జన్ జాతీయ గౌరవ్ దివస్, 2023 సంబంధి వేడుకల కు గుర్తు గా ఝార్ ఖండ్ లోని ఖూంటీ లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొని జనసమూహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమం లో భాగం గా, ప్రధాన మంత్రి ‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’ తో పాటు ప్రధాన మంత్రి పర్టిక్యులర్ లీ వల్నరబల్ ట్రైబల్ గ్రూప్స్ డెవలప్ మెంట్ మిశన్ ’ ను కూడ ప్రారంభించారు. ఆయన పిఎమ్–కిసాన్ యొక్క 15వ కిస్తీ ని కూడ విడుదల చేశారు. రైలు, రోడ్డు, విద్య, బొగ్గు, పెట్రోలియమ్ మరియు సహజ వాయువు ల వంటి అనేక రంగాల లో 7,200 కోట్ల రూపాయల విలువ కలిగిన అనేక అభివృద్ధి ప్రాజెక్టుల కు ఝార్ ఖండ్ లో శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయడం తో పాటు ఆయా ప్రాజెక్టుల ను దేశ ప్రజల కు అంకితం చేశారు. ఈ సందర్భం లో ఏర్పాటైన ఒక ప్రదర్శన లో ఆయన కలియదిరిగారు కూడా.
భారతదేశం యొక్క రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము వద్ద నుండి ఒక వీడియో సందేశాన్ని ఈ కార్యక్రమం లో చూపించడం జరిగింది.
ఇదే కార్యక్రమం లో చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప్ ప్రతిజ్ఞ కు సైతం ప్రధాన మంత్రి నాయకత్వం వహించారు.
ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని మొదలుపెడుతూ ఈ రోజు న తాను భగ్ వాన్ బిర్ సా ముండా యొక్క జన్మస్థలం ఉలిహాతు గ్రామాని కి వెళ్లడం, అలాగే రాంచీ లో బిర్ సా ముండా మెమోరియల్ పార్క్ కమ్ ఫ్రీడమ్ ఫైటర్ మ్యూజియమ్ ను సందర్శించిన సంగతి ని గుర్తు కు తీసుకు వచ్చారు. రెండు సంవత్సరాల క్రితం ఇదే రోజు న ఫ్రీడమ్ ఫైటర్ మ్యూజియమ్ ను ప్రారంభించిన విషయాన్ని కూడా ను ఆయన ప్రస్తావించారు. జన్ జాతీయ గౌరవ్ దివస్ సందర్భం లో ప్రతి ఒక్క పౌరురాలు కు, ప్రతి ఒక్క పౌరుని కి శ్రీ నరేంద్ర మోదీ తన అభినందనల ను తెలియజేయడం ఒక్కటే కాకుండా శుభాకాంక్షల ను కూడా వ్యక్తం చేశారు. ఝార్ ఖండ్ స్థాపన దినం సందర్భం లో ఆయన తన శుభకామనల ను వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఝార్ ఖండ్ స్థాపన లో పూర్వ ప్రధాని శ్రీ అటల్ బిహారి వాజ్ పేయీ యొక్క తోడ్పాటు ను కూడా ఆయన ప్రముఖం గా ప్రస్తావించారు. ఈ రోజు న రైలు, రోడ్డు, విద్య, బొగ్గు, పెట్రోలియమ్ మరియు సహజ వాయువు వంటి వివిధ రంగాల లో చేపట్టుకొన్న అభివృద్ధి పథకాల కు గాను ఆయన ఝార్ ఖండ్ ప్రజల కు అభినందనల ను తెలియజేశారు. ఝార్ ఖండ్ ఇక 100 శాతం విద్యుదీకరణ పూర్తి అయినటువంటి రైలు మార్గాలు అందుబాటులోకి వచ్చాయి అంటూ ఆయన సంతోషాన్ని వెలిబుచ్చారు.
