Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సౌదీ అరేబియా యువరాజు మరియు ప్రధాని తో టెలిఫోన్ ద్వారా సంభాషించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ


 

సౌదీ అరేబియా యువరాజు మరియు ప్రధాని ప్రిన్స్ శ్రీ మొహమ్మద్ బిన్ సల్‌మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ టెలిఫోన్ మాధ్యం ద్వారా మాట్లాడారు.

యువరాజు గారు 2023 సెప్టెంబరు లో ఆధికారిక పర్యటన నిమిత్తం భారతదేశాని కి విచ్చేసిన పిమ్మట యి గా ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యం లో పురోగతి ని నేతలు సమీక్షించారు. ద్వైపాక్షిక భాగస్వామ్యాని కి సంబంధించి రాబోయే కాలం లో చేపట్టదగ్గ కార్యక్రమాల ను గురించి కూడా వారు చర్చించారు.

పశ్చిమ ఆసియా లో వర్తమాన స్థితి ని గురించి నేత లు వారి అభిప్రాయాల ను ఒకరి కి మరొకరు వెల్లడించుకొన్నారు. ఉగ్రవాదం, హింస మరియు పౌరుల ప్రాణాల కు వాటిల్లుతున్న నష్టం విషయాల లో తీవ్ర ఆందోళన ను వారు వ్యక్తం చేశారు.

ఇజ్‌రాయిల్-పాలస్తీనా అంశం లో భారతదేశం దీర్ఘ కాలం గా అనుసరిస్తున్నటువంటి సూత్రబద్ధ వైఖరి ని గురించి ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు; ప్రభావిత జనాభా కు మానవతా పూర్వక సహాయాన్ని కొనసాగించాలి అంటూ ఆయన పిలుపు ను ఇచ్చారు. ఆ ప్రాంతం లో శాంతి కోసం, భద్రత కోసం మరియు స్థిరత్వం కోసం కలసి పాటుపడాలని నేత లు ఇద్దరు అంగీకరించారు. సముద్ర సంబంధి భద్రత ను మరియు సముద్రయాన నిర్వహణ లో స్వాతంత్య్రాన్ని పరిరక్షించవలసిన అవసరం ఎంతైనా ఉందని కూడా వారు స్పష్టం చేశారు.

ఎక్స్‌ పో 2030 కి మరియు ఫీఫా ఫుట్ బాల్ వరల్డ్ కప్ 2034 కు ఆతిథేయి గా సౌదీ అరేబియా ఎంపిక అయిన సందర్బం లో సౌదీ అరేబియా కు అభినందనల ను ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు.

ఒకరి తో మరొకరు తరచు గా సంప్రదింపుల ను జరుపుకొంటూ ఉండాలని ఇద్దరు నేత లు సమ్మతించారు.

 

***