Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రముఖ తెలుగు నటుడు శ్రీ చంద్ర మోహన్ గారి కన్నుమూత పట్ల తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి


ప్రముఖ తెలుగు నటుడు శ్రీ చంద్ర మోహన్ గారు యొక్క కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢమైన దు:ఖాన్ని వ్యక్తం చేశారు.

 

ప్రధానమంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో –

‘‘ప్రసిద్ధ తెలుగు నటుడు శ్రీ చంద్ర మోహన్ గారు యొక్క మరణ వార్త తెలిసి తీవ్ర దు:ఖం కలిగింది. ఆయన సినిమా ప్రపంచం లో ఓ తరగని జ్యోతి వంటి వారు. ఆయన యొక్క ప్రభావశీలమైనటువంటి అభినయం మరియు విశిష్టమైనటువంటి సమ్మోహన శక్తి ప్రేక్షకుల ను తరాల తరబడి పరవశుల ను చేసివేశాయి. ఆయన నిష్క్రమించడం తో సృజనాత్మక జగతి లో ఏర్పడ్డ వెలితి ని భర్తీ చేయడం కఠినమే అవుతుంది. ఆయన కుటుంబానికి మరియు ఆయన సంపాదించుకొన్నటువంటి అసంఖ్య అభిమాన గణాని కి కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.