Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఏశియాన్గేమ్స్ 2022 లో టెనిస్ మిక్స్ డ్ డబల్స్ ఈవెంట్ లో బంగారు పతకం వచ్చినందుకుసంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి


హాంగ్ ఝోవు లో జరుగుతున్న ఏశియాన్ గేమ్స్ 2022 లో టెనిస్ మిక్స్ డ్ డబల్స్ పోటీ లో బంగారు పతకాన్ని క్రీడాకారుడు శ్రీ రోహన్ బోపన్న మరియు క్రీడాకారిణి రుతుజ భోసలే గారు లతో కూడిన జట్టు గెలిచినందుకు అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారు.

ప్రధాన మంత్రి సామాజిక మాధ్యం ఎక్స్ లో ఒక సందేశం లో

‘‘శ్రీ రోహన్ బోపన్న మరియు రుతుజ భోసలే గారులు ఎంత గొప్ప గా ఆడారో. వారు టెనిస్ మిక్స్ డ్ డబల్స్ పోటీ లో ప్రతిష్టాత్మకమైనటువంటి బంగారు పతకాన్ని భారతదేశానికి మళ్లీ తీసుకు వస్తున్నారు. వారు అసామాన్యమైనటువంటి జట్టు భావన ను మరియు సమన్వయాన్ని చాటారు. వారి భావి ప్రయాసల లో సైతం వారు రాణించాలని కోరుకొంటూ వారికి ఇవే శుభాకాంక్షలు.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/TS