ఉత్తర్ ప్రదేశ్ లోని మథుర లో గల శ్రీ కృష్ణ జన్మభూమి మందిరం లో ఈ రోజు న జరిగిన పూజ, ఇంకా దైవ దర్శనం కార్యక్రమాల లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో –
‘‘మథుర లో శ్రీ కృష్ణ జన్మభూమి మందిరం లో దివ్య పూజ కార్యక్రమం లో పాల్గొనే సౌభాగ్యం దక్కింది. బ్రజ్ యొక్క అణువణువు లో నిండి ఉన్నటువంటి గిరిధర్ గోపాల్ యొక్క మనోహరమైన దర్శనం నన్ను భావ వివశుడి నిగా చేసి వేసింది. దేశం అంతటా ఉన్నటువంటి నా యొక్క కుటుంబ సభ్యులు అందరికి సుఖాన్ని, సమృద్ధి ని మరియు శ్రేయాన్ని అనుగ్రహించవలసింది అంటూ ఆయన ను వేడుకొన్నాను.’’ అని తెలిపారు.
मथुरा में श्री कृष्ण जन्मभूमि मंदिर में दिव्य पूजन का सौभाग्य मिला। ब्रज के कण-कण में बसे गिरधर गोपाल के मनोहारी दर्शन ने भाव-विभोर कर दिया! मैंने उनसे देशभर के अपने सभी परिवारजनों के लिए सुख-समृद्धि और कल्याण की कामना की। pic.twitter.com/fJhr07oLOF
— Narendra Modi (@narendramodi) November 23, 2023