Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆసియన్ పారా గేమ్స్ లో జావెలిన్ త్రోలో రజత పతకం గెలుచుకున్న ప్రదీప్ కుమార్ కు ప్రధానమంత్రి శుభాకాంక్షలు


హాంగ్ ఝూ ఆసియన్  పారా గేమ్స్  లో జావెలిన్  త్రో- F54 ఈవెంట్  లో  రజత పతకం గెలుచుకున్న ప్రదీప్  కుమార్ కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

రాబోయే ఈవెంట్లలో కూడా అతను ఇలాంటి విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను అని తెలియచేశారు.

ఎక్స్  లో ప్రధానమంత్రి ఈ మేరకు ఒక సందేశం పోస్ట్  చేశారు.

‘‘ఆసియన్  పారా గేమ్స్  2022లో జావెలిన్  త్రో- F54 ఈవెంట్  లో అద్భుతమైన రజత పతకం గెలుచుకున్న ప్రదీప్  కుమార్  కు అభినందనలు. రాబోయే క్రీడల్లో కూడా అతను ఇలాంటి విజయాలు సాధించాలని కోరుతూ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను’’ అని పేర్కొన్నారు.