Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వైబ్రాన్ట్ గుజరాత్ గ్లోబల్ సమిట్ యొక్క పదో సంచిక ను ప్రారంభించినప్రధాన మంత్రి

వైబ్రాన్ట్ గుజరాత్ గ్లోబల్ సమిట్ యొక్క పదో సంచిక ను ప్రారంభించినప్రధాన మంత్రి


వైబ్రాన్ట్ గుజరాత్ గ్లోబల్ సమిట్ 2024 యొక్క పదో సంచిక ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న గాంధీనగర్ లోని మాహత్మ మందిర్ లో ప్రారంభించారు. భవిష్యత్తు కు ప్రవేశ ద్వారంఅనేది ఈ సంవత్సరం లో శిఖర సమ్మేళనం తాలూకు ఇతివృత్తం గా ఉంది. మరి, ఈ కార్యక్రమం లో 34 భాగస్వామ్య దేశాలు, ఇంకా 16 భాగస్వామ్య సంస్థలు పాలుపంచుకొంటున్నాయి. దేశం లోని ఈశాన్య ప్రాంతాల లో పెట్టుబడి పెట్టడానికి ఉన్న అవకాశాల ను వివరించడానికి ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ శిఖర సమ్మేళనాన్ని ఒక వేదిక గా కూడా ఉపయోగించుకొంటోంది.

 

పరిశ్రమ రంగ సారథులు అనేక మంది ఈ కార్యక్రమం లో ప్రసంగించారు. సభికుల ను ఉద్దేశించి ఆర్సెలర్ మిత్తల్ యొక్క చైర్ మన్ శ్రీ లక్ష్మీ మిత్తల్, జపాన్ లో గల సుజుకి మోటర్ కార్పొరేశన్ యొక్క అధ్యక్షుడు శ్రీ తోశిహిరో సుజుకీ, రిలయన్స్ గ్రూపు నకు చెందిన శ్రీ ముఖేశ్ అంబాని, యుఎస్ఎ లోని మైక్రోన్ టెక్నాలజీస్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి శ్రీ సంజయ్ మెహ్‌రోత్ర, అడాణి గ్రూప్ చైర్ మన్ శ్రీ గౌతమ్ అడాణి, దక్షిణ కొరియా లో సిమ్ టెక్ సంస్థ సిఇఒ శ్రీ జెఫ్‌రీ చూన్, టాటా సన్స్ లిమిటెడ్ చైర్ మన్ శ్రీ ఎన్. చంద్రశేఖరన్, డిపి వరల్డ్ యొక్క చైర్ మన్ శ్రీ సుల్తాన్ అహమద్ బిన్ సులేయమ్, ఎన్‌వీడియా యొక్క సీనియర్ వైస్ ప్రెసిడెంటు శ్రీ శంకర్ త్రివేది లతో పాటు జెరోధా యొక్క వ్యవస్థాపకుడు మరియు సిఇఒ శ్రీ నిఖిల్ కామత్ కూడా ప్రసంగించడం తో పాటుగా వారి యొక్క వ్యాపార ప్రణాళికల ను తెలియ జేశారు. ఈ వ్యాపార రంగ ప్రముఖులు ప్రధాన మంత్రి యొక్క దృష్టికోణాన్ని ప్రశంసించారు.

 

 

వైబ్రాన్ట్ గుజరాత్ గ్లోబల్ సమిట్ లో ప్రసంగించిన వారి లో జపాన్ కు చెందిన అంతర్జాతీయ వ్యవహారాల ఉప మంత్రి శ్రీ శిన్ హోసాకా, సౌదీ అరేబియా కు చెందిన పెట్టుబడి శాఖ సహాయ మంత్రి శ్రీ ఇబ్రాహిమ్ యూసఫ్ అలీ ముబారక్, మధ్య ప్రాచ్యానికి చెందిన సహాయ మంత్రి శ్రీ తారీక్ అహమద్, ఉత్తర ఆఫ్రికా, దక్షిణ ఆసియా, కామన్ వెల్థ్ మరియు ఐక్య రాజ్య సమితి, యుకె ల ప్రతినిధి శ్రీ వహన్ కెరోబియాన్, అర్మేనియా ఆర్థిక వ్యవహారాలు, సమాచార సాంకేతిక విజ్ఞానం శాఖ మంత్రి శ్రీ టీత్ రీసాలో, మొరాకో కు చెందిన పరిశ్రమ మరియు వాణిజ్య శాఖ మంత్రి శ్రీ రయద్ మిజూర్, నేపాల్ యొక్క ఆర్థిక మంత్రి శ్రీ ప్రకాశ్ శరణ్ మహత్, వియత్‌నామ్ ఉప ప్రధాని శ్రీ ట్రాన్ లూ కువాంగ్, చెక్ గణతంత్రం యొక్క ప్రధాని శ్రీ పీటర్ ఫియాల, మొజాంబిక్ యొక్క అధ్యక్షుడు శ్రీ ఫిలిప్ న్యూసీ లతో పాటు తిమోర్-లెస్తె యొక్క అధ్యక్షుడు శ్రీ జోస్ రామోస్-హోర్టా లు ఉన్నారు. శిఖర సమ్మేళనం యొక్క ఆరంభం లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క అధ్యక్షుడు మరియు అబూ ధాబీ యొక్క పాలకుడు శ్రీ శేఖ్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నాహ్ యాన్ కూడా ప్రసంగించారు.

