Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రిపబ్లిక్ ఆఫ్ కొరియా అధ్యక్షడితో సమావేశమైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ

రిపబ్లిక్ ఆఫ్  కొరియా అధ్యక్షడితో సమావేశమైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ


ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ , న్యూఢిల్లీలో జరుగుతున్న జి 20 శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా  , రిపబ్లిక్ ఆప్ కొరియా అధ్యక్షుడు , హిజ్ ఎక్సలెన్సీ యూన్ సుక్ యోల్ ను కలుసుకున్నారు.
ఇండియా జి20 అధ్యక్షత బాధ్యతలు నిర్వహిస్తున్నందుకు అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ప్రధానమంత్రికి అభినందనలు తెలిపారు. చంద్రయాన్ మిషన్ విజయవంతం   కావడం పట్ల కూడా వారు ప్రధానమంత్రిని అభినందించారు.
ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 50 సంవత్సరాలు అవుతున్న విషయాన్ని ఇరువురు నాయకులు గుర్తుచేసుకున్నారు. ద్వైపాక్షిక ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం, వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ రంగ ఉత్పత్తులు,
సెమీ కండక్టర్లు,  ఇ.వి. బ్యాటరీ సాంకేతికత వంటి అంశాలపై పురోగతిని వారు ఈ సమావేశంలో సమీక్షించారు.
ప్రాంతీయ , అంతర్జాతీయ అంశాలపై వారు పరస్పరం అభిప్రాయాలు తెలియజేసుకున్నారు.

 

***