారతదేశం మొత్తం వృద్ధికి, ఉపాధి కల్పనకు కూడా ప్రోత్సాహాన్ని ఇస్తోంది” అని శ్రీ మోదీ తెలిపారు.
ప్రభుత్వం విమానయాన రంగం వృద్ధిని కొనసాగించడానికి, వేగవంతం చేయడానికి పాలసీ స్థాయిలో నిరంతరం చర్యలు తీసుకుంటోందని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు. విమాన ఇంధనానికి సంబంధించిన పన్నులను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ప్రోత్సహిస్తోందని, ఎయిర్‌క్రాఫ్ట్ లీజింగ్‌ను సులభతరం చేసేందుకు కృషి చేస్తుందన్నారు. విమానాల లీజింగ్, ఫైనాన్సింగ్‌పై భారతదేశం ఆఫ్‌షోర్ పై ఆధారపడటాన్ని తగ్గించడానికి గిఫ్ట్ సిటీలో స్థాపించిన ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. మొత్తం దేశంలోని విమానయాన రంగం కూడా దీని వల్ల ప్రయోజనం పొందుతుందని ఆయన అన్నారు.
ఎర్రకోట నుండి ‘యాహీ సమయ్ హై, సహి సమయ్ హై’ అని తాను చేసిన ప్రకటనను గుర్తుచేసుకున్న ప్రధాని… బోయింగ్, ఇతర అంతర్జాతీయ కంపెనీలు తమ వృద్ధిని భారతదేశం వేగవంతమైన పెరుగుదలతో అనుసంధానించడానికి కూడా ఇదే సరైన సమయం అని అన్నారు. రాబోయే 25 ఏళ్లలో అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడం ఇప్పుడు 140 కోట్ల మంది భారతీయుల సంకల్పంగా మారిందని ఆయన ఉద్ఘాటించారు. గత 9 సంవత్సరాలలో, మేము సుమారు 25 కోట్ల మంది భారతీయులను పేదరికం నుండి బయటికి తీసుకొచ్చామని, ఈ కోట్లాది మంది భారతీయులు ఇప్పుడు నయా మధ్యతరగతిని సృష్టిస్తున్నారని ప్రధాన మంత్రి తెలియజేశారు. భారతదేశంలోని ప్రతి ఆదాయ సమూహంలో పైకి మొబిలిటీ ఒక ట్రెండ్‌గా చూడబడుతుందని ఆయన పేర్కొన్నారు. భారతదేశ పర్యాటక రంగం విస్తరణ గురించి ప్రస్తావిస్తూ, సృష్టించబడుతున్న అన్ని కొత్త అవకాశాలను గరిష్టంగా ఉపయోగించుకోవాలని ప్రధాన మంత్రి వాటాదారులను కోరారు.
భారతదేశం యొక్క బలమైన ఎంఎస్ఎంఈల నెట్వర్క్, భారీ టాలెంట్ పూల్, భారతదేశంలో స్థిరమైన ప్రభుత్వ సామర్థ్యాన్ని హైలైట్ చేస్తూ, భారతదేశంలో విమానాల తయారీ పర్యావరణ వ్యవస్థను నిర్మించాల్సిన అవసరాన్ని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. “మేక్ ఇన్ ఇండియా” ను ప్రోత్సహించే భారతదేశ విధి విధానం ప్రతి పెట్టుబడిదారుని విన్-విన్ సిట్యుయేషన్ అని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశంలో బోయింగ్ మొట్టమొదటి పూర్తి రూపకల్పన, తయారు చేసే విమానం కోసం భారతదేశం ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన అవసరం లేదని శ్రీ మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. “భారతదేశం ఆకాంక్షలు, బోయింగ్ విస్తరణ బలమైన భాగస్వామ్యంగా ఉద్భవించగలదని నేను విశ్వసిస్తున్నాను” అని ప్రధాని మోదీ ముగించారు. కర్ణాటక గవర్నర్ శ్రీ థావర్ చంద్ గెహ్లాట్, కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ సిద్ధరామయ్య, బోయింగ్ కంపెనీ సిఓఓ శ్రీమతి స్టెఫానీ పోప్, బోయింగ్ ఇండియా, దక్షిణాసియా అధ్యక్షుడు సలీల్ గుప్తే తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నేపథ్యం
బెంగుళూరులో కొత్త అత్యాధునిక బోయింగ్ ఇండియా ఇంజినీరింగ్ & టెక్నాలజీ సెంటర్ (బిఐఈటిసి) క్యాంపస్‌ను ప్రధాని ప్రారంభించారు. కోటి పెట్టుబడితో నిర్మించారు. రూ.1,600 కోట్లు, 43 ఎకరాల క్యాంపస్ USAఅమెరికా వెలుపల బోయింగ్ అతిపెద్ద పెట్టుబడి. భారతదేశంలో బోయింగ్ కొత్త క్యాంపస్ భారతదేశంలోని శక్తివంతమైన స్టార్టప్, ప్రైవేట్, ప్రభుత్వ పర్యావరణ వ్యవస్థతో భాగస్వామ్యానికి మూలస్తంభంగా మారుతుంది. ప్రపంచ ఏరోస్పేస్, రక్షణ పరిశ్రమ కోసం తదుపరి తరం ఉత్పత్తులు, సేవలను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది.
