Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

డిఎమ్‌డికె వ్యవస్థాపకుడు శ్రీ విజయకాంత్ కన్నుమూత పట్ల సంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి


డిఎమ్‌డికె వ్యవస్థాపకుడు మరియు చిరకాల అనుభవం కలిగినటువంటి నటుడు శ్రీ విజయకాంత్ ఈ రోజు న మరణించడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

తమిళ నాడు యొక్క రాజకీయ ముఖచిత్రం మీద ఒక చెరిగిపోనటువంటి ముద్ర ను వేసినటువంటి శ్రీ విజయకాంత్ ను ఆయన చేసిన సార్వజనిక సేవ కు గాను ప్రధాన మంత్రి స్మరించుకొన్నారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఈ క్రింది విధం గా తన సందేశాన్ని వ్రాశారు :

‘‘తిరు విజయకాంత్ గారి కన్నుమూత వార్త తీవ్ర దుఃఖం కలిగించింది. తమిళ చలన చిత్ర జగతి లో ఆయన ఒక ప్రసిద్ధ వ్యక్తి. ఆయన యొక్క తేజోభరితం అయినటువంటి అభినయ పటిమ లక్షల కొద్దీ అభిమానుల హృదయాల ను ఆకట్టుకొన్నది. ఒక రాజకీయ నేత గా, ఆయన ప్రజాసేవ కు ప్రగాఢం గా నిబద్ధుడు అయ్యారు; తద్ద్వారా తమిళ నాడు యొక్క రాజకీయ ముఖచిత్రం పైన చాలా కాలం పాటు నిలచి ఉండేటటువంటి ప్రభావాన్ని ప్రసరింప చేశారు. ఆయన తెర మరుగు కావడం అనేది భర్తీ చేయడాని కి ఎంతో కష్టసాధ్యం అయినటువంటి శూన్యాన్ని మిగిల్చివేసింది. ఆయన నాకు ఒక సన్నిహిత మిత్రుడు; మరి గత కొన్ని సంవత్సరాల లో ఆయన తో నేను జరిపిన భేటీల ను నేను ఎంతో మక్కువ తో జ్ఞప్తి కి తెచ్చుకొంటున్నాను. ఈ విషాద ఘడియ లో, ఆయన కుటుంబ సభ్యుల కు, ఆయన అభిమానుల కు మరియు అసంఖ్యక అనుచరుల కు కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. ఓమ్ శాంతి.’’

*****

DS/RT