‘వీర్ బాల్ దివస్’ సందర్భం లో 2023 డిసెంబరు 26 వ తేదీ నాడు ఉదయం 10:30 గంటల కు న్యూ ఢిల్లీ లోని భారత్ మండపం లో జరిగే ఒక కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకోనున్నారు. ఇదే సందర్భం లో ప్రధాన మంత్రి దిల్లీ లో యువత పాల్గొనే ఒక మార్చ్-పాస్ట్ కు కూడా ప్రారంభ సూచక జెండా ను చూపెడతారు.
ఈ దినాన్ని పాటించుకోవడం కోసం ప్రభుత్వం పౌరుల, ప్రత్యేకం గా చిన్న పిల్లల కు సాహిబ్ జాదా ల యొక్క మార్గదర్శక ప్రాయమైనటువంటి ధైర్య సాహసాల గాథ ను గురించి తెలియజేయడం తో పాటు, తత్సంబంధి చైతన్యాన్ని వారిలో పాదుగొల్పడం కోసం దేశ వ్యాప్తం గా అనేక ప్రాతినిధ్య పూర్వకమైనటువంటి కార్యక్రమాల ను ఏర్పాటు చేస్తున్నది. సాహిబ్ జాదా ల యొక్క జీవన గాథ ను గురించి మరియు సాహిబ్ జాదా ల ప్రాణసమర్పణాన్ని గురించి కళ్ళకు కట్టేటటువంటి ఒక డిజిటల్ ఎగ్జిబిశను ను దేశం అంతటా పాఠశాలల్లోను, బాలల సంరక్షణ సంస్థల లోను ప్రదర్శించడం జరుగుతుంది. ‘వీర్ బాల్ దివస్’ కు చెందిన ఒక చిత్రాన్ని కూడా దేశవ్యాప్తం గా ప్రదర్శించడం జరుగుతుంది. వీటి తో పాటు, ఇంటర్ ఏక్టివ్ క్విజ్ ల వంటి వివిధ ఆన్‌లైన్ పోటీల ను మైభారత్ (MYBharat) పోర్టల్ లో మరియు మైగవ్ (MyGov) పోర్టల్ లో నిర్వహించడం జరుగుతుంది.
శ్రీ గురు గోబింద్ సింహ్ జీ యొక్క ప్రకాశ్ పర్వ్ సందర్భం లో 2022 జనవరి 9 వ తేదీ న ప్రధాన మంత్రి ఒక ప్రకటన ను చేస్తూ ఆ ప్రకటన లో, శ్రీ గురు గోబింద్ సింహ్ యొక్క కుమారులైన సాహిబ్‌జాదా లు బాబా జోరావర్ సింహ్ జీ మరియు సాహిబ్‌జాదా బాబా ఫతేహ్ సింహ్ జీ ల ప్రాణ సమర్పణం ఘట్టాన్ని స్మరించుకొంటూ డిసెంబర్ 26 వ తేదీ ని ‘వీర్ బాల్ దివస్’ గా పాటించడం జరుగుతుంది అని తెలిపారు.
***