Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

యుఎల్ఎఫ్ఎ తో శాంతి ఒప్పందం పై సంతకాలు జరగడాన్నిప్రశంసించిన ప్రధాన మంత్రి


యుఎల్ఎఫ్ఎ (‘ఉల్ఫా’) తో శాంతి ఒప్పందం కుదరడం తో అసమ్ లో చిరకాల ప్రగతి సాధన కై బాట ను పరచడానికి వీలు ఏర్పడుతుందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న పేర్కొన్నారు.

అసమ్ రాష్ట్రం లో చాలా కాలం గా పనిచేస్తున్న విద్రోహుల సమూహం అయిన యుఎల్ఎఫ్ఎ (‘ఉల్ఫా’) తో శాంతి ఒప్పందం పైన అసమ్ ప్రభుత్వం మరియు భారతదేశ ప్రభుత్వం సంతకాలు చేశాయన్న సంగతి ని హోం మంత్రి శ్రీ అమిత్ శాహ్ ఒక సందేశం లో తెలియ జేశారు. హింస మార్గాన్ని విడచిపెట్టి, అన్ని ఆయుధాల ను మరియు మందుగుండు ను స్వాధీన పరచడాని కి, చట్టం ద్వారా ఏర్పాటైన ప్రజాస్వామిక ప్రక్రియ లో భాగం పంచుకోవడానికి మరియు దేశ సమగ్రత పరిరక్షణకు తోడ్పడడానికి విద్రోహుల సమూహం అంగీకారం తెలిపింది.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో పొందుపరచిన ఒక సమాధానం లో –

ఈ రోజు న శాంతి మరియు అభివృద్ధి ల దిశ లో అసమ్ చేస్తున్న యాత్ర లో ఒక ముఖ్యమైనటువంటి మైలురాయి పడింది అని చెప్పాలి. ఈ ఒప్పందం, అసమ్ లో చిరకాలిక ప్రగతి కి బాట ను పరుస్తుంది. ఈ చరిత్రాత్మకమైనటువంటి కార్యసాధన లో భాగం పంచుకొన్న అందరి ప్రయాసల ను నేను ప్రశంసిస్తున్నాను. మనం అందరం కలసికట్టుగా ఏకత్వం, వృద్ధి, ఇంకా అందరి కి సమృద్ధి సాధన లే లక్ష్యం గా ఉండేటటువంటి ఒక భవిష్యత్తు పథం లో ముందుకు సాగి పోతున్నాం.’’ అని పేర్కొన్నారు.