 

 

సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ముందు గా 2024వ సంవత్సరాని కి గాను శుభాకాంక్షల ను తెలియ జేశారు. రాబోయే ఇరవై అయిదు సంవత్సరాల లో 2047 కల్లా భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశం గా తీర్చిదిద్దే ప్రతిజ్ఞ ను ఆయన పునరుద్ఘాటించారు. ‘‘క్రొత్త కలల ను కనడానికి, క్రొత్త సంకల్పాల ను తీసుకోవడాని కి మరియు నిరంతర కార్యసాధనల కు సంబంధించిన కాలం ఇది’’ అని ఆయన అన్నారు. అమృత కాలంలో ఒకటో వైబ్రాన్ట్ గుజరాత్ సమిట్ కు ఉన్న ప్రాధాన్యాన్ని ఆయన వివరించారు.

 

 

వైబ్రాన్ట్ గుజరాత్ గ్లోబల్ సమిట్ ముఖ్య అతిథి గా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) యొక్క అధ్యక్షుడు మరియు అబూ ధాబీ యొక్క పాలకుడు అయినటువంటి శ్రీ శేఖ్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నాహ్ యాన్ పాలుపంచుకోవడం ఎంతో ప్రత్యేకమైంది అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. ఈ పరిణామం భారతదేశాని కి మరియు యుఎఇ కి మధ్య గాఢతరం గా మారుతున్నటువంటి సంబంధాల ను తెలుపుతోందని ఆయన అన్నారు. భారతదేశాన్ని గురించిన తన ఆలోచన లు మరియు మద్దతు స్నేహశీలత్వం తోను, సౌహార్దం తోను నిండి ఉన్నాయి అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఆర్థిక అభివృద్ధి మరియు పెట్టుబడి కి సంబంధించిన చర్చల తాలూకు ఒక ప్రపంచ వేదిక గా వైబ్రాన్ట్ గుజరాత్ గ్లోబల్ సమిట్ మారుతోందని ఆయన అన్నారు. నవీకరణ యోగ్య శక్తి రంగం , నూతన ఆవిష్కరణల తో కూడిన ఆరోగ్య సంరక్షణ రంగాల కు తోడు భారతదేశం లో నౌకాశ్రయాలకు సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పన లో కోటానుకోట్ల డాలర్ విలువైన పెట్టుబడులు వంటి అంశాల లో హెచ్చుతున్న సమర్ధన లో భారతదేశం-యుఎఇ భాగస్వామ్యాని ది కీలక పాత్ర అని ఆయన ప్రముఖం గా ప్రకటించారు. యుఎఇ కి చెందిన సావరిన్ వెల్థ్ ఫండ్ తన కార్యకలాపాల ను జిఐఎఫ్‌టి సిటీ లో మొదలు పెట్టిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అంతేకాకుండా విమానాల ను మరియు నౌకల ను లీజు కు ఇచ్చే కార్యకలాపాల లో ట్రాన్స్ వరల్డ్ కంపెనీ లు ముందుకు రావడాన్ని గురించి కూడా ఆయన వెల్లడించారు. భారతదేశాని కి మరియు యుఎఇ కి మధ్య సంబంధాలు అంతకంతకు వృద్ధి చెందుతున్నాయంటే ఆ ఖ్యాతి శ్రీ శేఖ్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నాహ్ యాన్ కే చెందుతుంది అని ప్రధాన మంత్రి అన్నారు.

 

 

ఐఐఎమ్ అహమదాబాద్ లో పూర్వ విద్యార్థి మరియు మొజాంబిక్ అధ్యక్షుడైన శ్రీ ఫిలిప్ న్యూసీ ఈ కార్యక్రమం లో పాల్గొంటున్న విషయాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించారు. జి-20 కి భారతదేశం అధ్యక్షత వహించిన కాలం లోనే ఆఫ్రికన్ యూనియన్ జి-20 లో శాశ్వత సభ్యత్వ దేశం గా చేరడం గర్వకారణం అని ప్రధాన మంత్రి అన్నారు. అధ్యక్షుడు శ్రీ న్యూసీ ఈ కార్యక్రమాని కి తరలి రావడం భారతదేశం-మొజాంబిక్ సంబంధాల తో పాటు, భారతదేశం-ఆఫ్రికా సంబంధాల ను కూడా గాఢతరం గా మార్చివేసింది అని ప్రధాన మంత్రి అన్నారు.

