ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా తొమ్మది వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు.
ఈ కొత్త వందే భారత్ రైళ్లు ,దేశవ్యాప్త అనుసంధానతను మెరుగుపరచాలన్న, రైలు ప్రయాణికులకు ప్రపంచశ్రేణి సదుపాయాలు కల్పించాలన్న
ప్రధానమంత్రి దార్శనికతను సాకారం చేయడంలో పడిన ముందడుగు గా చెప్పుకోవచ్చు.
ప్రధానమంత్రి ఈరోజు ప్రారంభించిన కొత్త వందే భారత్ రైళ్లు కింది విధంగా ఉన్నాయి. అవి:
1. ఉదయ్‌పూర్` జైపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్
2. తిరునల్వేలి` మధురై`చెన్నై వందేభారత్ ఎక్స్‌ప్రెస్
3.హైదరాబాద్ `బెంగళూరు వందేభారత్ ఎక్స్‌ప్రెస్
4.విజయవాడ` చెన్నై (వయా రేణిగుంట) వందేభారత్ ఎక్స్‌ప్రెస్
5.పాట్నా` హౌరా వందే భారత్ఎక్స్ప్రెస్
6. రాసర్ గోడ్`తిరువనంతపురం వందేభారత్ ఎక్స్‌ప్రెస్
7. రూర్కేలా` భువనేశ్వర్` పూరి వందేభారత్ ఎక్స్‌ప్రెస్
8. రాంచి` హౌరా వందే భారత్ ఎక్స్‌ప్రెస్
9. జామ్ నగర్` అహ్మదాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్
ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి, ఈరోజు జెండా ఊపి ప్రారంభిస్తున్న తొమ్మది వందేభారత్ రైళ్లు,
దేశంలో ఆధునిక అనుసంధానతకు సంబంధించి మున్నెన్నడూ చూడని సందర్భమన్నారు.
‘‘ మౌలిక సదుపాయాల అభివృద్ధి స్థాయ, వేగం 140 కోట్ల మంది ప్రజానీకం ఆశలు , ఆకాంక్షలకు సరిగ్గా సరిపోయే విధంగా ఉంది”అని ప్రధానమంత్రి అన్నారు.
ఈ రోజు ప్రారంభమైన రైళ్లు ఆధునికతతో కూడిన, సౌకర్యవంతమైన రైళ్లని తెలిపారు.
ఈ వందేభారత్ రైళ్లు నవ భారతదేశ ఉత్సాహానికి గుర్తు అని ఆయన అన్నారు.వందే భారత్ రైళ్లకు పెరుగుతున్న ప్రజాదరణ పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
ఇప్పటివరకు కోటీ 11 లక్షలమందికి పైగా ప్రజలు వందే భారత్ రైళ్లలో ప్రయాణించినట్టు ఆయన తెలిపారు.
ఇప్పటికే వివిధ రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాల ప్రజలకు 25 వందే భారత్ రైళ్లు సేవలు అందిస్తున్నట్టు ప్రధానమంత్రి చెప్పారు.
వాటికి ఈ రోజు మరో 9 వందే భారత్ రైళ్లు అదనంగా చేరాయని చెబుతూ, “దేశంలోన ప్రతి ప్రాంతంతో వందేభారత్ రైళ్లు అనుసంధానత కలిగి ఉండే రోజు ఎంతోదూరంలో లేదు”అని ఆయన అన్నారు.
వందే భారత్ రైళ్ల ప్రయోజనాన్ని గురించి వివరిస్తూ ప్రధానమంత్రి, బయలుదేరిన రోజే గమ్యస్థానానికి చేరుకోవాలన,
సమయాన్ని ఆదాచేయాలని అనుకునే వారికి ఇవి ఉపయోగకరమన్నారు.వందేభారత్ రైళ్లు ప్రయాణించే మార్గంలో పర్యాటక స్థలాలకు పర్యాటకుల రాకపోకలు పెరుగుతాయన్నారు. ఇది ఆర్థిక కార్యకలాపాలను పెంచుతుందన్నారు.దేశంపై ప్రజలకు గల ఆశ, నమ్మకాన్ని గురంచి ప్రస్తావిస్తూ, ప్రతి పౌరుడూ దేశం సాధించిన విజయాలను చూసి గర్విస్తున్నాడన్నారు.
