ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ విజయ దివస్ సందర్భంగా 1971నాటి యుద్ధంలో కర్తవ్యబద్ధులై దేశానికి సేవలందిస్తూ అమరులైన వీర సైనికులకు హృదయపూర్వక నివాళి అర్పించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ పోస్టు ద్వారా పంపిన సందేశంలో:
‘‘ఇవాళ విజయ్ దివస్ నేపథ్యంలో 1971నాటి యుద్ధంలో భారతదేశానికి నిర్ణయాత్మక విజయం అందించడం ద్వారా తమ కర్తవ్య నిబద్ధతను చాటుకున్న వీర సైనికులకు హృదయపూర్వక నివాళి అర్పిస్తున్నాను. వారి పరాక్రమం, అంకితభావం దేశానికి అపార గర్వకారణం. వారి త్యాగాలు, అకుంఠిత దీక్ష ప్రజల హృదయాల్లో, దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉంటుంది. ఆ వీరుల ధైర్యసాహసాలకు భారతదేశం శిరసాభివందనం చేస్తోంది. వారి అచంచల స్ఫూర్తిని సదా స్మరించుకుంటుంది.’’
Today, on Vijay Diwas, we pay heartfelt tributes to all the brave heroes who dutifully served India in 1971, ensuring a decisive victory. Their valour and dedication remain a source of immense pride for the nation. Their sacrifices and unwavering spirit will forever be etched in…
— Narendra Modi (@narendramodi) December 16, 2023