ఆసియా క్రీడల 10వేల మీటర్ల పరుగులో కాంస్య పతకం కైవసం చేసుకున్న గుల్వీర్ సింగ్ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ పోస్ట్ ద్వారా పంపిన ఒక సందేశంలో:
“ఆసియా క్రీడల 10వేల మీటర్ల పరుగులో కాంస్యం గెలుచుకున్న అద్భుత ప్రతిభావంతుడు గుల్వీర్ సింగ్కు అభినందనలు. అతని కఠోర శ్రమ, దృఢ దీక్ష ఎందరో క్రీడాకారులకు ఉత్తేజాన్నిస్తాయి. భవిష్యత్తులోనూ అతడు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.