Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆసియా పారాగేమ్స్‌ ఆర్చరీలో రజత పతక విజేత రాకేష్‌ కుమార్‌కు ప్రధానమంత్రి అభినందనలు


   చైనాలోని హాంగ్‌ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్‌ పురుషుల ‘ఆర్చరీ వ్యక్తిగత కాంపౌండ్‌’ విభాగంలో రజత పతకం సాధించిన భారత విలుకాడు రాకేష్‌ కుమార్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందించారు.

మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“పురుషుల ‘ఆర్చరీ వ్యక్తిగత కాంపౌండ్‌’ విభాగంలో రజత పతకం కైవసం చేసుకున్న పారా ఆర్చర్‌ రాకేష్‌ కుమార్‌కు అభినందనలు. భవిష్యత్తులోనూ అతడు ఇదే స్ఫూర్తితో దేశం గర్వించే మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.