చంద్రయాన్ 3 , ఆదిత్య ఎల్ –1 చారిత్రాత్మక విజయాలు, అలాగే జి 20 సమావేశాలను విజయవంతంగా నిర్వహించడం వంటివి
ప్రజాస్వామ్యం, ప్రజలు,వైవిద్యతల విషయంలో భారతదేశం బలమేమిటో ప్రపంచానికి చాటిచెప్పిందన్నారు. నారీశక్తి వందన్ చట్టం, మహిళలను అభివృద్ధిపథంలో ముందుకు తీసుకువెళ్లేందుకు తీసుకున్న నిర్ణయాత్మక చర్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నో రైల్వే స్టేషన్లను మహిళలే నిర్వహిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు.
ఆత్మవిశ్వాసం కలిగిన భారతదేశం, ప్రస్తుత అవసరాలను తీరుస్తూ , భవిష్యత్ అవసరాలపై కూడా సమాంతరంగా దృష్టి పెడుతున్నదన్నారు.
మౌలికసదుపాయాల రంగంలో ఎలాంటి అడ్డంకులు లేని సమన్వయానికి పి.ఎం. గతి శక్తి మాస్టర్ ప్లాన్ కృషి చేస్తున్నదని, అలాగే,
నూతన లాజిస్టిక్స్ పాలసీ రవాణా, ఎగుమతి సంబంధిత చార్జీల తగ్గింపునకు ఉపయోగపడుతున్నదన్నారు.
బహుళ పక్ష రవాణా అనుసంధానత గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, ఒక రవాణా సదుపాయం, మరో రవాణా విధానానికి మద్దతుగా ఉంటుందన్నారు.
ఇదంతా సామాన్య ప్రజల సులభతర ప్రయాణాన్ని మరింత మెరుగు పరిచేందుకేనని చెప్పారు.
సామాన్య ప్రజల జీవితాలలో రైల్వేల ప్రాధాన్యత గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, గతంలో ఈ రంగం నిర్లక్ష్యానికి గురికావడాన్ని తప్పుపట్టారు. ప్రస్తుత ప్రభుత్వం భారతీయ రైల్వేలలో తీసుకువస్తున్న పరివర్తన గురించి ప్రస్తావిస్తూ, ఈ ఏడాది రైల్వే బడ్జెట్ 2014 రైల్వే బడ్జెట్‌తో పోలిస్తే 8 రెట్లు అధికమన్నారు. అలాగే, రైల్వేలైన్ల డబ్లింగ్ పనులు, విద్యుదీకరణ, కొత్త మార్గాల పనులు పెద్ద ఎత్తున సాగుతున్నాయన్నారు.
అభివృద్ధిచెందిన దేశంగా ఎదిగేదశలో ఉన్న భారతదేశం రైల్వే స్టేషన్లను ఆధునీకరించాల్సి ఉం ద’’ని చెప్పారు.
ఈ ఆలోచనను మనసులో ఉంచుకుని దేశంలో తొలిసారిగా రైల్వే స్టేషన్ల అభివృద్ధి, ఆధునీకరణకు ప్రచారం ప్రారంభించినట్టు చెప్పారు.
ఇవాళ, రికార్డు స్థాయిలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మితమవుతున్నాయన్నారు.
