Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సెప్టెంబర్ 22 వ తేదీ నాడు టీమ్ జి-20 తో భేటీ కానున్న ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సెప్టెంబర్ 22 వ తేదీ నాడు సాయంత్రం 6 గంటల కు భారత్ మండపం లో టీమ్ జి-20 తో భేటీ అవుతారు. ప్రధాన మంత్రి ఈ సందర్భం లో ఆహ్వానితుల ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం అనంతరం విందు కార్యక్రమం ఉంటుంది.

 

జి-20 శిఖర సమ్మేళనం సఫలం అయ్యేందుకు తోడ్పాటు ను అందించడం లో కీలక పాత్ర ను పోషించిన సుమారు మూడు వేల మంది ఈ కార్యక్రమం లో పాలుపంచుకోనున్నారు. ఇందులో విశేషించి శిఖర సమ్మేళనం సాఫీ గా సాగిపోయేటట్టు తోడ్పాటును అందించడం కోసం క్షేత్ర స్థాయి లో పాటుపడిన వారు భాగం పంచుకోనున్నారు. వారి లో వివిధ మంత్రిత్వ శాఖల కు చెందిన పారిశుద్ధ్య శ్రమికులు, డ్రైవర్ లు, వేటర్ లు మరియు ఇతర పనివారు ఉన్నారు. ఈ కార్యక్రమం లో వేరు వేరు శాఖల మంత్రుల తో పాటు విభిన్న విభాగాల కు చెందిన అధికారులు కూడా భాగస్తులు కానున్నారు.

 

***