ఆదివాసీ స్వాభిమానం పరిరక్షణ కోసం భగ్ వాన్ బిర్ సా ముండా జరిపిన ప్రేరణదాయకం అయినటువంటి పోరాటాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, అనేక మంది ఆదివాసి వీరుల తో ఝార్ ఖండ్ గడ్డ కు గల అనుబంధాన్ని వివరించారు. తిల్ కా మాంఝి, సిద్ధు కాన్హు, చండ్ భైరవ్, ఫులో ఝానో, నీలాంబర్, పీతాంబర్, జట్ రా తానా భగత్ మరియు ఆల్బర్ట్ ఎక్కా గారు ల వంటి ఎంతో మంది వీరులు ఈ నేల గర్వపడేటట్టు చేశారు అని ఆయన అన్నారు. దేశం లో మూల మూల న జరిగిన స్వాతంత్ర్య సమరం లో ఆదివాసి యోధులు పాలుపంచుకొన్నారు అని ప్రధాన మంత్రి చెప్తూ, మాన్ గఢ్ ధామ్ కు చెందిన గోవింద్ గురు, మధ్య ప్రదేశ్ కు చెందిన తాంత్యా భీల్, ఛత్తీస్ గఢ్ కు చెందిన భీమా నాయక్, అమరుడు వీర్ నారాయణ్ సింహ్, వీర్ గుండాధుర్, మణిపుర్ కు చెందిన రాణి గైదిన్ లియు, తెలంగాణ కు చెందిన వీరుడు రాంజీ గోండ్, ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన అల్లూరి సీతారామ రాజు, గోండ్ ప్రదేశ్ కు చెందిన రాణి దుర్గావతి లను గురించి చెప్పారు. అటువంటి మహనీయుల పట్ల ఉపేక్ష విచారకరం అని ప్రధాన మంత్రి అంటూ, ఈ వీరుల ను అమృత్ మహోత్సవ సందర్బం లో స్మరించుకొంటున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఝార్ ఖండ్ తో వ్యక్తిగతం గా తనకు ఉన్న బంధాన్ని గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, ఆయుష్మాన్ యోజన ను ఝార్ ఖండ్ నుండే మొదలుపెట్టడం జరిగిందని గుర్తు కు తీసుకు వచ్చారు. ఝార్ ఖండ్ లో ఈ రోజు న రెండు చరిత్రాత్మకమైనటువంటి కార్యక్రమాల ను ప్రారంభించుకోవడం జరుగుతున్నదని ఆయన అన్నారు. వాటి లో ఒకటోది వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర అని అది ప్రభుత్వ లక్ష్యాల ను నెరవేర్చేటటువంటి ఒక సాధనం గా ఉండగలదన్నారు. రెండోది పిఎమ్ జన్ జాతి ఆదివాసి న్యాయ మహా అభియాన్ అని అది అంతరించిపోయే దశ లో ఉన్న తెగల ను కాపాడి వాటి ని పెంచి పోషిస్తుందని ఆయన చెప్పారు.
వికసిత్ భారత్ యొక్క ఈ యొక్క ‘అమృత స్తంభాలు నాలుగింటి’ పై దృష్టి ని కేంద్రీకరించవలసిన అవసరం ఉంది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఆ నాలుగు స్తంభాలు ఏవేవి అంటే అవి మహిళా శక్తి, భారతదేశం యొక్క ఆహార సృష్టికర్తలు, దేశం లోని యువత , ఇక చివరగా భారతదేశం లోని నవ మధ్య తరగతి మరియు పేద ప్రజానీకం అని వివరించారు. అభివృద్ధి కి ఆధారమైన స్తంభాల ను బలపరచడం కోసం మన లో ఉన్నటువంటి సామర్థ్యం మీద భారతదేశం లో అభివృద్ధి యొక్క స్థాయి ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. నాలుగు స్తంభాల ను బలపరచడం కోసం ప్రస్తుత ప్రభుత్వం గడచిన 9 సంవత్సరాల లో చేసిన ప్రయాస లు మరియు కార్యాల పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
On Janjatiya Gaurav Divas, let us remember Bhagwan Birsa Munda and redouble our efforts towards achieving greater prosperity for the tribal communities. https://t.co/nVDVNKh1z5
— Narendra Modi (@narendramodi) November 15, 2023
Bhagwan Birsa Munda's struggles and sacrifices inspire countless Indians. pic.twitter.com/KC2oh3ViyO
— PMO India (@PMOIndia) November 15, 2023
Two historic initiatives are being launched from Jharkhand today... pic.twitter.com/9Sw2hJY0Yl
— PMO India (@PMOIndia) November 15, 2023
विकसित भारत के चार अमृत स्तंभ...
— PMO India (@PMOIndia) November 15, 2023
इन चार स्तंभों को हम जितना मजबूत करेंगे, विकसित भारत की इमारत भी उतनी ही ऊंची उठेगी। pic.twitter.com/DcjiNgMdw1
सच्चा सेकुलरिज्म तभी आता है, जब देश के किसी भी नागरिक के साथ भेदभाव की सारी संभावनाएं खत्म हो जाएं। pic.twitter.com/VvJkMufgmI
— PMO India (@PMOIndia) November 15, 2023
विकसित भारत के संकल्प का एक प्रमुख आधार है पीएम जनमन...यानि पीएम जनजाति आदिवासी न्याय महा अभियान। pic.twitter.com/0jBdMJnd7d
— PMO India (@PMOIndia) November 15, 2023