కొద్ది రోజుల క్రితమే 500 ప్రధాన రైల్వే స్టేషన్ల పునరభివృద్ధి ప్రారంభమైందన్నారు. ఈ కొత్త స్టేషన్లు అమృత్ కాల్
లో నిర్మించిన వాటిని అమృత్ భారత్ స్టేషన్లు అని పిలుస్తారని ప్రధానమంత్రి చెప్పారు. “ఈ స్టేషన్లు రాగల రోజులలో నవభారతదేశానికి
గుర్తుగా నిలుస్తాయని ”అన్నారు.
రైల్వేలు , రైల్వే స్టేషన్ ఏర్పాటుకు సంబంధించి స్థాపనా దివస్‌ను జరుపుతున్నట్టు ప్రధానమంత్రి తెలిపారు. కోయంబత్తూరు,
చత్రపతి శివాజీ టెర్మినస్, ముంబాయి స్టేషన్ల ఉత్సవాల గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు.కోయంబత్తూరు రైల్వే స్టేషన్ ఏర్పడి 150 సంవత్సరాలు పూర్తి అయిందన్నారు.
“ప్రస్తుతం రైల్వేస్టేషన్ల బర్త్‌డే ఉత్సవాలను మరింతగా విస్తరించి , ఇందులో మరింత మంది పాల్గొనేలా చేయడం జరుగుతుంది”అని ఆయన అన్నారు.
సంకల్ప్ సే సిద్ధి మాధ్యమంగా ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ దార్శనికతను దేశం సాకారం చేసిందన్నారు.
2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దడానికి ప్రతి రాష్ట్రం , ప్రతిరాష్ట్ర ప్రజల అభివృద్ధి అత్యావశ్యకం”అని ప్రధానమంత్రి అన్నారు.
రైల్వే మంత్రి కి చెందిన రాష్ట్రంలోనే అభివృద్ధి అనే భావన గతంలో దేశాన్ని ఎంతగానో నష్టపరిచిందని అన్నారు.
ఏరాష్ట్రమూ వెనుకబడడానికి ఇక ఇప్పుడు వీలు లేదని మనం, సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ దార్శనికతతో ముందుకు వెళ్లాలి అని ప్రధానమంత్రి అన్నారు.
కష్టించి పనిచేసే రైల్వే ఉద్యోగుల నుద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి, ప్రయాణికుల ప్రతి ప్రయాణమూ ఎప్పటికీ గుర్తుండి పోయే మధురానుభూతిగా తీర్చిదిద్దాలన్నారు.
“సులభతర ప్రయాణం విషయంలో ప్రతి రైల్వే ఉద్యోగి ఎంతో సున్నితత్వంతో ఉండాలని, ప్రయాణికులకు
మంచి ప్రయాణసౌలభ్యం కల్పించాలని’’ సూచించారు.
రైల్వేలలో పరిశుభ్రతకు సంబంధించి నూతన ప్రమాణాలను ప్రతి భారతీయుడు గమనించి ఉంటాడని ప్రధానమంత్రి తెలిపారు.
అక్టోబర్ 1 వ తేదీ ఉదయం 10 గంటలకు , మహాత్మాగాంధీకి నివాళి అర్పించి, ఉదయం 10 గంటలకు ప్రతిపాదిత స్వచ్ఛతా
అభియాన్ లో పాలుపంచుకోవాలని సూచించారు. ఖాదీ, స్వదేశీ ఉత్పత్తుల కొనుగోలుకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.
అక్టోబర్ 2 గాంధీ జయంతి నుంచి అక్టోబర్ 31 సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వరకు ఓకల్ ఫర్ లోకల్ నినాదాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. “భారతీయ రైల్వేలోని ప్రతి స్థాయిలో,, సమాజంలోని ప్రతి రంగంలో మార్పులు చోటుచోసుకుంటున్నాయన్న విశ్వాసం నాకు ఉంది. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ రూపుదిద్దుకోవడానికి ఇది ముఖ్యమైన ముందడుగు”అని ప్రధానమంత్రి అన్నారు.
