ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రోజ్‌గార్ మేళాలో ప్రసంగించారు. ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొత్తగా ఉద్యోగాలలో చేరిన వారికి దాదాపు 51,000 అపాయింట్‌మెంట్ లెటర్‌లను పంపిణీ చేశారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన రిక్రూట్‌లు వివిధ మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్‌లలో చేరారు. అవి డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్, ఇండియన్ ఆడిట్ & అకౌంట్స్ డిపార్ట్‌మెంట్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ రెవిన్యూ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, డిఫెన్స్ మినిస్ట్రీ, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్. దేశవ్యాప్తంగా 46 ప్రాంతాల్లో రోజ్‌గార్ మేళా జరిగింది.
ప్రధాన మంత్రి ఈరోజు అపాయింట్‌మెంట్ లెటర్‌లు అందుకున్న వారిని అభినందించారు. కృషి, అంకితభావం వల్లే ఇక్కడ ఉన్నారని, లక్షలాది మంది అభ్యర్థుల నుంచి తాము ఎంపికయ్యారని ఆయన వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న గణేష్ ఉత్సవాల సంబరాలను ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ఈ శుభ సందర్భంలో నియమించిన వారికి ఇది కొత్త జీవితానికి ‘శ్రీ గణేష్’ అని అన్నారు. “భగవాన్ గణేష్ విజయాల దేవుడు”, సేవ పట్ల రిక్రూట్ అయినవారి అంకితభావంతో దేశం తన లక్ష్యాలను సాధించగలుగుతుందని ప్రధానమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.
చారిత్రాత్మక విజయాలకు దేశం సాక్షిగా నిలుస్తోందని ప్రధాని అన్నారు. జనాభాలో సగం మందికి సాధికారత కల్పించిన నారిశక్తి వందన్ అధినియం గురించి ఆయన ప్రస్తావించారు. ‘‘30 ఏళ్లుగా నలుగుతున్న మహిళా రిజర్వేషన్ అంశం ఉభయ సభల్లో రికార్డు ఓట్లతో ఆమోదం పొందింది. ఈ నిర్ణయం కొత్త పార్లమెంట్ తొలి సెషన్‌లో జరిగింది, ఒక విధంగా కొత్త పార్లమెంట్‌లో దేశానికి ఇది కొత్త ప్రారంభం” అని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు.
నూతన భారతదేశ ఆకాంక్షలను ప్రస్తావిస్తూ, ఈ నవ భారత కలలు ఉన్నతమైనవని ప్రధాన మంత్రి అన్నారు. “2047 నాటికి భారతదేశం విక్షిత్ భారత్‌గా మారాలనే సంకల్పం తీసుకుంది” అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. రాబోయే కొద్ది సంవత్సరాల్లో, దేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని, రాబోయే కాలంలో ఇది ప్రభుత్వ ఉద్యోగులు చాలా దోహదపడతారని ఆయన నొక్కి చెప్పారు. ‘సిటిజన్స్ ఫస్ట్’ అనే విధానాన్ని తాము అనుసరిస్తామని ఆయన ఉద్ఘాటించారు. నేటి రిక్రూట్‌లు సాంకేతికతతో పెరిగారని పేర్కొన్న ప్రధాన మంత్రి, దానిని తమ పని రంగంలో ఉపయోగించుకోవాలని మరియు పాలనా సామర్థ్యాన్ని మెరుగుపరచాలని నొక్కి చెప్పారు.
పాలనలో సాంకేతికత వినియోగంపై మరింత విశదీకరించిన ప్రధాన మంత్రి, ఆన్‌లైన్ రైల్వే రిజర్వేషన్లు, ఆధార్ కార్డ్, డిజిలాకర్, ఈకేవైసి, గ్యాస్ బుకింగ్, బిల్లు చెల్లింపులు, డీబీటీ, డిజియాత్ర ద్వారా డాక్యుమెంటేషన్ సంక్లిష్టతను తొలగించడం గురించి ప్రస్తావించారు. “సాంకేతికత అవినీతిని నిలిపివేసింది, విశ్వసనీయతను మెరుగుపరిచింది, సంక్లిష్టతను తగ్గించింది, సౌకర్యాన్ని పెంచింది” అని ప్రధాన మంత్రి, కొత్త రిక్రూట్‌మెంట్‌లను ఈ దిశలో మరింతగా కృషి చేయాలని కోరారు.
