ఆసియా క్రీడల మహిళా ‘50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్’ పోటీలో స్వర్ణ పతక విజేత సిఫ్త్ కౌర్ సమ్రాను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ పోస్టు ద్వారా పంపిన సందేశంలో: న్న
“ఆసియా క్రీడల్లో మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ పోటీలో స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించిన సిఫ్త్ సమ్రాకు @SiftSamra అభినందనలు. అందునా ఈ పోటీలో ఆమె సరికొత్త రికార్డు సృష్టించడం ఆనందాన్ని రెట్టింపు చేసింది. ప్రతి భారతీయుడికీ స్ఫూర్తినిచ్చేలా దేశానికి ఘనత తెచ్చిపెట్టిన సమ్రా 3 zkభవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించాలని ఆశిస్తూ ఆమెకు నా శుభాకాంక్షలు” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
Congratulations @SiftSamra for scripting history at the Asian Games by bringing home the prized Gold Medal in the 50m Rifle 3 Positions Women’s shooting. That she has set a record makes it even more joyous. She is an inspiration to every Indian. Best wishes for her upcoming… pic.twitter.com/XNU7mvI1Ry
— Narendra Modi (@narendramodi) September 27, 2023