దేశంలో అభివృద్ధి చెందుతున్న విమానయాన రంగంలోకి భారతదేశం అంతటా ఎక్కువ మంది ఆడపిల్లల ప్రవేశానికి తోడ్పడే లక్ష్యంతో బోయింగ్ సుకన్య కార్యక్రమాన్ని కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమం భారతదేశం అంతటా ఉన్న బాలికలు, మహిళలకు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ (స్టెమ్) రంగాలలో క్లిష్టమైన నైపుణ్యాలను నేర్చుకోవడానికి, విమానయాన రంగంలో ఉద్యోగాల కోసం శిక్షణ పొందేందుకు అవకాశాలను అందిస్తుంది. యువతుల కోసం, ప్రోగ్రామ్ స్టెమ్ కెరీర్లపై ఆసక్తిని పెంచడంలో సహాయపడటానికి 150 ప్రణాళికాబద్ధమైన ప్రదేశాలలో స్టెమ్ ల్యాబ్‌లను సృష్టిస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా పైలట్లుగా శిక్షణ పొందుతున్న మహిళలకు స్కాలర్షిప్లను కూడా అందించనున్నారు.
Delighted to inaugurate @Boeing_In‘s Engineering & Technology Center in Bengaluru. This facility will serve as a hub for innovation and drive advancements in aviation. https://t.co/jqgAT78gwd
— Narendra Modi (@narendramodi) January 19, 2024
बेंगलुरू, भारत के Tech Potential को Global Demand से जोड़ता है।@Boeing_In का ये नया ग्लोबल टेक्नॉलॉजी कैंपस भी बेंगलुरु की इसी पहचान को सशक्त करने वाला है। pic.twitter.com/8b5eQ2lfQ6
— PMO India (@PMOIndia) January 19, 2024
‘Make In India, Make For The World’ pic.twitter.com/WE2D4RAhEx
— PMO India (@PMOIndia) January 19, 2024
Aviation और Aerospace Sector में हम महिलाओं के लिए नए अवसर बनाने में जुटे हैं। pic.twitter.com/YN5LcL2RTI
— PMO India (@PMOIndia) January 19, 2024
पिछले एक दशक में भारत का aviation market पूरी तरह से transform हो गया है। pic.twitter.com/F8mWkmLaZH
— PMO India (@PMOIndia) January 19, 2024
Boeing और दूसरी International कंपनियों के लिए भी ये सही समय है।
ये उनके लिए भारत की तेज़ growth के साथ अपनी growth को जोड़ने का समय है। pic.twitter.com/7AiYGAstFK
— PMO India (@PMOIndia) January 19, 2024
*****
DS/TS
Delighted to inaugurate @Boeing_In's Engineering & Technology Center in Bengaluru. This facility will serve as a hub for innovation and drive advancements in aviation. https://t.co/jqgAT78gwd
— Narendra Modi (@narendramodi) January 19, 2024
बेंगलुरू, भारत के Tech Potential को Global Demand से जोड़ता है।@Boeing_In का ये नया ग्लोबल टेक्नॉलॉजी कैंपस भी बेंगलुरु की इसी पहचान को सशक्त करने वाला है। pic.twitter.com/8b5eQ2lfQ6
— PMO India (@PMOIndia) January 19, 2024
'Make In India, Make For The World' pic.twitter.com/WE2D4RAhEx
— PMO India (@PMOIndia) January 19, 2024
Aviation और Aerospace Sector में हम महिलाओं के लिए नए अवसर बनाने में जुटे हैं। pic.twitter.com/YN5LcL2RTI
— PMO India (@PMOIndia) January 19, 2024
पिछले एक दशक में भारत का aviation market पूरी तरह से transform हो गया है। pic.twitter.com/F8mWkmLaZH
— PMO India (@PMOIndia) January 19, 2024
Boeing और दूसरी International कंपनियों के लिए भी ये सही समय है।
— PMO India (@PMOIndia) January 19, 2024
ये उनके लिए भारत की तेज़ growth के साथ अपनी growth को जोड़ने का समय है। pic.twitter.com/7AiYGAstFK