గడచిన 9 సంవత్సరాలలో, ప్రభుత్వ విధానలు కొత్త దృక్కోణం, స్థిరమైన పర్యవేక్షకలు, మిషన్ మోడ్ ఇంప్లిమెంటేషన్ మరియు సామూహిక భాగస్వామ్యంపై ఆధారపడి ఉన్నాయని, స్మారక లక్ష్యాల సాధనకు మార్గం సుగమం చేశాయని ప్రధాన మంత్రి అన్నారు. స్వచ్ఛ భారత్, జల్ జీవన్ మిషన్ వంటి ప్రచారాలకు ఉదాహరణలను ఇస్తూ, చిట్ట చివరివరకు ఈ పథకాలు అందేలా సాధించడానికి ప్రయత్నాలు జరుగుతున్న ప్రభుత్వం మిషన్ మోడ్ అమలు విధానాన్ని ప్రధాన మంత్రి హైలైట్ చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, ప్రధాని స్వయంగా ఉపయోగిస్తున్న ప్రగతి ప్లాట్‌ఫారమ్‌ను ఉదాహరణగా చెప్పారు. ప్రభుత్వ పథకాలను కింది స్థాయిలో అమలు చేసే అత్యున్నత బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులదేనని ఉద్ఘాటించారు. లక్షలాది మంది యువత ప్రభుత్వ సేవల్లో చేరినప్పుడు పాలసీ అమలులో వేగం, స్థాయి ఊపందుకుంటుందని, తద్వారా ప్రభుత్వ రంగానికి వెలుపల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, కొత్త ఉపాధి ఫ్రేమ్‌వర్క్‌లు ఏర్పాటవుతాయని ఆయన పేర్కొన్నారు.
జీడీపీ వృద్ధి, ఉత్పత్తి, ఎగుమతుల పెరుగుదల గురించి మాట్లాడిన ప్రధాన మంత్రి, ఆధునిక మౌలిక సదుపాయాలలో అపూర్వమైన పెట్టుబడిని ప్రస్తావించారు. పునరుత్పాదక ఇంధనం, సేంద్రియ వ్యవసాయం, రక్షణ, పర్యాటకం వంటి రంగాలు కొత్త ఉత్సాహాన్ని చూపుతున్నాయని ఆయన చెప్పారు. భారతదేశం ఆత్మనిర్భర్ అభియాన్ మొబైల్ ఫోన్‌ల నుండి విమాన వాహక నౌకల వరకు, కరోనా వ్యాక్సిన్ నుండి ఫైటర్ జెట్‌ల వరకు ఫలితాలను చూపుతోంది. నేడు యువతకు కొత్త అవకాశాలు వస్తున్నాయన్నారు.
దేశ ప్రజలకు, కొత్త రిక్రూట్‌మెంట్లలో రాబోయే 25 సంవత్సరాల అమృత్ కాల్ ప్రాముఖ్యతను ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు. టీమ్ వర్క్ కు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. జి20 మన సంప్రదాయం, తీర్మానం, అతిథి సత్కారానికి సంబంధించిన కార్యక్రమంగా మారిందని ప్రధాని అన్నారు. జీ20 విజయానికి అందరూ జట్టుగా పనిచేశారు. “ఈ రోజు మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగుల టీమ్ ఇండియాలో భాగమవుతున్నందుకు నేను సంతోషంగా ఉన్నాను” అని ప్రధాని మోదీ అన్నారు.
రిక్రూట్ అయిన వారికి నేరుగా ప్రభుత్వంతో కలిసి పని చేసే అవకాశం ఉందని పేర్కొన్న ప్రధాన మంత్రి, వారి నేర్చుకునే ప్రయాణాన్ని కొనసాగించాలని, వారి ఆసక్తి ఉన్న రంగాలలో వారి పరిజ్ఞానాన్ని మరింత పెంచుకోవడానికి ఐజిఓటి కర్మయోగి పోర్టల్‌ను ఉపయోగించుకోవాలని వారిని కోరారు. ప్రసంగాన్ని ముగించిన ప్రధాన మంత్రి, నియమితులైన వారిని, వారి కుటుంబాలను అభినందించారు. రాబోయే 25 సంవత్సరాలలో అభివృద్ధి చెందిన దేశం సంకల్పం తీసుకోవాలని వారిని కోరారు.
***
Rozgar Mela stands as our dedicated effort to empower young individuals and strengthen their active engagement in the country's development. https://t.co/S1ZBRkXcR7
— Narendra Modi (@narendramodi) September 26, 2023
देश आज नई-नई टेक्नोलॉजी को अपनाकर जिस तेजी से आगे बढ़ रहा है, उसमें हर सरकारी कर्मचारी की भूमिका बहुत ज्यादा बढ़ गई है। pic.twitter.com/OnrrNatBDn
— Narendra Modi (@narendramodi) September 26, 2023
पिछले 9 वर्षों में हमारी नीतियों ने बड़े से बड़ा लक्ष्य हासिल करने का रास्ता तैयार किया है। सरकारी सेवाओं से लाखों युवाओं के जुड़ने से इन्हें लागू करने की स्पीड और स्केल कहीं ज्यादा बढ़ने वाली है। pic.twitter.com/3520aO3P22
— Narendra Modi (@narendramodi) September 26, 2023