 

 

చెక్ రిపబ్లిక్ యొక్క ప్రధాని శ్రీ పీటర్ ఫియాల మొట్టమొదటిసారి గా తమ దేశాని కి ప్రధాని హోదా లో భారతదేశాన్ని సందర్శిస్తుండడాన్ని గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఇది ఒక్క భారతదేశం తోనే కాకుండా వైబ్రాన్ట్ గుజరాత్ తో కూడా చెక్ గణతంత్రాని కి ఉన్నటువంటి పురాతన సంబంధాల ను సూచిస్తోందన్నారు. ఆటో మొబైల్ రంగం, సాంకేతిక విజ్ఞాన రంగం మరియు తయారీ రంగాల లో సహకారాన్ని గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావించారు.

 

నోబెల్ బహుమతి గ్రహీత మరియు తిమోర్-లెస్తె యొక్క అధ్యక్షుడైన శ్రీ జోస్ రామోస్-హోర్టా కు ప్రధాన మంత్రి స్వాగతం పలుకుతూ, వారి దేశం లో స్వాతంత్య్ర సమరం వేళ గాంధీ మహాత్ముని అహింస సిద్ధాంతాన్ని ఆచరణ లో పెట్టిన సంగతి ని ప్రముఖం గా ప్రకటించారు.

 

వైబ్రాన్ట్ గుజరాత్ సమిట్ యొక్క 20 వ వార్షిక కార్యక్రమాన్ని గురించి ప్రధాన మంత్రి చెప్తూ, ఈ శిఖర సమ్మేళనం క్రొత్త క్రొత్త ఆలోచనల ను ప్రతిబింబించింది. పెట్టుబడుల కు మరియు ప్రతిఫలాల కు సరిక్రొత్త ప్రవేశ ద్వారాల ను తెరచింది అన్నారు. ఈ సంవత్సరం లో భవిష్యత్తు కు ప్రవేశ ద్వారంఅనేది ఇతివృత్తం గా ఉన్న సంగతి ని ప్రధాన మంత్రి వివరిస్తూ, 21 వ శతాబ్దం యొక్క భవితవ్యం ఉమ్మడి ప్రయాస ల వల్ల ప్రకాశవంతం అవుతుంది అన్నారు. భారతదేశం జి-20 కి అధ్యక్షత వహించిన కాలం లో భవిష్యత్తు కు సంబంధించిన ఒక మార్గసూచీ ని సమర్పించడమైంది. మరి, దీనిని వైబ్రాన్ట్ గుజరాత్ గ్లోబల్ సమిట్ యొక్క దార్శనికత మరింత ముందుకు తీసుకుపోతున్నది అన్నారు. ఐ2యు2 తో మరియు ఇతర బహుపక్షీయ సంస్థల తో భాగస్వామ్యాన్ని బలపరచుకోవడం జరుగుతోందని , అదే కాలం లో ఒక ప్రపంచం, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తుతాలూకు సూత్రాలు ప్రస్తుతం ప్రపంచ సంక్షేమాని కి ఒక ముందస్తు అవసరం గా మారిపోయాయన్న సంగతి ని కూడా ను ఆయన ప్రస్తావించారు.

 

 

‘‘శర వేగం గా మార్పుల కు లోనవుతున్న ప్రపంచం లో ఒక విశ్వ మిత్రవంటి పాత్ర ను భారతదేశం పోషిస్తూ మునుముందుకు కదులుతోంది. ఉమ్మడి సామూహిక లక్ష్యాల ను సాధించడం లో ప్రపంచాని కి ప్రస్తుతం భారతదేశం విశ్వాసాన్ని కలిగించింది. ప్రపంచ సంక్షేమానికై భారతదేశం యొక్క వచనబద్ధత, భారతదేశం నడుం కట్టినటువంటి ప్రయాస లు మరియు భారతదేశం చేస్తున్నటువంటి కఠోర శ్రమ ప్రపంచాన్ని సురక్షితం గా, సమృద్ధం గా మార్చుతున్నాయి. స్థిరత్వ స్థాపన లో ఒక ముఖ్యమైన స్తంభం గాను, నమ్మగలిగిన ఒక మిత్ర దేశం గాను, ప్రజలే కేంద్ర స్థానం లో నిలబడి ఉండే అభివృద్ధి సాధన పట్ల నమ్మకం కలిగిన ఒక భాగస్వామ్య దేశం గాను, ప్రపంచ హితం పట్ల విశ్వాసం ఉంచిన ఒక స్వరం గాను, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లో ఒక వృద్ధి చోదక శక్తి గాను, పరిష్కారాల ను కనుగొనడం లో సాంకేతిక విజ్ఞానం ప్రధానమైన దేశం గాను, ప్రతిభావంతులైన యువ శక్తి ని కలిగివున్న ఒక పవర్ హౌస్ గాను మరియు ఫలితాల ను అందించేటటువంటి ఒక ప్రజాస్వామ్య దేశం గాను భారతదేశం కేసి ప్రపంచం తన దృష్టి ని సారిస్తున్నది’’ అని ప్రధాన మంత్రి వివరించారు.