ఒకటో ఇండియన్ ఆర్ట్, ఆర్కిటెక్చర్ ఎండ్ డిజైన్ బియెన్నేల్ (ఐఎఎడిబి) 2023 ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 డిసెంబరు 8 వ తేదీ నాడు సాయంత్రం పూట సుమారు 4 గంటల వేళ కు ఎర్ర కోట లో ప్రారంభించనున్నారు. ఇదే కార్యక్రమం లో భాగం గా, ఎర్ర కోట లో ఆత్మనిర్భర్ భారత్ సెంటర్ ఫార్ డిజైన్ ను మరియు ‘సమున్నతి’ పేరు తో ప్రతి రెండు సంవత్సరాల కు ఒకసారి నిర్వహించేటటువంటి విద్యార్థి బియెన్నేల్ ను కూడా ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు.
వెనిస్, సావో పావులో, సింగపూర్, సిడ్‌నీ మరియు శార్ జాహ్ తదితర ప్రాంతాల లో ఒక అంతర్జాతీయ బియెన్నేల్ కోవ లో ఒక ప్రముఖ ప్రపంచ స్థాయి సాంస్కృతిక కార్యక్రమాన్ని దేశం లో కూడా అభివృద్ధి పరచడం తో పాటు సంస్థాగతం చేయాలి అనేది ప్రధాన మంత్రి యొక్క దృష్టి కోణం గా ఉంది. ఈ విజను కు అనుగుణం గా వస్తు ప్రదర్శనశాల లను రీఇన్వెంట్, రీబ్రాండ్, రెనవేట్ ఎండ్ రి-హౌస్ ప్రక్రియల కై ఒక దేశవ్యాప్త ప్రచార ఉద్యమాన్ని మొదలు పెట్టడం జరిగింది. దీనికి తోడు, భారతదేశం లో అయిదు నగరాలు కోల్ కాతా, దిల్లీ, ముంబయి, అహమదాబాద్ మరియు వారాణసీ లలో సాంస్కృతిక ప్రధానమైన నిలయాల ను అభివృద్ధి పరచే ప్రకటన ను కూడా వెలువరించడమైంది. ఇండియన్ ఆర్ట్, ఆర్కిటెక్చర్ ఎండ్ డిజైన్ బియెన్నేల్ (ఐఎఎడిబి) దిల్లీ లో సాంస్కృతిక ప్రధానమైన కార్యక్రమాల నిలయం గా రూపుదాల్చబోతోంది.
ఐఎఎడిబి ని 2023 డిసెంబరు 9 వ తేదీ మొదలుకొని డిసెంబరు 15 వ తేదీ వరకు న్యూ ఢిల్లీ లోని ఎర్ర కోట లో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇంతవరకు 2023 మే నెల లో జరిగిన ఇంటర్ నేశనల్ మ్యూజియమ్ ఎక్స్ పో మరియు 2023 ఆగస్టు నెల లో జరిగిన ఫెస్టివల్ ఆఫ్ లైబ్రరీజ్ లకు తరువాయి గా ఉంది. కళాకారులు, భవన శిల్పులు, డిజైనర్ లు, ఫోటోగ్రాఫర్ లు, వస్తుసేకరణదారు లు, కళారంగ నిపుణులు మరియు ప్రజల కు మధ్య ఒక సమగ్రమైనటువంటి సంభాషణ మాధ్యం గా ఐఎఎడిబి ని రూపొందించడమైంది. క్రొత్త గా ఉనికి లోకి వస్తున్న ఆర్థిక వ్యవస్థ లో ఒక భాగం వలె కళ ను, వాస్తుకళను మరియు డిజైన లను సృజించే వారి తో సమన్వయాన్ని నెలకొల్పుకొని విస్తరణ కు మార్గాల ను మరియు సహకారాన్ని అందించగల మార్గాల ను, ఇంకా అవకాశాల ను అందించనున్నది.
ఐఎఎడిబి కొనసాగే వారం రోజుల లో ప్రతి రోజూ వేరు వేరు ఇతివృత్తం ల ఆధారం గా ప్రదర్శన లు చోటు చేసుకోనున్నాయి :
ఐఎఎడిబి లో పైన పేర్కొన్నటువంటి ఇతివృత్తాల ఆధారం గా ఏర్పాటు చేసే మండపాలు ఉంటాయి; అంతేకాకుండా మండలి చర్చ లు, కళా కార్యశాల లు, ఆర్ట్ బజారు, హెరిటేజ్ వాక్ లు మరియు ఒక సమానాంతర విద్యార్థి బియెనేల్ భాగం గా ఉంటాయి. లలిత కళ ఎకైడమి లో విద్యార్థి బియెన్నేల్ (సమున్నతి) విద్యార్థుల కు వారి కార్యాల ను ప్రదర్శించేందుకు, సహచర విద్యార్థుల తోను, వృత్తి నిపుణులతోను మాటామంతీ జరపడానికి, అలాగే డిజైన్ కాంపిటీశన్, వారసత్వ ప్రదర్శన, ఇన్ స్టాలేశన్ డిజైన్, కార్యశాల ల వంటి మాధ్యాల ద్వారా వాస్తుకళ సముదాయం సంబంధి విలువైన అనుభవాలను ఆర్జించుకొనేందుకు అవకాశాన్ని ప్రసాదిస్తుంది. ఐఎఎడిబి 23 దేశం కోసం ఒక మహత్వపూర్ణం అయినటువంటి నిర్వహణ గా రుజువు కానున్నది; ఎలాగంటే ఇది బియెన్నేల్ లాండ్ స్కేప్ లోకి భారతదేశాన్ని అడుగిడేటట్లు చేసే ఒక నాంది ప్రస్తావన అన్నమాట.
‘వోకల్ ఫార్ లోకల్’ (స్థానిక ఉత్పాదనల కు ప్రాధాన్యాన్ని ఇవ్వడం) అనే ప్రధాన మంత్రి దృష్టికోణాని కి అనుగుణం గా ‘ఆత్మనిర్భర్ భారత్ సెంటర్ ఫార్ డిజైన్’ ను ఎర్రకోట లో ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఇది భారతదేశం లో అద్వితీయం అయినటువంటి మరియు స్వదేశీ హస్తకళ ల ప్రదర్శన వేదిక గా ఉండడం తో పాటుగా చేతివృత్తుల కళాకారుల కు మరియు డిజైనర్ లకు మధ్య ఒక సహకారపూర్వకంగా ఉండేటటువంటి ఒక కేంద్రాన్ని అందుబాటు లోకి తీసుకు రానుంది. స్వంత కాళ్ళ మీద నిలబడ గలిగేటటువంటి సాంస్కృతిక ప్రధానమైన ఆర్థిక వ్యవస్థ ఎదుగుదల కు బాట ను పరుస్తూ, ఈ కార్యక్రమం చేతివృత్తుల కళాకార సముదాయాల కు సరిక్రొత్త డిజైన్ లను మరియు నూతన ఆవిష్కరణల అండ తో సాధికారిత ను కల్పించగలదు.
**