Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఎక్స్‌ పోశాట్ శాటిలైట్ ప్రయోగం సఫలం కావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి


ఎక్స్ పోశాట్ శాటిలైట్ (XPoSat satellite) ను భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్ రో) ద్వారా విజయవంతం గా ప్రయోగించడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న సంతోషాన్ని వెలిబుచ్చారు.

భారతదేశాన్ని ఉన్నత స్థాయిల కు తీసుకొని వెళ్ళినందుకు గాను అంతరిక్ష రంగం లో కృషి చేస్తున్నవారి తో పాటు గా ఇస్ రో శాస్త్రవేత్తల కు శుభాకాంక్షల ను ప్రధాన మంత్రి తెలియ జేశారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో –

‘‘మన శాస్త్రవేత్త ల కారణం గా 2024 వ సంవత్సరాని కి ఒక గొప్ప ఆరంభం లభించింది. ఈ ప్రయోగం అంతరిక్ష రంగాని కి ఒక అపురూపమైనటువంటి కబురు గా ఉంది. ఈ ప్రయోగం అంతరిక్ష రంగం లో భారతదేశం యొక్క సాహసాన్ని ఇనుమడింప చేసేదే అని చెప్పాలి. ఇస్ రో లోని మన శాస్త్రవేత్తల కు మరియు అంతరిక్ష రంగం లో పాటుపడుతున్న వారందరికీ భారతదేశాన్ని ఇది వరకు ఎరుగనటువంటి ఉన్నత స్థాయిల కు తీసుకొని పోయినందుకు ఇవే శుభాకాంక్ష లు.’’ అని పేర్కొన్నారు.

 

 

***

DS/RT