ఉత్తర్ కాశీ సొరంగం ఘటన లో బాధితులు అయిన వారిని కాపాడేందుకు చేపట్టిన కార్యకలాపాల లో పాలుపంచుకొన్న వ్యక్తులందరు కనబరచిన ఉత్సాహాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నమస్కరించారు.
ఉత్తర్ కాశీ సొరంగ మార్గ సంబంధి రక్షణ కార్యకలాపాల యొక్క సాఫల్యం అందరికి ఒక భావోద్వేగ భరితం అయినటువంటి క్షణం గా ఉండింది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. సొరంగం లో చిక్కుకొన్న వ్యక్తుల ధైర్యాన్ని, సాహసాన్ని మరియు ఓరిమి ని ఆయన అంగీకరిస్తూ, వారి కి చక్కటి ఆరోగ్యం ప్రాప్తించాలి అని ఆకాంక్షించారు. ఈ సాహస కార్యం లో ప్రమేయం కలిగివున్న ప్రతి ఒక్కరు గొప్ప మానవత్వాన్ని మరియు టీంవర్కు ను కనబరచారు అని కూడా ప్రధాన మంత్రి అన్నారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో –
ఉత్తర్ కాశీ లో మన శ్రమిక సోదరుల ను కాపాడేందుకు చేపట్టిన కార్యకలాపాల సాఫల్యం ప్రతి ఒక్కరిని భావుకుల ను చేసివేసేది గా ఉంది.
సొరంగం లో చిక్కుకుపోయినటువంటి సహచరుల కు నేను చెప్పదలచింది ఏమిటి అంటే అది ‘మీ యొక్క ధైర్యం మరియు మీ యొక్క సాహసం ప్రతి ఒక్కరి కి ప్రేరణ ను ఇచ్చేవి గా ఉన్నాయి’ అనేదే. మీ అందరు కులాసా గా ఉండాలి, మరి మీ అందరు ఉత్తమమైన ఆరోగ్యం తో ఉండాలి అని నేను కోరుకొంటున్నాను.
దీర్ఘ కాలం పాటు ఎదురు చూపులు చూసిన తరువాత ఇక మన యొక్క ఈ సహచరులు వారి ప్రియజనుల ను కలుసుకోనుండడం అత్యంత సంతోషదాయకం అయినటువంటి విషయం. వీరి దగ్గరి సంబంధికులందరు కూడాను ఈ సవాలుభరిత కాలం లో ఏ విధం గా సంయమాన్ని మరియు సాహసాన్ని చాటారంటే వాటిని ఎంతగా ప్రశంసించినా అది తక్కువే అవుతుంది.
నేను ఈ రక్షణ కార్యకలాపాల తో జత పడిన వ్యక్తులు అందరి యొక్క ఉద్వేగాని కి నమస్కరిస్తున్నాను. వారి యొక్క వీరత్వం మరియు వారి యొక్క సంకల్ప శక్తి మన శ్రమిక సోదరుల కు ఒక క్రొత్త జీవనాన్ని ఇచ్చాయి. ఈ సాహస కార్యం లో చేయి చేయి కలిపినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి మానవత్వం మరియు టీమ్ వర్క్ ల తాలూకు అద్భుతమైన ఉదాహరణ ను మన ముందుంచారు.’’ అని పేర్కొన్నారు.
उत्तरकाशी में हमारे श्रमिक भाइयों के रेस्क्यू ऑपरेशन की सफलता हर किसी को भावुक कर देने वाली है।
टनल में जो साथी फंसे हुए थे, उनसे मैं कहना चाहता हूं कि आपका साहस और धैर्य हर किसी को प्रेरित कर रहा है। मैं आप सभी की कुशलता और उत्तम स्वास्थ्य की कामना करता हूं।
यह अत्यंत…
— Narendra Modi (@narendramodi) November 28, 2023
***
Dhiraj Singh / Siddhant Tiwari
उत्तरकाशी में हमारे श्रमिक भाइयों के रेस्क्यू ऑपरेशन की सफलता हर किसी को भावुक कर देने वाली है।
— Narendra Modi (@narendramodi) November 28, 2023
टनल में जो साथी फंसे हुए थे, उनसे मैं कहना चाहता हूं कि आपका साहस और धैर्य हर किसी को प्रेरित कर रहा है। मैं आप सभी की कुशलता और उत्तम स्वास्थ्य की कामना करता हूं।
यह अत्यंत…