Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

డిజిటల్ పరివర్తన లో భాగంగా విస్తృత జనాభా స్థాయి లో అమలు చేయబడిన విజయవంతమైన డిజిటల్ పరిష్కారాలను పంచుకునే రంగంలో సహకారంపై భారతదేశం మరియు సియెర్రా లియోన్ మధ్య అవగాహన ఒప్పందంపై సంతకం చేయడానికి క్యాబినెట్ ఆమోదించింది


డిజిటల్ పరివర్తన లో భాగంగా విస్తృత జనాభా స్థాయి లో అమలు చేయబడిన విజయవంతమైన డిజిటల్ పరిష్కారలనులను పంచుకునే రంగంలో సహకారంపై భారత దేశ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మరియు సియెర్రా లియోన్ సమాచార మరియు కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ మధ్య జూన్ 12, 2023న అవగాహన ఒప్పందం సంతకానికి గౌరవప్రదమైన ప్రధాన మంత్రి అధ్యక్షత వహించిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

 

రెండు దేశాల డిజిటల్ పరివర్తన కార్యక్రమాల అమలులో సన్నిహిత సహకారం మరియు అనుభవాల మార్పిడి మరియు డిజిటల్ టెక్నాలజీ ఆధారిత పరిష్కారాలను (ఉదా.ఇండియా స్టాక్) ప్రోత్సహించడానికి ఈ ఎమ్ఒయు ఉద్దేశించబడింది. ఐ టీ రంగంలో ఉపాధి అవకాశాలకు దారితీసే మెరుగైన సహకారాన్ని ఎమ్ఒయు ఆశిస్తోంది.

 

ఎమ్ఒయు పార్టీలు సంతకం చేసిన తేదీ నుండి అమలులోకి వస్తుంది మరియు 3 సంవత్సరాల పాటు అమలులో ఉంటుంది.

 

డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగంలో జీ 2 జీ మరియు బీ 2 బీ ద్వైపాక్షిక సహకారం రెండూ మెరుగుపడతాయి. ఈ అవగాహన ఒప్పందానికి సంబంధించిన కార్యకలాపాలకు సాధారణ పరిపాలన  నిర్వహణ కేటాయింపుల ద్వారా నిధులు సమకూరుస్తాయి.

 

ఐ సీ టీ రంగం లో ద్వైపాక్షిక మరియు బహుపాక్షిక సహకారాన్ని పెంపొందించడం కోసం ఎం ఈ ఐ టీ వై అనేక దేశాలు మరియు బహుపాక్షిక ఏజెన్సీలతో సహకరిస్తోంది. ఎం ఈ ఐ టీ వై,  ఐ సీ టీ రంగంలో సహకారాన్ని మరియు సమాచార మార్పిడిని ప్రోత్సహించడానికి వివిధ దేశాలకు చెందిన  సంస్థలు/ఏజెన్సీలతో అవగాహన ఒప్పందాలు/ఎం ఓ సీ లు/ఒప్పందాలను కుదుర్చుకుంది. ఇది డిజిటల్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా మొదలైన భారత ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలకు అనుగుణంగా దేశాన్ని డిజిటల్ సాధికారత కలిగిన సమాజంగా మరియు విజ్ఞాన ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి ఉపకరిస్తుంది. మారుతున్న ఈ నమూనాలోపరస్పర సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో వ్యాపార అవకాశాలను అన్వేషించడం, ఉత్తమ పద్ధతులను పంచుకోవడం మరియు డిజిటల్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం ప్రస్తుత అవసరం.

 

గత కొన్నేళ్లుగా డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అమలులో భారతదేశం తన నాయకత్వాన్ని ప్రదర్శించింది అలాగే కోవిడ్  మహమ్మారి సమయంలో కూడా ప్రజలకు మెరుగైన సేవలను విజయవంతంగా అందించింది. ఫలితంగా అనేక దేశాలు భారతదేశ అనుభవాల నుండి నేర్చుకోవడానికి భారతదేశంతో అవగాహన ఒప్పందాలను కుదుర్చుకోవడానికి ఆసక్తిని కనబరుస్తున్నాయి.

 

ఇండియా స్టాక్ సొల్యూషన్స్ అనేది ప్రజా సేవలను  అందజేయడానికి జనాభా స్థాయిలో భారతదేశం అభివృద్ధి చేసిన మరియు అమలు చేసిన డి పీఐ లు. అర్థవంతమైన అనుసంధానతను అందించడం, డిజిటల్ చేరికను ప్రోత్సహించడం మరియు నిరంతరాయమైన ప్రజా సేవల అందుబాటును ఇది  లక్ష్యంగా పెట్టుకుంది. ఇవి బహిరంగ సాంకేతికతలపై నిర్మించబడ్డాయి, పరస్పరం పనిచేయగలవు మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించే పరిశ్రమ మరియు సమాజ భాగస్వామ్యాన్ని ఉపయోగించుకునేలా రూపొందించబడ్డాయి. డీ పీ ఐ ని నిర్మించడంలో ప్రతి దేశానికి ప్రత్యేక అవసరాలు మరియు సవాళ్లు ఉన్నాయి, అయినప్పటికీ ప్రాథమిక కార్యాచరణ సారూప్యంగా ఉంటుంది, ఇది ప్రపంచ సహకారాన్ని అనుమతిస్తుంది

***