Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గుజరాత్ లోని కెవాడియాలో రూ.160 కోట్ల విలువ గల పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, ప్రారంభించిన ప్రధానమంత్రి

గుజరాత్  లోని కెవాడియాలో రూ.160  కోట్ల విలువ గల పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, ప్రారంభించిన ప్రధానమంత్రి


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్  లోని కెవాడియాలో రూ.160 కోట్ల విలువ గల అభివృద్ధి ప్రాజెక్టుల్లో కొన్నింటికి శంకుస్థాపన చేసి, మరి కొన్నింటిని ప్రారంభించారు.

ఆయన ప్రారంభించిన వాటిలో ఏక్  తా నగర్ నుంచి అహ్మదాబాద్  కు హెరిటేజ్  రైలు ఒకటి. ఇది కాకుండా నర్మదా హారతి, కమలం పార్కు, ఐక్యతా విగ్రహం చుట్టూ ప్రదక్షిణ మార్గం; 30 కొత్త ఇ-బస్సులు, 210 ఇ-సైకిళ్లు, పలు గోల్ఫ్  కార్టులు, ఏక్  తా నగర్  లో సిటీ గ్యాస్  పంపిణి వ్యవస్థ, గుజరాత్  సహకార బ్యాంకుకు చెందిన ‘‘సహకార భవన్’’ ఉన్నాయి. కెవాడియాలో ట్రామా సెంటర్ తో కూడిన సబ్ డివిజనల్ ఆస్పత్రి, సోలార్  ప్యానెల్  కు శంకుస్థాపన చేశారు.

అంతకు ముందు ప్రధానమంత్రి రాష్ర్టీయ ఏక్  తా దివస్ వేడుకల్లో పాల్గొన్నారు.