Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వడోదరలోని హర్ని సరస్సు వద్ద పడవ బోల్తా పడి మరణించిన వారికి సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి ఎక్స్ గ్రేషియా ప్రకటన


వడోదరలోని హర్ని సరస్సు వద్ద పడవ బోల్తా పడిన కారణంగా జరిగిన ప్రాణనష్టంపై ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. లక్ష రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. పిఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుండి 2 లక్షలు మరణించిన ప్రతి కుటుంబానికి అందజేయడం జరుగుతుంది. గాయపడిన వారికి రూ. 50,000 అందజేస్తారు.

ఎక్స్ మాధ్యమంలో ప్రధాని ప్రకటన చేస్తూ… 

“వడోదరలోని హర్ని సరస్సు వద్ద పడవ బోల్తా పడటం వల్ల ప్రాణాలు కోల్పోయిన ఘటన బాధ కలిగించింది. ఈ దుఃఖ సమయంలో నా ఆలోచనలు మృతుల కుటుంబాలతో ఉన్నాయి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. స్థానిక యంత్రాంగం బాధిత వారికి అన్ని విధాలా సహాయాన్ని అందిస్తోంది.  పిఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుండి 2 లక్షలు ఎక్స్ గ్రేషియా మరణించిన ప్రతి కుటుంబానికి అందజేయబడుతుంది. గాయపడిన వారికి రూ. 50,000 అందిస్తాము” అని ప్రధాని తెలిపారు.