గవర్నర్లు, ముఖ్యమంత్రులు, మంత్రులు, పార్లమెంటు సభ్యులు,
కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నేపథ్యం:
ఈ తొమ్మిది రైళ్లు 11 రాష్ట్రాలతో అంటే రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్,కర్ణాటక, బీహార్, పశ్చిమబెంగాల్, కేరళ, ఒడిషా, జార్ఖండ్ గుజరాత్‌లతో అనుసంధానాన్ని పెంపొందిస్తాయి.
ఈ వందే భారత్ రైళ్లు అవి ప్రయాణించే మార్గాలలో అత్యంత వేగంగా వెళ్ళేరైళ్లుగా ఉంటాయి.వీటితో ప్రయాణికులకు తమ గమ్య స్థానం చేరడానికి చెప్పుకోదగిన సమయం ఆదా అవుతుంది.రూర్కేలా ` భువనేశ్వర్ `పూరి మార్గంలో నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ అలాగే కాసర్ గోడ్` తిరువనంతపురం వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఆరూట్లో నడిచే రైళ్లకన్న మూడు గంటలు ఆదా చేస్తు వేగంగా వెళతాయి. అలాగే హైదరాబాద్, బెంగళూరు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణ సమయాన్ని రెండున్నర గంటలు ఆదా చేస్తుంది. తిరునల్వేఇ` మదురై`చెన్నై వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌తో రెండు గంటలు ప్రయాణ
సమయం ఆదా అవుతుంది. రాంచీ `హౌరా వందేభారత్ ఎక్స్‌ప్రెస్, పాట్నా` హౌరా వందేభారత్ ఎక్స్‌ప్రెస్, జామ్‌నగర్`అహ్మదాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ లు గంట ప్రయాణ సమయాన్ని ఆదా చేస్తాయి.ఉదయ్‌పూర్` జైపూర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ అరంగంట ప్రయాణసమయాన్ని ఆదాచేస్తుంది.
దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మికకేంద్రాలతో అనుసంధానత మెరుగుపడాలన్న ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా, రూర్కేలా` భువనేశ్వర్ ` పూరి వందేభారత్ ఎక్స్‌ప్రెస్, తిరునల్వేలి`మదురై`చెన్నై వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లలు పూరి , మదురై వంటి ప్రధాన ఆథ్యాత్మిక కేంద్రాలను అనుసంధానం చేస్తాయి. అలాగే విజయవాడ ` చెన్నై మధ్య రేణిగుంట మీదుగా నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ తిరుపతి పుణ్యక్షేత్రానికి అనుసంధానత పెంచుతుంది.
ఈ వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టడం వల్ల దేశంలో రైలుసేవలలో నూతన ప్రమాణాలను నెలకొల్పినట్టు అవుతోంది.ఈ రైళ్లు ప్రపంచశ్రేణి సదుపాయాలు కలిగిఉంటాయి. అలాగే భద్రతాపరంగా ఆధునిక ఫీచర్లు కలిగి ఉంటాయి. కవచ్‌సాంకేతికత కూడా ఇందులో ఉంది. ఆధునిక, వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని సామాన్యుడికి, ప్రొఫెషనల్స్‌కు, వ్యాపారరంగంలోని వారికి,విద్యార్థులకు, పర్యాటకులకు అందుబాటులోకి తేవడంలో ఇది ఒక కీలక ముందడుగు.
Nine Vande Bharat Express trains being launched today will significantly improve connectivity as well as boost tourism across India. https://t.co/btK05Zm2zC
— Narendra Modi (@narendramodi) September 24, 2023
New Vande Bharat trains will improve connectivity across the country. pic.twitter.com/Buj1AsoY9Q
— PMO India (@PMOIndia) September 24, 2023
वो दिन दूर नहीं, जब वंदेभारत देश के हर हिस्से को कनेक्ट करेगी। pic.twitter.com/39G8ZmkjxW
— PMO India (@PMOIndia) September 24, 2023