Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఏశియాన్ గేమ్స్2022 లో ఆర్చరీ మిక్స్ డ్ టీమ్ కాంపౌండ్ ఈవెంట్ లో బంగారు పతకాన్ని జ్యోతి సురేఖవెన్నమ్ గారు  మరియు శ్రీఓజస్ లు గెలుచుకొన్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి


హాంగ్ ఝోవు లో జరుగుతున్న ఏశియాన్ గేమ్స్ 2022 లో ఆర్చరీ మిక్స్ డ్ టీమ్ కాంపౌండ్ ఈవెంట్ లో స్వర్ణ పతకాన్ని జ్యోతి సురేఖ వెన్నమ్ గారు మరియు శ్రీ ఓజస్ లు గెలుచుకొన్నందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వారి ని అభినందించారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశం లో –

‘‘ఏశియాన్ గేమ్స్ లో ధనుర్విద్య లో మొట్టమొదటి పసిడి పతకం!

మిక్స్ డ్ టీమ్ కాంపౌండ్ ఈవెంట్ లో లక్ష్యాన్ని ఛేదించి విజేత లకు పతకాల ను ప్రదానం చేసే వేదిక లో అగ్రస్థానాన్ని అధిరోహించిన జ్యోతి సురేఖ వెన్నమ్ గారు మరియు శ్రీ ఓజస్ లు బలే గా రాణించారు. వారి అసాధారణమైనటువంటి నైపుణ్యం, కచ్చితత్వం మరియు టీమ్ వర్క్ గొప్ప గా ఫలించాయి. వారి కి ఇవే అభినందన లు.’’ అని పేర్కొన్నారు.