మిలాద్-ఉన్-నబీ పర్వదినం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ సమాజంలో సౌభ్రాత్రాన్ని, కరుణా స్ఫూర్తిని మరింత పెంచాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ పోస్ట్ ద్వారా పంపిన ఒక సందేశంలో:
“మిలాద్-ఉన్-నబీ సందర్భంగా శుభాకాంక్షలు. ఈ పర్వదినం మన సమాజంలో సౌభ్రాత్రాన్ని, కరుణా స్ఫూర్తిని మరింతగా ప్రోదిచేయాలి. ప్రజలంతా సంతోషంగా, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి.. ఈద్ ముబారక్!” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
Greetings on Milad-un-Nabi. May the spirit of brotherhood and kindness be furthered in our society. May everyone be happy and healthy. Eid Mubarak!
— Narendra Modi (@narendramodi) September 28, 2023